Mexico City
-
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
వలసదారుల ట్రక్కు బోల్తా.. 10 మంది దుర్మరణం
దక్షిణ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్‌లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కు హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది వలసదారులు మరణించారు 25 మందికి పైగా వలసదారులు గాయాలపాలయ్యారు. మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు 18 ఏళ్లలోపు వయస్సు గలవారున్నారన్నారు. గ్వాటెమాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలో వలసదారులకు సంబంధించి ఇది రెండవ ప్రమాదం అని తెలుస్తోంది. ప్రమాద బాధితులంతా క్యూబన్లు అని ఒక అధికారి వార్తాసంస్థకు వెల్లడించారు. దక్షిణ రాష్ట్రమైన చియాపాస్‌లోని పిజ్జియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు 27 మంది క్యూబా వలసదారులను తీసుకువెళుతున్నారు. పిజిజియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. లారీ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు తునాతునకలయ్యింది. వలసదారులు తరచూ రష్యా నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా వలసదారులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత గురువారం తెల్లవారుజామున చియాపాస్ రాష్ట్రంలోని మెజ్కలాపా మున్సిపాలిటీ పరిధిలో ఒక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలసదారులు మరణించారు. అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది వలసదారులు మెక్సికో నుంచి బస్సులు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లలో సైతం ప్రయాణిస్తుంటారు. 2021లో జరిగిన ఇటువంటి ప్రమాదంలో 55 మంది వలసదారులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జపనీస్ కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకోరు? -
మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు
మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్యాసింజర్లతో హైవేపై వెళ్తోన్న ఎలైట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అందులో ఆరుగురు భారతీయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు మెక్సికో అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో వేర్వేరు దేశాలకు చెందిన వారితో పాటు కొంతమంది అమెరికా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులు. మెక్సికో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సరిహద్దులోని తెపిక్ ప్రాంతంలో బారాంకా బ్లాంకా హైవేపై టిజువానా ఉత్తర సరిహద్దు వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదే స్పీడులో టర్నింగ్ తిరగడంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని.. అందులో డామినిక్ రిపబ్లిక్, భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన 42 మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. వీరిలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మందిని మాత్రం చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించమని వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు నయారిట్ అధికారులు. నయారిట్ భద్రతా, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ బస్సు లోయలో సుమారు 40 మీటర్లు(131 అడుగులు) లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగానే సాగుతున్నాయన్నారు. ఎలైట్ బస్సు కంపెనీ వారి నుంచి కానీ, మెక్సికో మైగ్రేషన్ వారి నుంచి కానీ సంఘటనపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. 🚍Autobús de pasajeros cayó aun profundo barranco, de la línea Elite numero económico 4726 ruta México -Tijuana escala en Guadalajara, Jalisco Más de 20 decesos y 20 lesionados ⚠️Estará cerrado el paso ambos sentidos. Ruta alterna por autopista Guadalajara-Tepic hacia Mazatlán pic.twitter.com/BjJxuOmtQ9 — Reportes de Tráfico Vallarta Tepic Guadalajara 🚧 (@ClarabellaDra) August 3, 2023 ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఇది మూడోది. ఫిబ్రవరిలో సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో 17 మంది మృతిచెందగా గత నెల దక్షిణ రాష్ట్రమైన ఒక్సాకాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. ఇది కూడా చదవండి: యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...! -
చరిత్ర సృష్టించిన వెర్స్టాపెన్.. షుమాకర్, వెటెల్ రికార్డు బద్దలు
మెక్సికో సిటీ: ఫార్ములా వన్ సర్క్యూట్లో రెడ్‌బుల్ డ్రైవర్, నెదర్లాండ్స్‌కు చెందిన మ్యాక్స్ వెర్స్టాపెన్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఆటోడ్రోమో హెర్మనోస్ రోడ్రిగ్స్లో జరిగిన రేస్‌లో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 1 గంటా 38 నిమిషాల 36.729 సెకన్లలో రేస్ పూర్తి చేసిన అతను మొదటి స్థానాన్ని అందుకున్నాడు. లూయీస్ హామిల్టన్ (మెర్సిడెజ్), సెర్గెయో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తాజా విజయంతో 2022 సీజన్లో వెర్స్టాపెన్ 14 రేస్‌లలో విజేతగా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతో అతను ఒకే సీజన్లో విజయాల సంఖ్యపరంగా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఒకే సీజన్లో అత్యధిక రేస్‌లు (13) నెగ్గిన ఘనత మైకేల్ షుమాకర్ (2004), సెబాస్టియన్ వెటెల్ (2013) పేరిట ఉండగా ఇప్పుడు దానిని వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 20 రేస్‌లు జరగ్గా, పెరెజ్ రెండు నెగ్గడంతో 16 రేస్‌లు రెడ్‌బుల్ ఖాతాలోకే చేరాయి. ఈ సీజన్లో హామిల్టన్ ఒక్క రేస్ కూడా నెగ్గలేకపోయాడు. తర్వాతి రేస్ 13 నవంబర్‌నుంచి బ్రెజిల్‌లోని సావో పాలోలో జరుగుతుంది. చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? -
డ్రగ్స్ ముఠా కాల్పులు.. మేయర్ సహా 18 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో మరోసారి తుపాకీ మోతలతో అట్టుడికింది. శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా, ఆయన తండ్రి జువాన్ కూడా ఉన్నారని స్థానిక మీడియాలు తెలిపాయి. కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మేయర్ హత్య కోసమే.. కాల్పులకు పాల్పడి దుండగులు ‘లాస్ టెకిలెరోస్’ డ్రగ్స్ ముఠాకు చెందినవారిగా అధికారులు భావిస్తున్నారు. మేయర్‌ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపలికి ప్రవేశించి, ముందస్తు ప్రణాళిక ప్రకారం వరుస దాడులు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. మేయర్ మృతిపై గెరెరో గవర్నర్ ఎవెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది. ఇదీ చదవండి: రష్యాకు షాక్.. విలీన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటున్న ఉక్రెయిన్! -
130 మిలియన్ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు
మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్ ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ను అమ్మడానికి మెక్సికన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అమ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్ చానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్‌ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్రూమ్లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం) ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్ ఒబ్రాడోర్ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్ ఒబ్రాడోర్ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్ కోసం 120 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....) ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్‌లో ఓ రాఫెల్ విమానం కూడా ఉన్నట్లు సమాచారం. -
హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్: 13 మంది మృతి
మెక్సికో సిటీ: భూకంపం వచ్చిన ప్రాంతంలో పర్యటించేందుకు మెక్సికో హోంమంత్రి హెలికాప్టర్లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. శుక్రవారం మెక్సికో హోం మంత్రి అల్ఫోన్సో నవరెట్, ఓక్సాక స్టేట్ గవర్నర్ అలెజాండ్రో మురాత్లు సైనిక హెలికాప్టర్లో వెళ్తుండగా దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో ఉన్న 12 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మంత్రి, గవర్నర్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. -
బుల్‌ఫైట్ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము
-
బుల్‌ఫైట్ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము
మెక్సికో: బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడుస్తూ హింసించే బుల్‌ఫైట్ క్రీడలో దారుణం చోటు చేసుకుంది. దున్నపోతుకు, బుల్ఫైటర్కు మధ్య మెక్సికోలో హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో దున్నను తన చేతిలో ఉన్న ఎరుపు రంగు జెండాను చూపిస్తూ తన ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అదును చూసుకొని దున్న బుల్ ఫైటర్‌ను ఒక్క కుమ్ము కుమ్మడంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో జెండాతో పాటూ చేతిలోని ఆయుధం కిందపడిపోయాయి. కిందపడిపోయిన అతనిపై దున్న ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించింది. తప్పించుకోవడానికి ప్రయాత్నించే క్రమంలోనే దున్న అతని వెనకవైపు భాగంతో పొడిచింది. దీంతో 11 ఇంచుల మేర కొమ్ము అతని వెనక భాగంలోకి దూసుకుపోయింది. తీవ్రగాయాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
అసహజ పద్ధతిలో శృంగారం కోరి...
మెక్సికో: ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడుపుతూ ప్రాణాలు కోల్పోయింది. అసహజ పద్ధతిలో ఆమె శృంగారాన్ని కోరుకుని ఆ క్రమంలో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు విస్తుపోయే విషయాలు చెప్పాడు. ఆమెకు వాయిలెంట్ సెక్స్ అంటే ఇష్టమని ఆ క్రమంలోనే చనిపోయిందని వెల్లడించాడు. అతడు చెప్పిన ప్రకారం... మెక్సికోలో టానియా ట్రినిడాడ్ పారెడెస్ (23) అనే యువతి సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమెకు జువాన్ రుయిజ్ టార్రెస్(32) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె అతడు మరో వ్యక్తితో కలిసి తన అపార్ట్ మెంట్లో మద్యం సేవించారు. ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. అలా పాల్గొనే క్రమంలో ఆమె రెండో వ్యక్తితో కూడా అసహజ పద్ధతిలో శృంగారానికి ఒత్తిడి చేసింది. అంతేకాదు ఓ కేబుల్ వైర్ తో తనను కొడుతూ ఉండాలని కోరిందని ఆ క్రమంలో అనూహ్యంగా కుప్పకూలి చనిపోయిందని చెప్పాడు. శవపరీక్ష నివేదికలో కూడా అతడు చెప్పిన విషయాలను బలపరిచే విధంగా ఉంది. ఊపిరి స్తంభించిపోయి ఆమె మృతి చెందిందని తెలిపింది. దీంతో పోలీసులు ప్రస్తుతానికి అతడిని అరెస్టు చేయకుండా మరో కోణంలో విచారిస్తున్నారు. -
భారత్‌లో అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆఫర్లు
న్యూఢిల్లీ: భారత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థలు విమాన చార్జీలపై డిస్కౌంట్లు... కొత్త కొత్త సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ విమాన చార్జీల్లో 20% డిస్కౌంట్‌ను ప్రకటించింది. దక్షిణ అమెరికాకు వెళ్లే విమానాల్లో బిజినెస్ క్లాస్(క్లబ్ వరల్డ్) టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు నేటి నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే నెల 31లోపు ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇక లుఫ్తాన్సా సంస్థ బెంగళూరు-లండన్ మార్గంలో తొలిసారిగా ఈ నెల 22 నుంచి ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరి చయం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ఫ్రాంక్ఫర్ట్-బెంగళూరు మార్గంలో అంది స్తున్నామని పేర్కొంది. మలేసియా ఎయిర్‌లైన్స్ యెస్ ఆఫర్లు ఇక మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇయర్ ఎండ్ స్పెషల్ (యెస్) ఆఫర్లను అందిస్తోంది. భారత్ నుంచి మలేషియాకు ఎకానమీ క్లాస్ రాను, పోను చార్జీ రూ.11,860, ఇండోనేసియాకు రూ. 15,890, చైనాకు రూ.20,830, ఆస్ట్రేలియాకు రూ.39,660 అని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయని, వచ్చే నెల 2 వరకూ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. -
లా లొరోనా
విన్న ప్రతిదాన్నీ నమ్మలేం. నమ్మిన ప్రతిదీ నిజమనీ చెప్పలేం. ముఖ్యంగా దెయ్యాల విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, వాటి గురించిన కథనాలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో ఇదొకటి... లా లొరోనా గురించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత మారియా మరో వ్యక్తితో ప్రేమలో పడిందని, అతడి కోసం తన భర్తను, పిల్లలను కూడా చంపేసిందని, అప్పటికీ అతడు తనని స్వీకరించకపోవడంతో అవమానం భరించలేక మరణించిందని కొందరు అంటుంటారు. చనిపోయేముందు తన పిల్లలను చంపినందుకు ఎంతో కుమిలిపోయిందని, అందుకే ఆమె ఆత్మ వాళ్ల కోసం పరితపిస్తోందని చెబుతుంటారు. అయితే ఈ కథనాన్ని నమ్మేవాళ్లు తక్కువమందే ఉన్నారు. మెక్సికో నగరం (యు.ఎస్.ఎ)... టేబుల్ మీద భోజనాలను సర్దుతోంది బ్రెండా. ‘‘ఇవాన్... భోజనానికి రా’’ అంది ప్లేటులో ఆహారాన్ని వడ్డిస్తూ. ‘‘ఆ ఆ వస్తున్నా’’ అంటూ వచ్చి కూర్చున్నాడు ఇవాన్. అటూ ఇటూ చూసి... ‘‘బెన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘ఏం చెప్పమంటారు మీ సుపుత్రుడి గురించి? ఉన్నచోట ఉండడు కదా! ఆడుకోవడానికని వెళ్లాడు. ఇంతవరకూ రానేలేదు’’ అంది తను కూడా కూర్చుంటూ. ‘‘రాకపోతే అలా వదిలేయడమేనా... నాకు చెబితే తీసుకొస్తాను కదా’’ అంటూ లేచాడు ఇవాన్.‘‘అరే... అంత కంగారుపడతావెందుకు? రోజూ బయటికెళ్లి ఆడుకోవడం వాడికలవాటే కదా’’ అంది బ్రెండా భర్తవైపు చూస్తూ. ‘‘ఆడుకోవడం అలవాటే కానీ ఈ టైమ్ వరకూ ఆడుకోవడం అలవాటు లేదు కదా... టైమ్ చూడు, తొమ్మిది దాటుతోంది’’ అంటూనే చెప్పులేసుకుని బయటకు నడిచాడు ఇవాన్. నిట్టూర్చింది బ్రెండా. ‘‘వాడూ మాట వినడు. ఈయనా వినడు. మధ్యలో నేను చస్తున్నాను’’ అంటూ భర్తకు భోజనం వడ్డించిన ప్లేటు మీద మరో ప్లేటు బోర్లించి లేచింది. భర్త, కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మం దగ్గరే కూలబడింది. అరగంట తర్వాత వచ్చాడు ఇవాన్... ఒంటరిగా. అతడి వెంట పిల్లాడు లేకపోవడం చూసి కంగారుపడింది బ్రెండా. ‘‘ఒక్కడివే వచ్చావేంటి? బెన్ ఏడీ?’’ అంది ఆతృతగా. మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు ఇవాన్. ఆమె చూపుల్లో కనిపిస్తోన్న ఆదుర్దాను చూసి మనసు అదోలా అయిపోయింది అతనికి. ‘‘బెన్ కనిపించలేదు’’ అన్నాడు నసుగుతున్నట్టుగా. ‘‘కనిపించడం లేదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మిసెస్ ఫెర్నాండాని అడిగావా... రోజూ వాళ్లింటికే వెళ్తాడు. వాళ్లమ్మాయితోనే ఆడుకుంటాడు.’’‘‘అక్కడికే వెళ్లాను. కానీ వాడు ఎప్పుడో వెళ్లిపోయాడని చెప్పిందావిడ. ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికాను. ఎక్కడా కనిపించలేదు.’’ఆ మాట వింటూనే బావురుమంది బ్రెండా. ‘‘ఏమైపోయాడు? నా చిట్టితండ్రి ఎక్కడికెళ్లిపోయాడు? ఇవాన్... ఏం చేస్తావో తెలీదు. నాకు నా బెన్ కావాలి. తెచ్చివ్వు. వెంటనే తెచ్చివ్వు’’ అంటూ భర్తను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇవాన్‌కి. మెల్లగా అన్నాడు... ‘‘ఒకవేళ మారియా ఏమైనా...’’ ఉలిక్కిపడింది బ్రెండా. గుండె ఝల్లుమంది. ఆ వణుకు ఒళ్లంతా పాకినట్టయ్యింది. ‘‘మారియానా? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’’ అంది ఆవేశంగా భర్త కాలర్ పట్టుకుని. ‘‘కూల్ బ్రెండా... ఆవేశపడకు. మనింటికి రెండు దారులున్నాయి. మామూలు దారిలో వస్తే సమస్య లేదు. కానీ ఒకవేళ త్వరగా వచ్చేద్దామని బెన్ ఆ దారిలోకి కనుక వెళ్లుంటే...’’ ‘‘లేదు... అలా జరగదు’’ భర్త మాట పూర్తవ్వకుండానే అరిచింది బ్రెండా. ‘‘నువ్వంటున్నది నిజం కాదు ఇవాన్.. అలా జరగదు. జరగడానికి వీల్లేదు.’’ పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తోన్న భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇవాన్‌కి. గబగబా వెళ్లి చుట్టపక్కల వాళ్లను తీసుకొచ్చాడు. అందరూ కలిసి అక్కడికి కాస్త దూరంలో ఉన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు. లాంతర్లు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు పట్టుకుని అంతా వెతికారు. ఈత బాగా వచ్చిన కొందరు చెరువులోకి కూడా దిగి చూశారు. ఫలితం శూన్యం. బెన్ జాడ దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు. ఇంతకు ముందు జరిగినట్టుగానే ఇప్పుడూ జరిగింది’’ అన్నాడో వ్యక్తి పెదవి విరుస్తూ. ‘‘అవును. ఇక బెన్ జాడ తెలుసుకోవడం అసాధ్యం’’ అన్నాడు మరో వ్యక్తి. ‘‘అయినా మారియా చేతికి చిక్కినవాళ్లు మళ్లీ కనిపించడం ఎప్పుడైనా జరిగిందా’’ అందో మహిళ. ఆ మాటలు వింటూనే బేజారైపోయింది బ్రెండా. ‘బెన్’ అని అరుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆమెను చూసి అందరి మనసుల్లోనూ జాలి నిండిపోయింది. కానీ ఎవరేం చేయగలరు? అందుకే ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ బెన్ ఏమైనట్టు? ఏదో చేసింది అంటోన్న ఆ మారియా ఎవరు? ఆమె అతడిని ఏం చేసింది? తెలుసుకోవడం తేలికే. కానీ తెలుసుకున్న విషయాన్ని నమ్మడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే... మారియా మనిషి కాదు... దెయ్యం! మెక్సికో నగరానికి వెళ్లి, మారియా తెలుసా అని అడిగి చూడండి... అక్కడివాళ్లు ఉలిక్కిపడతారు. అంతగా వారిని భయపెట్టిందా దెయ్యం. మెక్సికో నగరంలోని ప్రధాన రహదారి మీద రాత్రిపూట ఒక సమయం దాటిన తర్వాత ప్రయాణించాలంటే భయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఎక్కడైనా మారియా కనిపిస్తుందేమోనని భయం! చీకటి పడిన తర్వాత తమ పిల్లలను బయటకు పంపించేందుకు వాళ్లు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే... వాళ్లని మారియా ఎత్తుకుపోతుందేమోనని! ఈ భయం వెనుక శతాబ్దం ముందునాటి కథ ఉంది. వందేళ్లకు పూర్వం... మెక్సికో నగరంలో మారియా అనే పేద యువతి నివసించేది. ఆమెకు తన పేదరికాన్ని చూసి చాలా వేదనగా ఉండేది. చినిగిన బట్టలు, నిండని కడుపులు, ఆగని కన్నీళ్లు ఆమెకు నచ్చేవి కావు. ఆ నిజాలను భరించలేక ఎక్కువగా ఊహల్లో విహరించేది. తన కోసం ఓ ధనికుడు గుర్రం మీద వస్తాడని, తనను మనువాడతాడని, మంచి జీవితాన్ని ఇస్తాడని కలలు గనేది. నిజంగానే ఓ రోజు ఓ ధనికుడు వ్యాపార నిమిత్తం గుర్రంమీద అక్కడకు వచ్చాడు. అతడిని చూస్తూనే వలపుల తోటలో విహారం మొదలుపెట్టింది మారియా. ఆమె కళ్లు రోజూ అతడినే వెతికేవి. అతడు వస్తున్నాడేమోనని దారివైపే చూస్తూ కాలం గడిపేది. గుర్రపు పాదాల సవ్వడి కోసం చెవులు రిక్కించేది. అతడు కనిపించిన ప్రతిసారీ అతడి కంట్లో పడాలని అక్కడక్కడే తచ్చాడేది. ఎలాగైతేనేం... ఆ యువకుడి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దాంతో వ్యాపారం పెట్టేందుకు వచ్చిన అతగాడు... ఆమెను పెళ్లాడి ఆ నగరంలోనే కాపురం పెట్టాడు. ఆమె సౌందర్యారాధనలో మునిగి తేలాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. అయితే ఆ తర్వాత అతడి మనసు మళ్లిపోయింది. మనసు కొత్త ఆనందాల కోసం వెతకసాగింది. ఒక డబ్బున్న మహిళను మనువాడేందుకు పరితపించాడు. అది తెలియని మారియా... వ్యాపార పనుల్లో పడి భర్త తనకోసం సమయం కేటాయించలేకపోతున్నాడేమో అనుకునేది. ఎలాగైనా అతడిని ఎప్పటిలాగా దగ్గర చేసుకోవాలని నానా తంటాలు పడేది. కానీ ఓరోజు పరస్త్రీతో తన భర్త నవ్వుతూ మాట్లాడటం దూరం నుంచి చూసింది. అతడు ఆమెను ముద్దాడటం భరించలేకపోయింది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక, తన పిల్లల మీద చూపించింది. చెరువు దగ్గర ఆడుకుంటున్న వాళ్లిద్దరినీ నీటిలోకి తోసేసింది. ఆ తర్వాత తను ఎంత తప్పు చేసిందో అర్థమైంది ఆమెకి. పిల్లల కోసం అల్లాడిపోయింది. కళ్లముందే నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లిద్దరినీ కాపాడుకోవాలని పరితపించింది. కానీ పూర్తిగా విఫలమయ్యింది. ఆమె చూస్తూండగానే వాళ్లు జలసమాధి అయిపోయారు. తాను ఎంతటి పాతకానికి ఒడిగట్టిందో తలచుకుని తలచుకుని కుమిలిపోయిందామె. అక్కడే కొన్ని గంటల పాటు ఏడ్చి ఏడ్చి, గుండె పగిలి చనిపోయింది. మారియా మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టారు చుట్టుపక్కలవాళ్లు. ఆ రోజు రాత్రి... అందరూ నిద్రపోతుండగా... ఉన్నట్టుండి ఓ ఏడుపు వినిపించింది.. ఎంతో భయంకరంగా, బాధాకరంగా! ‘‘బాబూ, ఏమైపోయార్రా, ఎక్కడున్నార్రా, నా దగ్గరకు రండిరా’’ అంటూ ఒకటే అరుపులు, ఏడుపులు! అందరూ ఉలిక్కిపడి లేచారు. ఏడ్చేది ఎవరా అని వెతికారు. ఎవరూ కనిపించలేదు. అలా రోజూ జరగసాగింది. దాంతో... ఆ ఏడుస్తోంది ఎవరో కాదు, మారియాయేనని అందరికీ అర్థమైంది. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుని చాలామందికి కనిపించేదామె. దాంతో ఆమె దెయ్యమైందని అర్థమైపోయింది అందరికీ. అందుకే ఆమెకు ‘లా లొరోనా’ అని పేరు పెట్టారు. అంటే... ‘వీపింగ్ ఉమన్ (దుఃఖించే మహిళ)’ అని అర్థం! అది మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పిల్లలు మాటిమాటికీ జడుసుకునేవారు. జ్వరాలు తెచ్చుకునేవారు. నిద్రలో పీడకలలు వచ్చి పెద్దగా ఏడ్చేవారు. అదంతా మారియా వల్లనేననే ప్రచారం మొదలైంది. పైగా కొందరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా మాయమైపోవడం మొదలైంది. దాంతో మారియా పిల్లల్ని ఎత్తుకుపోతోందనే భయం మొదలైంది జనాల్లో. అయితే ఇదంతా భ్రమ అనేవాళ్లు లేకపోలేదు. ఇది ముమ్మాటికీ నిజమేనని నొక్కి వక్కాణించేవాళ్లూ ఉన్నారు. వీడియోలు, ఫొటోల్ని సాక్ష్యంగా చూపించేవాళ్లూ ఉన్నారు. కానీ దేన్ని నమ్మాలి అనేది... వారి వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కదా! అందుకే లా లొరోనా కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది! - సమీర నేలపూడి