న్యూ మేనాగురి: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్‌దువార్ డివిజన్‌లోని న్యూ మేనాగురి స్టేషన్‌లో ఒక గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన దరిమిలా ఈ మార్గంలో వెళ్లే రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇది ఐదు లైన్లతో కూడిన స్టేషన్ అని, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
గూడ్సు రైలు పట్టాలు తప్పిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు(మంగళవారం) ఉదయం 6:20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అలీపుర్‌దూర్ డివిజన్ డీఆర్‌ఎం అమర్జీత్ గౌతమ్ తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. కాగా గత నెలలో కూడా పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాడు ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌లోని కుమేదర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్‌జీపీ నుంచి కతిహార్ వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.
#WATCH | 5 wagons of an empty goods train derailed at New Maynaguri station in Alipurduar division. Trains have been diverted through alternate routes and movement has not been affected. Senior officers including DRM Alipurduar have moved to the site. Restoration work is going… pic.twitter.com/6GKv0otIAB
— ANI (@ANI) September 24, 2024
ఇది కూడా చదవండి: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
Comments
Please login to add a commentAdd a comment