మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందచేశారు.
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శరత్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందచేశారు. ప్రమాదం జరిగిన కాకతీయ స్కూల్ బస్సులో మొత్తం 38మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 13మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు నివేదికలో వెల్లడించారు. మరో 15మంది తీవ్రంగా గాయపడగా, ప్రమాదం నుంచి ముగ్గురు విద్యార్థులు మాత్రమే క్షేమంగా బయటపడినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల సఖ్యతో పాటు పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో అందచేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.