
బాలాజీ ఆస్పత్రిలో 12మంది విద్యార్థులకు చికిత్స
హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు కొంపల్లి బాలాజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 12bమంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
కాగా గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని నలుగురిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా తరలించినట్లు సమాచారం. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ .... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమీక్ష నిర్వహించారు.