మోటోజింట్లా: దక్షిణ మెక్సికోలోని మోటోజింట్లా ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిండా జనంతో ప్రయాణిస్తోన్న బస్సు.. 300 అడుగుల లోయలో పడిపోవడంతో తునాతునకలైంది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లా ట్రినిటారియా ప్రాంతానికి చెందిన కొందరు ఫసిపిక్ తీరంలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని బస్సులో తిరుగుప్రయాణం అయ్యారు. కొండప్రాంతమైన మోటోజింట్లా సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి వెళ్లి, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. బస్సు దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మెక్సికన్ ప్రెసిడెంట్ ఎన్రిక్స్ పెనా సానుభూతి తెలిపారు.