బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
మసాయిపేట: బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే మెదక్ జిల్లాలో మసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ డ్యూటికి ఆలస్యంగా రావడం.. తొందరగా పిల్లల్ని స్కూల్ చేరవేయాలనే ఉద్దేశ్యంతో వేగంగా బస్సును నడిపించినట్టు తెలుస్తోంది.
రైల్వేగేట్ వద్ద బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీసుకోకపోవడంతోనే అభం శుభం తెలియన 26 మంది స్కూల్ విద్యార్ధులు మరణించారు.
స్కూల్ బస్సు ఇస్లాంపూర్ నుంచి తుఫ్రాన్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాకతీయ స్కూల్ కు చెందిన బస్సులో మొత్తం 38 విద్యార్ధులు ఉన్నట్టు తెలుస్తోంది.