దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment