సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2018కి వెళ్లే వారికి సేవలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ.షుకూర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు హజ్ సేవకులుగా వెళ్లడానికి అర్హులన్నారు. ఉద్యోగి వయసు 25–58 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఇంతకుముందు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలు చేసినవారే హజ్ సేవ చేయడానికి అర్హులన్నారు. అలాగే హజ్ ఆరాధనపై అవగాహన ఉండాలన్నారు.
ఆసక్తి గల వారు హజ్ కమిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్నాక ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు, డిపార్ట్‌మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంతకుముందు హజ్ లేదా ఉమ్రా ఆరాధనలకు వెళ్లి వచ్చినట్లు ప్రూఫ్, పాస్‌పోర్టు జిరాక్స్, మెడికల్ సర్టిఫికెట్ పత్రాలను ఈ నెల 24లోపు రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో జమచేయాలని తెలిపారు. ఎంపికైన వారి అన్ని ఖర్చులు హజ్ కమిటీ భరిస్తుందని, వారు హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన రోజులను ఆన్‌డ్యూటీగా పరిగణిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment