ప్రమాద స్థలానికి బయలుదేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో మసాయిపేట బస్సు ప్రమాద స్థలానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి సహాయచర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో స్కూల్ విద్యార్థుల మరణవార్తపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రైల్వేగేట్ వద్ద బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీసుకోకపోవడంతోనే అభం శుభం తెలియని 20 మంది స్కూల్ విద్యార్ధులు మరణించారు.