కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తనయుడు అనంత్ అంబానీ పాల్గొన్నారు. రిలయన్స్ వార్షిక సమావేశంలో గురువారం పాల్గొన్న ముఖేష్, ఆయన కుటుంబసభ్యులు టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చే జియో ఆఫర్ల వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.