హైదరాబాద్కు 9 మంది విద్యార్థుల తరలింపు | 9 severely injured studetns shifted to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు 9 మంది విద్యార్థుల తరలింపు

Published Thu, Jul 24 2014 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

హైదరాబాద్కు 9 మంది విద్యార్థుల తరలింపు

హైదరాబాద్కు 9 మంది విద్యార్థుల తరలింపు

నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది విద్యార్థులను మూడు అంబులెన్సులలో హైదరాబాద్కు తరలించారు. అయితే, ఎక్కడకు తీసుకెళ్తున్నదీ చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు పిల్లలను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పాలని, చెబితే తాము కూడా వెళ్తామని వారు అంటున్నా, అధికారులు మాత్రం అప్పటికప్పుడు వాళ్లను తరలించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని తరలించేటప్పుడు అంబులెన్సులో ఆక్సిజన్ సహా అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. కానీ, ఇక్కడ అలాంటి అంబులెన్సులు వారికి దొరక్కపోవడంతో సర్వసాధారణ వాహనాల్లోనే పిల్లలను మాసాయిపేట నుంచి హైదరాబాద్కు తరలించారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినా, అధికారులెవ్వరూ వాళ్లకు సమాధానం ఇవ్వలేదు. చివరకు పిల్లలను హైదరాబాద్లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement