5 లక్షల ఎక్స్గ్రేషియా,వారంలో గేటు ఏర్పాటు | Rs 5 Lakh Ex Gratia for Medak Nanded passenger Tragedy | Sakshi
Sakshi News home page

5 లక్షల ఎక్స్గ్రేషియా,వారంలో గేటు ఏర్పాటు

Published Thu, Jul 24 2014 1:17 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

Rs 5 Lakh Ex Gratia for Medak Nanded passenger Tragedy

హైదరాబాద్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. వారం రోజుల్లోగా రైల్వేగేటు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 

కాగా ఈ దుర్ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే అమాయక చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ యుద్ధ ప్రాతిపదికపై గేటు ఏర్పాటు చేసి, సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మరోవైపు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement