ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్
మెదక్: మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాంతో 44వ జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.
పలుమార్లు అధికారులకు విజ్క్షప్తి చేసినా పట్టించకోకపోవడంపై అధికారులను నిలదీశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాద ఘటనపై కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు.