
రియాద్: ఈ ఏడాది హజ్ యాత్రలో ఎండల తీవ్రతకు తాళలేక 10 దేశాలకు చెందిన 1,081 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు 68 మంది కాగా, ఈజిప్టు దేశస్తులు అత్యధికంగా 658 ఉన్నారు.
ఒక్క గురువారమే ఈజిప్టుకు చెందిన 58 మంది చనిపోయినట్లు ఆ దేశ దౌత్యాధికారి ఒకరు తెలిపారు. మొత్తం మృతుల్లో 630 మంది వరకు అనధికారికంగా వచ్చిన వారు ఉన్నారు. అధికారికంగా పేర్లు నమోదైన వారికి, ప్రభుత్వం ఏసీ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. అనధికారికంగా వచ్చిన వారు ఎండకు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారని అ«ధికారులు చెప్పారు.