మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో రైల్వే అధికారులపై కూడా కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ లెవెల్ క్రాసింగు వద్ద రైల్వే గేటు లేకపోవడమేనని, ట్రాఫిక్ ఎక్కువగా లేదన్న కారణంతోనే ఇంతకుముందు ప్రజలు కోరినా కూడా రైల్వే శాఖ అక్కడ గేటు ఏర్పాటుచేయలేదని ఆయన అన్నారు.
ఈ విషయమై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గేటు కావాలంటూ ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు కూడా రైల్వేశాఖ అధికారులదే తప్పని, ఇక్కడ గేటు పెట్టించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
రైల్వే అధికారులపై కేసులు!
Published Thu, Jul 24 2014 4:27 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement