హజ్ యాత్రలో ‘మనూ’ ప్రొఫెసర్ మృతి
హైదరాబాద్: ‘హజ్’ యాత్రకు వె ళ్లిన మౌలానా ఆజాద్ జాతీయు ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ (44) ఆకస్మికంగా మృతి చెందారు. వారం రోజుల క్రితం మక్కాకు బయలుదేరిన ఆయన రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రార్థనలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ మనూలో అరబిక్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా విధులను నిర్వహిస్తుండేవారు. 2006లో ఆయున మనూలో ప్రొఫెసర్‌గా చేరారు. అంతకుముందు ఉస్మానియా , ఢిల్లీ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీలలో కూడా విధులను నిర్వహించారు.
మనూలో సంతాప సభ
కాగా గచ్చిబౌలిలోని వునూలోని డీడీఈ ఆడిటోరియంలో వుంగళవారం అబ్దుల్ మొయిజ్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్శిటీ వీసీ ప్రొఫెసర్ మహ్మద్ మియాన్ మాట్లాడుతూ అరబిక్ విభాగాభివృద్ధికి ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ చేసిన సేవలను కొనియాడారు. వర్సిటీ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ రహమతుల్లా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.