Masaipeta Rail accident
-
రైలు ఆలస్యం కాకుంటే, చిన్నారులు...
మెదక్: నాందేడ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ప్యాసింజర్ ఆలస్యం చిన్నారుల పాలిట మృత్యువుగా మారింది. నాలుగు గంటల ఆలస్యంతో మూసాయిపేట స్టేషన్ కు చేరుకుంది. 4గంటల 43నిమిషాల ఆలస్యంగా మూసాయిపేట స్టేషన్ కు చేరుకున్న ప్యాసింజర్ 13 నిమిషాల పాటు ఆగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఆలస్యమే చిన్నారుల జీవితాన్ని చిదిమేసింది. సకాలంలో రైలు వచ్చి ఉంటే స్కూల్ విద్యార్థులు ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది -
ప్రమాద స్థలానికి బయలుదేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో మసాయిపేట బస్సు ప్రమాద స్థలానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి సహాయచర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశించారు. బస్సు ప్రమాదంలో స్కూల్ విద్యార్థుల మరణవార్తపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రైల్వేగేట్ వద్ద బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీసుకోకపోవడంతోనే అభం శుభం తెలియని 20 మంది స్కూల్ విద్యార్ధులు మరణించారు. -
ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్
-
ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్
మెదక్: మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాంతో 44వ జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. పలుమార్లు అధికారులకు విజ్క్షప్తి చేసినా పట్టించకోకపోవడంపై అధికారులను నిలదీశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాద ఘటనపై కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
మసాయిపేట: బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే మెదక్ జిల్లాలో మసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ డ్యూటికి ఆలస్యంగా రావడం.. తొందరగా పిల్లల్ని స్కూల్ చేరవేయాలనే ఉద్దేశ్యంతో వేగంగా బస్సును నడిపించినట్టు తెలుస్తోంది. రైల్వేగేట్ వద్ద బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీసుకోకపోవడంతోనే అభం శుభం తెలియన 26 మంది స్కూల్ విద్యార్ధులు మరణించారు. స్కూల్ బస్సు ఇస్లాంపూర్ నుంచి తుఫ్రాన్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాకతీయ స్కూల్ కు చెందిన బస్సులో మొత్తం 38 విద్యార్ధులు ఉన్నట్టు తెలుస్తోంది.