మెక్సికో సిటీ: ఫార్ములా వన్ సర్క్యూట్‌లో రెడ్‌బుల్ డ్రైవర్, నెదర్లాండ్స్‌కు చెందిన మ్యాక్స్ వెర్‌స్టాపెన్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఆటోడ్రోమో హెర్మనోస్ రోడ్రిగ్స్‌లో జరిగిన రేస్‌లో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు.
1 గంటా 38 నిమిషాల 36.729 సెకన్లలో రేస్ పూర్తి చేసిన అతను మొదటి స్థానాన్ని అందుకున్నాడు. లూయీస్ హామిల్టన్ (మెర్సిడెజ్), సెర్గెయో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు.
తాజా విజయంతో 2022 సీజన్‌లో వెర్‌స్టాపెన్ 14 రేస్‌లలో విజేతగా నిలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతో అతను ఒకే సీజన్‌లో విజయాల సంఖ్యపరంగా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఒకే సీజన్‌లో అత్యధిక రేస్‌లు (13) నెగ్గిన ఘనత మైకేల్ షుమాకర్ (2004), సెబాస్టియన్ వెటెల్ (2013) పేరిట ఉండగా ఇప్పుడు దానిని వెర్‌స్టాపెన్ బద్దలు కొట్టాడు.
తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 20 రేస్‌లు జరగ్గా, పెరెజ్ రెండు నెగ్గడంతో 16 రేస్‌లు రెడ్‌బుల్ ఖాతాలోకే చేరాయి. ఈ సీజన్‌లో హామిల్టన్ ఒక్క రేస్ కూడా నెగ్గలేకపోయాడు. తర్వాతి రేస్ 13 నవంబర్‌నుంచి బ్రెజిల్‌లోని సావో పాలోలో జరుగుతుంది.
చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?
Comments
Please login to add a commentAdd a comment