మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్యాసింజర్లతో హైవేపై వెళ్తోన్న ఎలైట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అందులో ఆరుగురు భారతీయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు మెక్సికో అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో వేర్వేరు దేశాలకు చెందిన వారితో పాటు కొంతమంది అమెరికా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులు.
మెక్సికో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సరిహద్దులోని తెపిక్ ప్రాంతంలో బారాంకా బ్లాంకా హైవేపై టిజువానా ఉత్తర సరిహద్దు వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదే స్పీడులో టర్నింగ్ తిరగడంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని.. అందులో డామినిక్ రిపబ్లిక్, భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన 42 మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. వీరిలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మందిని మాత్రం చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించమని వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు నయారిట్ అధికారులు.
నయారిట్ భద్రతా, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ బస్సు లోయలో సుమారు 40 మీటర్లు(131 అడుగులు) లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగానే సాగుతున్నాయన్నారు. ఎలైట్ బస్సు కంపెనీ వారి నుంచి కానీ, మెక్సికో మైగ్రేషన్ వారి నుంచి కానీ సంఘటనపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.
🚍Autobús de pasajeros cayó aun profundo barranco, de la línea Elite numero económico 4726 ruta México -Tijuana escala en Guadalajara, Jalisco
— Reportes de Tráfico Vallarta Tepic Guadalajara 🚧 (@ClarabellaDra) August 3, 2023
Más de 20 decesos y 20 lesionados
⚠️Estará cerrado el paso ambos sentidos. Ruta alterna por autopista Guadalajara-Tepic hacia Mazatlán pic.twitter.com/BjJxuOmtQ9
ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఇది మూడోది. ఫిబ్రవరిలో సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో 17 మంది మృతిచెందగా గత నెల దక్షిణ రాష్ట్రమైన ఒక్సాకాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 29 మంది మృతి చెందారు.
ఇది కూడా చదవండి: యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...!
Comments
Please login to add a commentAdd a comment