Hajj Yatra
-
హజ్ యాత్ర మృతుల్లో... 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో 98 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో మొత్తం 187 మంది భారతీయులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ వివరించారు. ‘ఈ ఏడాది మే 9 నుంచి జూలై 22వ తేదీ వరకు జరగాల్సిన హజ్ యాత్రలో 1.75 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 98 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలన్నీ దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో సంభవించినవే. అరాఫత్ రోజున ఆరుగురు మరణించారు. ప్రమాదాల్లో మరో నలుగురు చనిపోయారు’’ అని జైస్వాల్ మీడియాకు వివరించారు. -
హజ్ యాత్రలో వెయ్యి మంది మృతి
రియాద్: ఈ ఏడాది హజ్ యాత్రలో ఎండల తీవ్రతకు తాళలేక 10 దేశాలకు చెందిన 1,081 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు 68 మంది కాగా, ఈజిప్టు దేశస్తులు అత్యధికంగా 658 ఉన్నారు. ఒక్క గురువారమే ఈజిప్టుకు చెందిన 58 మంది చనిపోయినట్లు ఆ దేశ దౌత్యాధికారి ఒకరు తెలిపారు. మొత్తం మృతుల్లో 630 మంది వరకు అనధికారికంగా వచ్చిన వారు ఉన్నారు. అధికారికంగా పేర్లు నమోదైన వారికి, ప్రభుత్వం ఏసీ ప్రాంతాన్ని కేటాయిస్తుంది. అనధికారికంగా వచ్చిన వారు ఎండకు తాళలేక ప్రాణాలు కోల్పోతున్నారని అ«ధికారులు చెప్పారు. -
బెజవాడలో ‘లెజెండ్’
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) చరిత్రలోనే అతిపెద్ద విమానం సోమవారం రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. హజ్ యాత్రికుల కోసం స్పైస్ జెట్ సంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340–300 విమానం ఇక్కడ దిగింది. తొలిసారి విమానాశ్రయానికి వచి్చన ఈ భారీ విమానానికి ఎయిర్పోర్ట్ అధికారులు వాటర్ కానన్ స్వాగతం పలికారు. సుమారు 324 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానం ఏకధాటిగా 14,400 కిలో మీటర్లు ప్రయాణం చేయగలదు. అతి పొడవైన ఈ విమానాన్ని చూసేందుకు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరిచారు. గతంలో 7,500 అడుగుల ఉన్న రన్‌వేను నాలుగేళ్ల కిందట 11 వేల అడుగులు (3,360 మీటర్లు) పెంచడంతో పాటు బలోపేతం చేశారు.ప్రస్తుతం ఈ రన్‌వేపై బోయింగ్ 747, 777, 787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి వైడ్‌బాడీ ఎయిర్‌క్రాప్ట్ దిగేందుకు అనువుగా ఉంది. విస్తరించిన రన్‌వేపై తొలిసారిగా అతిపెద్ద ఎయిర్‌బస్ ఎ340 విమానం దిగడం సంతోషంగా ఉందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అనంతరం ఈ విమానం 322 మంది హజ్ యాత్రికులతో సౌదీ అరేబియా దేశంలోని జెడ్డాకు బయలుదేరి వెళ్లింది. -
పవిత్ర హజ్‌యాత్ర ప్రారంభం
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రం నుంచి పవిత్ర హజ్‌యాత్ర–2024 సోమవారం ప్రారంభమైంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ఉదయం 9.51గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340 ప్రత్యేక విమానంలో 322మంది యాత్రికులు జెడ్డాకు బయలుదేరి వెళ్లారు. తొలుత హజ్ క్యాంపుగా వినియోగించిన గన్నవరం ఈద్గా జామా మసీదు వద్ద తెల్లవారుజామున 3గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సులను జెండా ఊపి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ కె.హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి మొత్తం 692 మంది హజ్‌యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. తొలి విమానంలో 322మంది వెళుతున్నారని, మిగిలిన యాత్రికులు ఈ నెల 28, 29 తేదీల్లో రెండు ప్రత్యేక విమానాల్లో వెళతారని చెప్పారు. హజ్ యాత్రికులకు ప్రయాణ రాయితీ, సదుపాయాల కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో హజ్ యాత్రికులకు అన్ని సదుపాయాలను కలి్పంచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి ఎల్.అబ్దుల్ ఖాదర్, హజ్ కమిటీ సభ్యుడు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొని హజ్‌యాత్ర విజయవంతం కావాలని హాజీలకు అభినందనలు తెలిపారు. -
హజ్ యాత్ర ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం)/ఏఎన్‌యూ:విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి బుధవారం పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. 170 మందితో కూడిన హజ్ యాత్రికుల తొలి బృందం ప్రత్యేక విమానంలో జెడ్డాకు బయలుదేరింది. అంతకుముందు గుంటూరు జిల్లా నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో యాత్రికులు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయిన అనంతరం.. హజ్ యాత్ర విమానాన్ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లాజమ్, ఇతర మత పెద్దలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందన్నారు. గతంలో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారన్నారు. దీనివల్ల యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు పంపించేందుకు చర్యలు తీసుకుందన్నారు. దీని వల్ల యాత్రికులపై రూ.83 వేల చొప్పున అదనపు భారం పడుతుండటంతో.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం జగన్ వెంటనే స్పందించి వారిపై భారం పడకుండా రూ.14.51 కోట్లు విడుదల చేశారని చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఈసారి మొత్తం 1,814 మంది హజ్ యాత్రకు వెళ్లిరానున్నారని వివరించారు. ఏపీతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హజ్ యాత్రికులను అంజాద్ బాషా కోరారు. తాము ఇబ్బంది పడకుండా అదనపు భారం భరించడంతో పాటు అన్ని హంగులతో ప్రభుత్వం వసతి కేంద్రం ఏర్పాటు చేసిందని యాత్రికులు చెప్పారు. తమకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, యాత్రికులకు డిప్యూటీ సీఎం, హజ్ కమిటీ చైర్మన్ తదితరులు డ్రై ఫ్రూట్స్, గొడుగులు అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జఖియా ఖానం, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, ఎమ్మెల్సీలు రహుల్లా, ఇషాక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సలహాదారు హబీబుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, ఎయిర్పోర్ట్ భద్రతాధికారి వెంకటరత్నం, డీఎస్పీ జయసూర్య, హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ బాసిత్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ మునీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రకు అదనపు సాయం: సీఎం జగన్‌కు ఎన్ఆర్ఐల కృతజ్ఞతలు
పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు అదనపు భారం పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయం అందిస్తూ ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం దుబాయ్‌లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్గేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 80 వేల అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇతర అధికారులను తనతో పాటు ఎంపీ మిధున్ రెడ్డి కలిశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే స్పందించిన సీఎం జగన్ ముస్లిమ్ సోదరులపై అదనపు భారం పడకుండా 80 వేల రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రూ. 14.15 కోట్లు విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి సీఎం రుజువు చేశారన్నారు. ఈ సమావేశంలో డా. భూ అబ్దుల్లా, కడప యువజన విభాగ అధ్యక్షులు షేక్ ఉమైర్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ నుంచి హజ్ యాత్రకు అనుమతించాలి
సాక్షి, అమరావతి: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు అనుమతించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో హజ్‌యాత్రకు వెళ్లేవారిని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపేందుకు వీలుగా పాయింట్‌ను ప్రకటించాలని కోరారు. హజ్ యాత్రకు నెల ముందుగా ఏపీ హజ్ కమిటీ నుంచి ఒక అధికారిక బృందం మక్కా, మదీనా నగరాలకు వెళ్లి అక్కడి వసతిగృహాల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేలా సౌదీ ప్రభుత్వ అనుమతిని ఇప్పించాలని కోరారు. ఏపీ హజ్ కమిటీ సభ్యులు ఇషాక్ బాషా, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్ యాత్ర
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి విజయవాడ కేంద్రంగా హజ్ యాత్రకు చర్యలు చేపడతామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హజ్ కమిటీకి లేఖలు రాస్తామని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌసల్ అజమ్ తెలిపారు. విజయవాడలోని హజ్ కమిటీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యుడు ఇస్సాక్ బాషా, మిగిలిన సభ్యులతో కలిసి చైర్మన్ గౌసల్ అజమ్ మీడియాకు వెల్లడించారు. గత నెల 6న ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసిందని, యాత్రకు 1,164 మంది సురక్షితంగా వెళ్లి వచ్చారని తెలిపారు. హజ్ యాత్రికులకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువగా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించి, ఆయన అనుమతితో రానున్న ఏడాదికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో 2020లో విజయవాడ నుంచి హజ్ యాత్రకు కేంద్ర హజ్ కమిటీ ఎంబార్కేషన్ సెంటర్‌కు అనుమతిచ్చిందని, కోవిడ్ కారణంగా అది వినియోగంలోకి రాలేదన్నారు. వచ్చే ఏడాది(2023) ఎంబార్కేషన్ సెంటర్‌ను పునరుద్ధరించేలా చేసి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే హజ్ యాత్రకు చర్యలు చేపడతామని తెలిపారు. వైఎస్సార్ కడపలో హజ్ కమిటీ భవన నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తయిందని, అలాగే విజయవాడ–గుంటూరు మధ్య హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను కోరతామని చెప్పారు. ఇందుకోసం గన్నవరం ఎయిర్‌పోర్టు – గుంటూరు మధ్య ఐదెకరాల భూమి కేటాయించి, నిధులు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని గౌసల్ అజమ్ వివరించారు. -
కాలినడక: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలో మీటర్లు
లండన్: కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేపట్టాలని ముస్లిం సోదరులు భావిస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్‌కు చేరుకున్నారు. ఇరాక్‌లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్.. అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న అడమ్ మొహమ్మద్.. ఇంగ్లాండ్‌లోని వొల్వెర్‌హంప్టన్ నుంచి సుమారు 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాకు చేరుకున్నారు. 10 నెలలు.. 9 దేశాలు.. హజ్ యాత్రకు బయలుదేరిన అడమ్ మొహమ్మద్.. నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనన్, జోర్డన్ దేశాల మీదుగా సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 10 నెలల 25 రోజుల్లో మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచారు. తన యత్రను గత ఏడాది 2021, ఆగస్టు 1న ప్రారంభించిన అడమ్.. ఈ ఏడాది జూన్‌లో గమ్యాన్ని చేరుకున్నారు. ఆల్ జజీరా న్యూస్ ప్రకారం.. అడమ్ రోజుకు సగటున 17.8 కిలోమీటర్లు నడిచారు. సుమారు 300 కిలోల సామగ్రితో కూడిన తోపుడు బండిని తోసుకుంటూ తన యాత్రను సాగించారు. ఆ బండికి మ్యూజిక్ స్పీకర్లు అమర్చి ఇస్లామిక్ పాటలు వింటూ నడిచినట్లు చెప్పుకొచ్చారు అడమ్. శాంతి, సమానత్వంపై ప్రజలకు సందేశం అందించాలనే తాను ఇలా కాలినడకన యాత్ర చేపట్టానన్నారు. ఆన్‌లైన్‌లోనూ గోఫన్‌మీ పేజ్‌ను ఏర్పాటు చేశారు. 'ఇది నేను డబ్బు, పేరు కోసం చేయటం లేదు. ప్రపంచంలోని మనుషులంతా సమానమనే విషయాన్ని ఎత్తిచూపాలనుకుంటున్నా. ఇస్లాం బోధిస్తున్న శాంతి, సమానత్వ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నా.' అని అందులో రాసుకొచ్చారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ముస్లింలు హజ్ సందర్శించుకునేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. 2020, 2021లో కేవలం సౌదీ అరేబియా పౌరులను మాత్రమే అనుమతించారు. ఈ ఏడాది జులై 7న ఈ హజ్ యాత్ర మొదలైంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
హజ్ యాత్రకు సిద్ధం
సాక్షి, అమరావతి: పవిత్ర హజ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన వారు ఈ నెల 14 నుంచి పవిత్ర యాత్రను ప్రారంభించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు 1,161 మంది వెళ్తున్నారు. పాత జిల్లాల వారీగా యాత్రికుల గుర్తింపు, మంజూరు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దీని ప్రకారం అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన యాత్రికులు ఈ నెల 14న బెంగళూరు నుంచి రెండు విమానాల్లో మదీనాకు వెళ్తారు. హజ్ యాత్ర అనంతరం వారు జూలై 22న రాష్ట్రానికి తిరిగి వస్తారు. మిగిలిన 11 జిల్లాలకు చెందిన యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వీరంతా ఈ నెల 27, 28, 30 తేదీల్లో బయల్దేరి జిద్దా విమానాశ్రయానికి చేరుకుంటారు. హజ్ యాత్రకు వెళ్లేవారు నిర్దేశించిన తేదీలకు 72 గంటల ముందు కేటాయించిన విమానాశ్రయాల పరిధిలోని హజ్ హౌస్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గతంలో 48 గంటల ముందుగా రిపోర్టు చేస్తే సరిపోయేది. ఈసారి కోవిడ్ కారణంగా కోవిడ్ పరీక్ష (పీసీఆర్ టెస్ట్) కోసం ముందుగా చేరుకోవాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి 65 ఏళ్ల లోపు వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. ప్రభుత్వం సాయం చేస్తోంది ఈ ఏడాది హజ్ యాత్ర కోసం మొత్తం 1,403 దరఖాస్తులు వచ్చాయి. మన రాష్ట్రానికి కోటా 1,201 మందిని ఎంపిక చేశారు. కొందరు విరమించుకోగా 1,161 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారు. హజ్ యాత్రికులకు ఏడాదికి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉంటే రూ.60 వేలు, రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉంటే రూ.30 వేలు చొప్పున ప్రభుత్వం సాయమందిస్తోంది. – అబ్డుల్ ఖాదర్, హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి -
Andhra Pradesh: ‘హజ్’ అరుదైన భాగ్యం
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆతర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్ (అంటే దానధర్మాలు). హజ్ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌యాత్ర చేస్తున్నారు. హజ్‌యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. 2019కి సంబంధించిన జిల్లా యాత్రికులు 473 మంది యాత్ర చేశారు. ఆతర్వాత కోవిడ్–19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో భారతీయులకు హజ్ యాత్ర అవకాశం కలగలేదు. ప్రస్తుతం 2022కి సంబంధించిన దరఖాస్తుల ప్రకియ ఈనెల 1వ తేదీనే ప్రారంభమైంది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 10వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. (కాగా ఆన్‌లైన్‌కు ఆఖరు తేది 2022, జనవరి 31). ముస్లింలలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. పైగా దరఖాస్తు గడులన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని పూరించాలంటే తలప్రాణం తోకకు వస్తుంటుంది. ఒక్కగడి తప్పుగా పూరించినా హజ్ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్ హజ్ కమిటీ తరపున హజ్‌యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియబరుస్తూ హజ్ యాత్రికులకు ‘సాక్షి’ అందించిన తోడ్పాటే ఈ కథనం.. దరఖాస్తుల్లో రెండు విధాలు.. కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్’ అంటారు. కవర్లో కవర్‌హెడ్ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయస్సు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్లైన్ చేస్తారు. కవర్ నెంబర్ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తారు. హజ్ యాత్రికులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ హజ్ కమిటీ వారు జనవరిలో కవర్ నంబర్‌తోనే డ్రా తీస్తారు. అర్హతలు.. భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్ రీడబుల్, ఇంటర్నేషన్ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు. హజ్ దరఖాస్తుకు జత చేయాల్సినవి.. పూరించిన హజ్ దరఖాస్తుతో పాటు సెంట్రల్ హజ్ కమిటీ అకౌంటుపై బ్యాంక్‌లో (ఎస్బీఐ బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్ నంబర్ కనిపించే విధంగా బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్ లేక రేషన్ కార్డు) కూడా జతపరచాలి. రెండు కేటగిరీల్లో యాత్ర.. హజ్ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పిస్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్ కుకింగ్ నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్’ అని అర్థం. 65 ఏళ్ల లోపు వారే అర్హులు. గతంలో డెభ్భై ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయస్సు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయస్సు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు. వ్యాక్సినేషన్ తప్పనిసరి.. హజ్ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. వీరు అనర్హులు.. గర్భిణీ మహిళలు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుష్ఠు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. నామినీ.. హజ్ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి. బ్యాంక్‌లో ఖుర్బానీ ఫీజు.. హజ్‌యాత్రలో భాగంగా ఖుర్బానీ నిర్వహించడానికి సౌదీ ప్రభుత్వం గుర్తించిన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐడీబీ)లో ‘అదాయి కూపన్’ తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఈ అంశాన్ని స్పష్టం చేయాలి. (ప్రైవేట్ వ్యక్తులకు ఖుర్బానీ సొమ్ము అప్పగిస్తే వారు మోసగించే అవకాశం ఉందని చెబుతారు). లక్కీ డ్రా.. దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబాయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరపున హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉచితంగా ఆన్లైన్ సేవలు.. హజ్ యాత్రికులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందనే సదుద్దేశంతో జిల్లాలో అనేక సొసైటీలు ముందుకు వచ్చి వారి ప్రయాణానికి అవసరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. సొసైటీల ప్రతినిధులు దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తులు మొదలు హజ్ యాత్రికులు విమానం ఎక్కే దాకా వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు, రోగనిరోధక వాక్సినేషన్ వంటి సేవాభావంతో కల్పిస్తాయి. బుధవారపేటలోని మహబూబ్‌సుభానీ మసీదులో రాయలసీమ హజ్ సొసైటీ వారు సేవలు అందిస్తున్నారు. వీరి ఫోన్ నంబర్లు: అధ్యక్షుడు ఎం.మొహమ్మద్పాష: 76809 01952, ప్రధాన కార్యదర్శి బాషా సాహెబ్: 99633 18255. జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు నాయబ్ సలీం: 99123 78586, ప్రధాన కార్యదర్శి అష్వాక్ హుసేని: 98662 86786. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలతో వీరిని సంప్రదిస్తే ఉచితంగా ఆన్లైన్ చేస్తారు. ఒంట్లో సత్త ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు: ఇర్షాదుల్ హక్ ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. నేను అబ్బాస్‌నగర్‌లో ఉంటాను. నాకు ఏసీ స్పేర్‌పార్ట్స్ షాప్ ఉంది. హజ్‌కు వెళ్లేంత స్థోమత ఉంది కాబట్టి నా 50వ ఏటనే హజ్ ముగించుకువచ్చాను. నా ముగ్గురు పిల్లలను బంధువులకు అప్పగించి నేను, నాభార్య ఇద్దరు కలిసి ఓ ఐదేళ్ల క్రితమే హజ్ యాత్రకు వెళ్లొచ్చాం. యాత్రకు అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా హజ్ సొసైటీల వాళ్లే ఉచితంగా చేసి పెట్టారు. అల్లా వారికీ పుణ్యం ప్రసాదిస్తాడు. శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే.. : జాకిర్ హుసేన్, సివిల్ ఇంజనీరు నేను సివిల్ ఇంజనీర్ని. బాలాజీనగర్‌లో ఉంటాను. హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్రాం అనే వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. పక్కనే ఉండే వ్యక్తిని అడిగితే అతనూ మనదేశీయుడే అయి ఉంటాడు. అందువల్ల హజ్‌యాత్రకు ముందే అన్ని తెలుసుకుని ఉండాలి. ఇందుకు హజ్ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. -
26 నుంచి రాష్ట్ర వాసుల హజ్ యాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్ యాత్ర– 2019కు వెళ్లే యాత్రికుల విమాన షెడ్యూల్‌ను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాన్ సోమవారం విడుదల చేశారు. నాంపల్లి హజ్ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం ఈ నెల 18న నగరం నుంచి హజ్ యాత్రకు బయలుదేరిందని తెలిపారు. తెలంగాణ హజ్ యాత్రికుల ప్రయాణ తేదీలు ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్ర యాత్రికులు మొత్తం 15 విమానాల ద్వారా ఈ నెల 26 నుంచి 30 వరకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణం అవుతారని చెప్పారు. రాష్ట్ర హజ్ యాత్రికుల మొదటి బృందం ఈ నెల 26న రాత్రి 8:25కి జిద్దాకు ప్రయాణం అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,685 మంది యాత్రికులు ఈ ఏడాది హజ్ కమిటీ ద్వారా యాత్రకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర యాత్రికులు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. -
హజ్‌యాత్ర విమాన షెడ్యూల్ ఖరారు
సాక్షి, అమరావతి: 2019 హజ్ యాత్ర విమాన షెడ్యూల్ ఖరారైంది. టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో కావాల్సిన పనులు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్‌బాషా హజ్ యాత్రికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏ విమానంలో ఏ తేదీన ప్రయాణం చేయనున్నారో ఆ సమాచారాన్ని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ యాత్రికులు దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నంబర్‌కు మెసేజ్ చేస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే హజ్ యాత్రికులు తమ సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో విమాన బుకింగ్ నిర్ధారణ చేసుకోవాలి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి చేసుకోవచ్చు. లేదా జిల్లా హజ్ సొసైటీల సాయం తీసుకోవాలని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాజుద్దీన్ ఆరీఫ్ హజ్ యాత్రికులకు సూచించారు. ఆన్లైన్ విమాన బుకింగ్‌ను నిర్ధారణ చేసుకోవడం వల్ల తమ ప్రయాణానికి 48 గంటల ముందే నాంపల్లి హజ్‌హౌస్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం 10 గంటల ముందు వెళ్తే సరిపోతుంది. - ఆంధ్రప్రదేశ్ యాత్రికులు వెళ్లే మొదటి విమానం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5375 జూలై 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా బయలు దేరనుంది. ఈ విమానంలో గుంటూరుకు చెందిన 207 మంది, కృష్ణా జిల్లాకు చెందిన 113 మంది, విశాఖపట్నం ఇద్దరు, పశ్చిమగోదావరికి వాసులు 20 మంది కలిపి మొత్తం 342 మంది వెళ్లనున్నారు. - ఆగస్టు 1న మధ్యాహ్నం 12:45 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5383 విమానంలో 343 మంది యాత్రికులతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా బయలుదేరనుంది. ఈ విమానంలో తూర్పుగోదావరి నుంచి నలుగురు, గుంటూరు జిల్లాకు చెందిన 85 మంది, కృష్ణ్లాకు చెందిన 75 మంది, కర్నూలు 111, నెల్లూరు 19, ప్రకాశం 10, విశాఖపట్నం 23, విజయనగరం జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణికులు వెళ్తారు. - ఆగస్టు 2న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5391 విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 268 మంది యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా వెళ్తారు. - ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 నిమిషాలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5403 విమానంలో తూర్పుగోదావరికి చెందిన 28 మంది, కడపకు చెందిన 199 మంది, కర్నూలు 31, నెల్లూరు ఐదుగురు, శ్రీకాకుళం నలుగురు, విశాఖపట్నం 55, విజయనగరం నలుగురు, పశ్చిమగోదావరికి చెందిన 17 మంది.. మొత్తం 343 మంది హజ్ యాత్రకు వెళ్తారు. - ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ–5397లో హైదరాబాద్ నుంచి ఆరుగురు, కడప 11, కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు, కర్నూలు 10, నెల్లూరు 64, ప్రకాశం 26, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన 163 మంది, కలబుర్గీ 20, రాయచూర్ 5, యాదగిరికి చెందిన 31 మంది.. మొత్తం 341 మంది హజ్ యాత్రకు ఈ విమానంలో వెళ్లనున్నారు. -
భారత్ నుంచి హజ్ కోటా పెంపు!
ఒసాకా: భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హజ్ కోటా పెంపుపై ఇరువురు చర్చించుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. హజ్ కోటాను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతామని మహ్మద్ బిన్ సల్మాన్.. మోదీకి హామీ ఇచ్చి నట్లు విజయ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య పర్యా టకం పెంపొందించేందుకు విమాన సేవలు పెంచేం దుకు ఇరువురు మరోసారి సమావేశం అయ్యేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది సౌదీ అరేబియాలో జరగబోయే ఓ అంతర్జాతీయ సదస్సుకు మోదీని ఆహ్వానించారని, ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మక్కా కు ఒంటరిగా వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను గతేడాది 1,300 మందిని అనుమతించారు. -
20 నుంచి హజ్‌యాత్రకు దరఖాస్తుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2019కి సంబంధించి ఈ నెల 20 నుంచి దరఖాస్తులు పంపిణీ చేసేందుకు కేంద్ర హజ్ కమిటీ ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా ఖాన్, ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర హజ్ కమిటీ సైతం దరఖాస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గురువారం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో హజ్‌యాత్రకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. హజ్ యాత్ర–2019కి వెళ్లే వారు తమ పాస్‌పోర్టులను సిద్ధం చేసుకోవాలని, పాస్‌పోర్టు గడువు 2020 మార్చి వరకు ఉండాలన్నారు. లేని పక్షంలో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. హజ్ యాత్ర–2018కి సంబంధించి రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 7,347 మంది యాత్రికులు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాలకు వెళ్లారన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 4,453, ఏపీ నుంచి 1,711, కర్ణాటక 4 జిల్లాల నుంచి 1,183 మంది ఆగస్టు 1న 25 విమానాల్లో వెళ్లినట్లు తెలిపారు. హజ్ ఆరాధనలు పూర్తి చేసుకొని గత నెల 12 నుంచి 25వ తేదీ వరకు 7,301 మంది యాత్రికులు నగరానికి చేరుకున్నట్లు తెలిపారు. ఇందులో ఐదుగురు అనారోగ్యంతో మృతి చెందగా, మరోకరు అనారోగ్యంతో మదీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇక మరో 36 మంది హజ్ షెడ్యూల్‌కు ముందే నగరానికి రాగా.. నలుగురు యాత్రికులు గురువారం నగరానికి చేరుకున్నట్లు తెలిపారు. 2018 హజ్ యాత్రకు సహకరించిన వారికి అక్టోబర్ రెండో వారంలో సన్మానం చేస్తామని తెలిపారు. -
ఆగస్టు 1 నుంచి హజ్‌యాత్ర
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2018 షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి ప్రయాణం ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాఖాన్ తెలిపారు. బుధవారం ఉమ్రాయాత్ర ముగించుకొని నగరానికి చేరుకున్నారు. గురువారం తన కార్యాలయంలో 2018 హజ్‌యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర హజ్‌కమిటీ ఎంపిక చేసినవారు ఆగస్టు 1 నుంచి 16వ తేదీ వరకు హజ్‌యాత్రకు వెళతారన్నారు. ఈ ఏడాది తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురు యాత్రికులు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా వెళ్లనున్నట్లు తెలిపారు. మొత్తం 16 విమానాల ద్వారా దాదాపు 6 వేల మంది యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అజీజియా, రుబాత్ కేటగిరీ వారికి వంట చేసుకునే సౌకర్యం ఉందని, గ్రీన్ కేటగిరీ వారికి ఈ సౌకర్యం లేదని పేర్కొన్నారు. రూ.రెండు వేలు అదనంగా వసూలు చేస్తుండడంతో రాష్ట్ర యాత్రికులకు భారమవుతోందని, ఈ విషయమై పునరాలోచించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. యాత్రకు వెళ్లే ముందే యాత్రికులకు సిమ్‌కార్డులు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. -
రెండోసారి హజ్ యాత్ర.. పెనుభారమే
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండోసారి హజ్ లేదా ఉమ్రాను సందర్శించాలనుకునే వారికి ఆ యాత్రలు పెనుభారం కానున్నాయి. హజ్, ఉమ్రాలపై సౌదీ అరేబియా రూపొందించిన కొత్త నిబంధనలతో యాత్రికులపై రూ.35 వేలు అదనపు భారం పడుతోంది. సౌదీ రూపొందించిన కొత్త విధానం ప్రకారం రెండోసారి హజ్‌ను సందర్శించే వారు 2వేల రియాళ్లు చెల్లించాలి. గతేడాది రాష్ట్ర హజ్ కమిటీ నుంచి ఎంపికైన యాత్రికులు హజ్‌కు వెళ్లేందుకు రూ.2 లక్షలు చెల్లించారు. ఈ ఏడాది ఎంపికైన యాత్రికులకు అయ్యే ఖర్చులు రూ.2.14 లక్షలు కాగా అదనంగా రూ.35 వేలు కలిపి మొత్తం రూ.2.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లడానికి విమానాల కంపెనీల గ్లోబల్ టెండర్ ప్రక్రియను ఈసారి కేంద్ర హజ్ కమిటీ నిర్వహించలేదు. దీంతో విమాన టికెట్‌కు ఒకొక్కరూ రూ.65వేలు చెల్లించాల్సి వస్తోంది. రూ.65 వేలల్లో యూజర్ డెవలప్మెంట్ ఫేర్ (యూడీఎఫ్) రూపంలో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. గతంలో యూడీఎఫ్ రూ.2 వేల నుంచి రూ.5 వేల లోపు ఉండేదని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు చెబుతున్నారు. ఇలా అటు సౌదీ సర్కార్, దేశంలోని ఎయిర్‌పోర్టులు కలిపి యూడీఎఫ్, ఇతర చార్జీల రూపంలో ప్రతి యాత్రికుడిపై రూ.50 వేల అదనపు భారాన్ని వేస్తున్నాయని.. దీంతో హజ్ యాత్ర భారంగా మారిపోయిందని వాపోతున్నారు. -
హజ్ సేవకు దరఖాస్తుల షురూ
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2018కి వెళ్లే వారికి సేవలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు హజ్ సేవకులుగా వెళ్లడానికి అర్హులన్నారు. ఉద్యోగి వయసు 25–58 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఇంతకుముందు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలు చేసినవారే హజ్ సేవ చేయడానికి అర్హులన్నారు. అలాగే హజ్ ఆరాధనపై అవగాహన ఉండాలన్నారు. ఆసక్తి గల వారు హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్నాక ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు, డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంతకుముందు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలకు వెళ్లి వచ్చినట్లు ప్రూఫ్, పాస్‌పోర్టు జిరాక్స్, మెడికల్ సర్టిఫికెట్ పత్రాలను ఈ నెల 24లోపు రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో జమచేయాలని తెలిపారు. ఎంపికైన వారి అన్ని ఖర్చులు హజ్ కమిటీ భరిస్తుందని, వారు హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన రోజులను ఆన్‌డ్యూటీగా పరిగణిస్తామని చెప్పారు. -
15 నుంచి హజ్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: హజ్ 2018 షెడ్యూల్‌ను కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిందని, ఈ నెల 15 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర కోసం దరఖాస్తుల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్‌హౌస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర కమిటీ కార్యాచరణ రూపొందించిందన్నారు. అన్ని జిల్లాల్లో ఒకే రోజు హజ్ దరఖాస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. 15న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసారి కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు ఫారం పూర్తి చేసి.. రూ.300ల స్టేట్ బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ ద్వారా చలాన్ తీయాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్, ఆదార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ జమచేయాలన్నారు. గ్రీన్, అజీజియా.. రెండు కేటగిరీలు ఉన్నాయని, దరఖాస్తులో కేటగిరీని నమోదు చేయాలని సూచించారు. గత మూడేళ్లకు ముందు హజ్ లేదా ఉమ్రాకు వెళ్లి వచ్చిన వారు తిరిగి హజ్ యాత్రికుడితో సహాయకుడిగా వెళ్తే యాత్రకయ్యే ఖర్చులతో పాటు అదనంగా 2 వేల సౌదీ రియాల్ జమ చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర హజ్ షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రికుల ఎంపిక ప్రక్రియకు జనవరిలో డ్రా ఉంటుందన్నారు. జూలై 11 నుంచి హజ్ యాత్ర ప్రారంభమౌతుందన్నారు. హజ్ ఆరాధన 2019 ఆగస్టు 8న ఉంటుందన్నారు. హజ్ కొత్త పాలసీ విధివిధానాలు తేలియజేయడానికి నేడు అన్ని జిల్లాల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కొత్త హజ్ పాలసీపై అసంతృప్తి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన హజ్ పాలసీపై ముస్లింలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హజ్ యాత్రలో కేంద్రం జోక్యాన్ని ముస్లిం ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నారు. హజ్ యాత్ర కోసం గత మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నవారు నాల్గవసారి దరఖాస్తు చేసుకుంటే నేరుగా యాత్రకు అవకాశం ఉండేది. ఈసారి ఈ కేటగిరీని రద్దు చేయడంపై యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇస్లామియా ధర్మశాస్తం ప్రకారం.. ఏ మహిళ కూడా ఒంటరిగా ప్రయాణం చేయకూడదని, దాన్ని పరిగణనలో తీసుకోకుండా కేంద్రం 45 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవచ్చనడం సరికాదన్నారు. -
ఖతార్ సరిహద్దు తెరిచిన సౌదీ
-
ఖతార్ సరిహద్దు తెరిచిన సౌదీ
రియాద్: హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియా–ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ముందడుగు పడింది. హజ్ యాత్రికుల కోసం ఖతార్ సరిహద్దును తిరిగి తెరవాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రియాద్‌వాసులు హజ్ యాత్రకు రావడానికి మార్గం సుగమమైంది. ఖతార్ రాజ కుటుంబ సభ్యుడైన షేక్ అబ్దుల్లా అల్ తానీతో జెడ్డాలో ప్రత్యేకంగా సమావేశమైన సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక జెట్ విమానాలను సౌదీలోని జెడ్డా నుంచి ఖతార్ రాజధాని దోహాకు పంపించనున్నట్లు సౌదీ మీడియా తెలిపింది. దీనికయ్యే ఖర్చంతా సౌదీ రాజు భరిస్తారంది. ఉగ్రవాదానికి మద్దతిస్తోందంటూ సౌదీ, ఈజిప్టు, బహ్రెయి న్, యూఏఈ.. ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్న సంగతి తెలిసిందే. -
హజ్ దరఖాస్తు డిజిటల్లో...
ముంబై: హజ్ యాత్ర దరఖాస్తుల ప్రక్రియను కేంద్రం తొలిసారిగా డిజిటలైజేషన్ చేసింది. దీనికి సంబంధించిన యాప్‌ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ ఇక్కడి హజ్ హౌస్‌లో ఆవిష్కరించారు. యాత్ర వివరాలు, ఈ–పేమెంట్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఇది పెద్ద అడుగని నఖ్వీ చెప్పారు. ‘వచ్చే హజ్ యాత్ర నుంచి కేంద్రం ఆన్లైన్ దరఖాస్తులను ప్రోత్సహించనుంది. దీనివల్ల యాత్ర మరింత సౌకర్యవంతంగా, ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది’అని ఆయన వెల్లడించారు. గూగుల్ ప్లేస్టోర్‌లో ‘హజ్ కమిటీ ఆఫ్ ఇండియా’ మొబైల్ యాప్ సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24. ఐదుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఒక గ్రూప్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. -
హజ్ యాత్రలో ‘మనూ’ ప్రొఫెసర్ మృతి
హైదరాబాద్: ‘హజ్’ యాత్రకు వె ళ్లిన మౌలానా ఆజాద్ జాతీయు ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ (44) ఆకస్మికంగా మృతి చెందారు. వారం రోజుల క్రితం మక్కాకు బయలుదేరిన ఆయన రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రార్థనలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ మనూలో అరబిక్ డిపార్ట్మెంట్ హెడ్‌గా విధులను నిర్వహిస్తుండేవారు. 2006లో ఆయున మనూలో ప్రొఫెసర్‌గా చేరారు. అంతకుముందు ఉస్మానియా , ఢిల్లీ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీలలో కూడా విధులను నిర్వహించారు. మనూలో సంతాప సభ కాగా గచ్చిబౌలిలోని వునూలోని డీడీఈ ఆడిటోరియంలో వుంగళవారం అబ్దుల్ మొయిజ్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్శిటీ వీసీ ప్రొఫెసర్ మహ్మద్ మియాన్ మాట్లాడుతూ అరబిక్ విభాగాభివృద్ధికి ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ చేసిన సేవలను కొనియాడారు. వర్సిటీ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ రహమతుల్లా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
నేలపై ఉన్నవారిని మనం కరుణిస్తే...నింగిలో ఉన్నవాడు మనని అనుగ్రహిస్తాడు!
తలపెట్టింది దైవ కార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతరకార్యమని కూడా మనకు అర్థమవుతోంది. అందుకే ‘నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స). ఇస్లాం ధర్మంలో ఐదు మౌలిక సూత్రాలున్నాయి. ఈ ఐదింటిలో ఏ ఒక్కదాన్ని విస్మరించినా, విశ్వాసం పరిపూర్ణం కాదు. వీటిలో మొదటిది సృష్టికర్త ఒకే ఒక్కడన్న విశ్వాసం. రెండవది నమాజ్(దైవప్రార్థన), మూడవది రోజా (ఉపవాసం). నాల్గవది జకాత్(ఆర్థికదానం). ఐదవది హజ్(కాబా సందర్శన యాత్ర). ఇవి దైవ విశ్వాస ప్రకటనకు ఆచరణాత్మక రుజువులు. విశ్వాస ప్రకటనతో సహా మిగిలిన అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్’. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై ‘హజ్’ విధిగా నిర్ణయించబడింది. కనుక ఆర్థిక స్థోమత కలిగిన వారు జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ‘హజ్’ అంటే కాబా సందర్శనాయాత్ర చేయడం తప్పనిసరి. అయితే హజ్‌ను మించిన ఆరాధన సాటివారిని ఆదుకోవడమేనన్నది ఇస్లామ్ ధర్మసూక్ష్మం. ఇందుకు సంబంధించిన కథనొకదానిని పరిశీలిద్దాం... ఒకసారి హజ్రత్ అబ్దుల్లాబిన్ ముబారక్ (రహ్మ) ‘హజ్’ యాత్రకోసం మక్కాకు బయల్దేరారు. ఆయన అలా కొన్ని మైళ్లు ప్రయాణించిన తరువాత ఒకసారి పొలిమేరలో ఓ బాలిక దేనికోసమో ఆతృతగా వెదుకులాడుతూ కనిపించింది. మాసిపోయిన బట్టలతో, తైల సంస్కారం లేని జుట్టుతో కడు పేదరికంలో ఉన్నట్లు కనిపిస్తున్న ఆ పదేళ్ల బాలిక వెదుకులాట ఆయన్ను ముందుకు సాగనివ్వలేదు. అంతలో ఆ బాలిక అటూ ఇటూ చూసి ఓ చచ్చిన పక్షిని తీసి ఒళ్లో వేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ముబారక్ గారు వెంటనే గుర్రం దిగి ఆ అమ్మాయిని సమీపించి ‘పాపా! ఏమిటిది? చచ్చిన పక్షి కదా, ఇది ఎందుకు పనికొస్తుంది? దీన్నేం చేసుకుంటావు?’ అంటూ అనునయంగా అడిగారు. సమాధానంగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ గద్గద స్వరంతో ఇలా చెప్పిందా అమ్మాయి... ‘అయ్యా! నేను అమ్మానాన్నలు లేని అనాథను. నాకో తమ్ముడున్నాడు. తినడానికి సరైన తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక చాలా బాధపడుతున్నాం. రెండు రోజులనుండి మాకు తినడానికేమీ దొరకలేదు. నేను తట్టుకోగలను కానీ, తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. ఇదిగో ఈ చచ్చిన పక్షిని చూడగానే నా తమ్ముడే కళ్లలో కదిలాడు. దీన్నయినా కాల్చి పెడితే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశతో దీన్ని ఒళ్లో వేసుకున్నా’’ ఆమె కళ్లు వర్షిస్తున్నాయి. బాలిక నోట ఈ మాటలు విన్న హ. అబ్దుల్లా బిన్ ముబారక్ (రహ్మా) చలించి పోయారు. ఆయన కళ్లనుండి అప్రయత్నంగా అశ్రుబిందువులు టపటపా రాలాయి. బాలికను దగ్గరకు తీసుకుని... ‘పాపా! బాధ పడకు. దైవం తప్పకుండా నీ బాధను దూరం చేస్తాడు’ అంటూ తాను ‘హజ్’ కోసం తెచ్చుకున్న పైకమంతా ఆమె చేతిలో పెడుతూ, ఈ డబ్బులతో మీకు కావలసిన వస్తు సామగ్రి, బట్టలు కొనుక్కోండి. హాయిగా జీవించండి. ఈ ఏర్పాటు చేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోండి’ అన్నారు. ఒక్కసారిగా అన్ని డబ్బులు చూసిన ఆ బాలిక కళ్లు ఆనందంతో అశ్రుబిందువులు రాల్చాయి. ఆమె ముఖంలో కోటికాంతుల కలువ వికసించింది. బాలిక ముఖంలో మెరిసిన ఆనందం చూసి ముబారక్ గారి మనసు పులకించిపోయింది. అంతలో ఆ అమ్మాయి ‘అయ్యా! చచ్చిన దాన్ని తినడం ధర్మసమ్మతం కాదని మాకు తెలిసినా, గత్యంతరం లేని స్థితిలో పొయ్యే ప్రాణం నిలుస్తుందన్న ఆశతో ఇలా చేయవలసి వచ్చింది’ అంటూ ఆ పక్షిని అవతల పారేసింది. ‘అమ్మా! ఇక వెళ్లు. తమ్ముడు ఎదురు చూస్తుంటాడు. త్వరగా అతనికి భోజనం పెట్టు’ అంటున్న ముబారక్గారి ముఖాన్ని చూస్తూ ఇంటిదారి పట్టింది. ఆ బాలిక వెళ్లిన వైపే తృప్తిగా చూస్తున్న ముబారక్ గారితో ఆయన సేవకుడు, ‘అయ్యా! డబ్బంతా ఇచ్చేశారు. మరి తమరి హజ్ యాత్ర ఎలా?’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ముబారక్ గారు ఇలా అన్నారు. ‘మన హజ్ ఇక్కడే నెరవేరింది. ప్రస్తుతం ఇది కాబా యాత్ర కన్నా గొప్ప ఆరాధన. దైవ చిత్తమైతే వచ్చే యేడాది మళ్లీ హజ్ యాత్రకు వెళదాం. ఈ యేడు మాత్రం హజ్‌ను అల్లాహ్ ఇక్కడే స్వీకరించాడు’ అని వెనుదిరిగి వెళ్లిపోయారు. అంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, వారికి వేరే గత్యంతరం లేకపోతే, అలాంటి అభాగ్యులను ఆదుకోవడం తక్షణ కర్తవ్యమని ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తోంది. తలపెట్టింది దైవ కార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతరకార్యమని మనకు అర్థమవుతోంది. అందుకే ‘నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు దైవ ప్రవక్త (స). - యండీ ఉస్మాన్ ఖాన్ -
నేటి నుంచే హజ్ యాత్ర
సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్ర 2013 బుధవారం సాయంత్రం షురూ కానుంది. నాంపల్లిలోని హజ్‌హౌస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరే యాత్రికుల బస్సును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. శంషాబాద్ నుంచి జిద్దాకు రాత్రి 8.40 గంటలకు మొదటి విమానంలో 300 మంది, రాత్రి 10.55 గంటలకు రెండో విమానంలో 300 మంది బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హజ్‌యాత్ర కోసం ఈ ఏడాది 50,616 మంది దరఖాస్తు చేసుకోగా... 7658 మంది ఎంపికయ్యారు. అదేవిధంగా మక్కా మదీనాలో యాత్రికులకు సాయం అందించేందుకు 16 మంది ఖాదీమ్-ఉల్-హుజ్జాజ్ (వాలంటీర్లు) కూడా బయలుదేరి వెళుతున్నారు. దశల వారీగా అక్టోబర్ 9 వరకు 25 విమానాల్లో యాత్రికులు బయలుదేరి వెళతారు. గతేడాది హజ్ కమిటీ ద్వారా సుమారు 7967 మంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. కాగా, హజ్‌హౌస్ మూడో అంతస్తులో బుధవారం విద్యుత్ అంతరా యంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాస్‌పోర్టు తనిఖీలు, ఇమిగ్రేషన్ తదితర కీలక పనులకు ఆటంకం కలిగింది.