
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో 98 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో మొత్తం 187 మంది భారతీయులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ వివరించారు.
‘ఈ ఏడాది మే 9 నుంచి జూలై 22వ తేదీ వరకు జరగాల్సిన హజ్ యాత్రలో 1.75 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 98 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలన్నీ దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో సంభవించినవే. అరాఫత్ రోజున ఆరుగురు మరణించారు. ప్రమాదాల్లో మరో నలుగురు చనిపోయారు’’ అని జైస్వాల్ మీడియాకు వివరించారు.