ఫుట్ బాల్ బస్సు బోల్తా:16 మంది దుర్మరణం | 16 dead in football team's bus crash in Mexico | Sakshi
Sakshi News home page

ఫుట్ బాల్ బస్సు బోల్తా:16 మంది దుర్మరణం

Published Mon, Jan 11 2016 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

ఫుట్ బాల్ బస్సు బోల్తా:16 మంది దుర్మరణం

ఫుట్ బాల్ బస్సు బోల్తా:16 మంది దుర్మరణం

కోట్జాకోల్కోస్(మెక్సికో): ఔత్సాహిక ఫుట్ బాల్ క్రీడాకారులతో వెళుతున్న బస్సు ప్రమాదం బారిన పడి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన ఘటన మెక్సిలో సోమవారం సంభవించింది. తూర్పు మెక్సికోలోని  ఓ బ్రిడ్జిపై బస్సు వెళుతుండగా అదుపుతప్పి అటోయాక్ నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృత్యువాత పడగా, మరో 10 మంది గాయపడ్డారు. 

మృతదేహాల్ని నదిలో నుంచి వెలికితీశామని... వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణం కావొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement