బస్సు డ్రైవర్ రాలేదని...ట్రాక్టర్ డ్రైవర్
హైదరాబాద్ : ఎప్పుడూ వచ్చే బస్సు డ్రైవర్ విధుల్లోకి రాకపోవటంతో అతని స్థానంలో విద్యార్థులను తీసుకు వచ్చేందుకు స్కూల్ యాజమాన్యం స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ను పంపించినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. రైలు రాదనే ధీమాతో డ్రైవర్ భిక్షపతి బస్సును ముందుకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు.