రైలు ప్రమాదానికి గురై 20మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న కాకతీయ ప్రయివేట్ స్కూల్ గుర్తింపు రద్దు అయ్యింది
హైదరాబాద్ : రైలు ప్రమాదానికి గురై 20మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న కాకతీయ ప్రయివేట్ స్కూల్ గుర్తింపు రద్దు అయ్యింది. స్కూల్ గుర్తింపును రద్దు చేసినట్లు మెదక్ డీఈవో రాజేశ్వరరావు గురువారమిక్కడ తెలిపారు. తుప్రాన్లో కాకతీయ ప్రయివేట్ స్కూల్ బస్సు గురువారం ఉదయం విద్యార్థులను తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20మంది విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.