ఘోర రైలు ప్రమాదానికి సంఘటన వార్తతో కాకతీయ టెక్నో స్కూలు ప్రిన్సిపాల్ గుండెపోటుకు గురయ్యారు.
హైదరాబాద్ : ఘోర రైలు ప్రమాదానికి సంఘటన వార్తతో కాకతీయ టెక్నో స్కూలు ప్రిన్సిపాల్ గుండెపోటుకు గురయ్యారు. కాకతీయ స్కూల్ బస్సు గురువారం ఉదయం 9 గంటల సమయంలో మాసాయిపేట రైల్వేగేట్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38మంది ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా 7వ తరగతిలోపువారే. తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం హోరెత్తింది. ఉదయం ఇంటి నుంచి టాటా చెబుతూ వెళ్లిన తన చిన్నారి విగతజీవిగా చూసిన ఓ తల్లి ఘటనా స్థలంలోనే స్పృహ తప్పిపడిపోయింది.