ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది.
తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు.
సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB
— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024
Comments
Please login to add a commentAdd a comment