రైలు ఆలస్యం కాకుంటే, చిన్నారులు...
మెదక్: నాందేడ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ప్యాసింజర్ ఆలస్యం చిన్నారుల పాలిట మృత్యువుగా మారింది. నాలుగు గంటల ఆలస్యంతో మూసాయిపేట స్టేషన్ కు చేరుకుంది. 4గంటల 43నిమిషాల ఆలస్యంగా మూసాయిపేట స్టేషన్ కు చేరుకున్న ప్యాసింజర్ 13 నిమిషాల పాటు ఆగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఆలస్యమే చిన్నారుల జీవితాన్ని చిదిమేసింది. సకాలంలో రైలు వచ్చి ఉంటే స్కూల్ విద్యార్థులు ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది