
శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం
తిరుమల: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబెన్ మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమ యం అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నా రు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.
ఐపీఎల్‌లో తమ ముంబై ఇండియన్స్ జట్టు మంగళవారం రాత్రి 8 గంటలకు తొలి క్వాలిఫై మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఉదయం శ్రీవారిని దర్శించుకుని తమ జట్టు విజయం సాధించాలని కోరుకున్నట్లు వారి అనుచరులు విలేకరులకు తెలిపారు.