masaipet
-
ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!
తల్లిదండ్రులకు టాటా చెప్పి, అమ్మమ్మలకు బాయ్ చెప్పి పాఠశాల బస్సెక్కి బయల్దేరిన ఆ పసివాళ్లు తరలిరాని లోకాలకు వెళ్లారు. తమను తీసుకెళ్తున్న ఆ వాహనమే మృత్యు శకటమవుతుందని, అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్తున్నామని తెలియని ఆ పసిమనసులు తోటి మిత్రులతో ముచ్చటిస్తున్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న వారి బస్సును అటువైపుగా వస్తున్న రైలు ఢీకొట్టడం, 16 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సరిగ్గా ఇదే రోజు (జులై 24), ఆరేళ్ల క్రితం మాసాయిపేట వద్ద జరిగిన ఈ ఘటన నాలుగు గ్రామాల్లోని పద్దెనిమిది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఈ దుర్దినాన్ని తలచుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాసాయిపేట బస్సు ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి, మెదక్: మాసాయిపేట బస్సు ప్రమాదానికి నేటికి ఆరేళ్లు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేట్ వద్ద ఆరేళ్ల క్రితం ఇదే రోజు పాఠశాలకు బయల్దేరిన చిన్నారులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. మాసాయిపేట కాపలా లేని రైల్వే గేటు వద్ద 34 మంది విద్యార్థులతో వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగిపోయింది. అంతలోనే నిజామాబాద్ నుంచి అతి వేగంగా వచ్చిన నాందేడ్ రైలు ఢీకొని బస్సులో ఉన్న విద్యార్థుల్లో 13 మంది చిన్నారులు అక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో 18 మంది చిన్నారులు ప్రభుత్వ చొరవతో కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ప్రాణాలతో బయటపడ్డారు. (చదవండి: చైనాలో బస్సు ప్రమాదం..21 మంది మృతి) కానీ ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారుల్లో కొందరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జ్ఞాపక శక్తి మందగించి కొందరు, కాళ్లు చేతులు వణకడం సమస్యలతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు అకాల మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా తమ పేగు బంధం తెగిపోయిందని, ఇది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్తున్నారు. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కాపలా లేని రైల్వే గేట్లు ఉండరాదని కోరుకుంటున్నారు. (చిన్న సాయం చేయండి.. తేజ్‌దీప్‌ను కాపాడండి) -
రైలు నుంచి జారిపడి ఒకరి మృతి
మెదక్: ప్రమాదవశాత్తు రైలు బోగీ నుంచి కిందపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మాసాయిపేట రైల్వేస్టేషన్లో జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎం.వెంకటేశ్వర్లు(26) దక్కన్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. రైలు బుధవారం తెల్లవారుజామున 05:30 గంటలకు స్టేషన్ మాసాయిపేటకు రాగానే ప్రమాదవశాత్తు రైల్వే పట్టాలపై పడటంతో మృతిచెందినట్లు కామారెడ్డి రైల్వే పోలీస్ పాండు తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం సాయిపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మృతుని వద్ద దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. -
మేమున్నామం
‘‘నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తా.. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పళ్లతో తీసేస్తా.. ఏ ఆపద వచ్చినా ఒక్క ఫోన్ చేయండి.. రెక్కలు కట్టుకుని వాలిపోతా.. హరిహరాదులు అడ్డం పడినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పను.. మడమ తిప్పను’’.. అంటూ పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని చాటి చెప్పారు. మాసాయిపేట దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేయించారు. మనసున్న మారాజుల్లా బాధితులను ఓదార్చారు. చిన్నారుల మృతితో సర్వం కోల్పోయి కన్నీటి సంద్రంలో మునిగిపోయిన వారికి మేమున్నామంటూ భరోసా కల్పించారు. మెదక్: మాసాయిపేట.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. జూలై 24న ఇక్కడ జరిగిన దుర్ఘటన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టడంతో 16 మంది చిన్నారులతో పాటు బస్ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయిన రాక్షస క్షణాలవి. ప్రమాద స్థలి వద్ద తెగిపడిన అవయవాలు.. నుజ్జునుజ్జైన శరీరాలు.. రక్తమోడిన రైల్వేట్రాక్... భీతావహ వాతావరణాన్ని తలపించింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, గీతారెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ప్రజాయుద్ధ నౌక గద్దర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. అయ్యో కొడుకా... ప్రమాదంలో మరణించాడనుకున్న చిన్నారి ధనుష్ దుర్ఘటన జరిగిన మరుసటి రోజు పునర్జన్మ ఎత్తడంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరో పక్క తమ కొడుకు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనుకున్న దత్తు తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వీరిని మంత్రి హరీష్‌రావు తన కారులో హుటాహుటిన హైదరాబాద్ నుంచి కిష్టాపూర్‌కు తీసుకెళ్లారు. నాలుగు రోజులుగా బాధిత కుటుంబాల వెంటే ఉంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. విరాళాలతో చేయూత... ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు సీఎం ప్రకటించిన రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చిన రూ.2 లక్షల మొత్తాన్ని చెక్కుల రూపంలో వారికి అందజేశారు. మంగళవారం వైఎస్సార్ సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తెల ంగాణ రాష్ట్ర పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్ర భుగౌడ్, రాఘవరెడ్డి తదితరు లు బాధిత కుటుంబాలను ప రామర్శించి ఆర్థికసాయం చేశా రు. టీడీపీ తరఫున మృతుల కు టుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేల పరి హారం ప్రకటించి మానవతా ధృక్పతాన్ని చాటా రు. కేర్ ఆస్పత్రి సిబ్బంది కూ డా తమ ఒక్క రోజు వేతనాన్ని సాయంగా ప్రకటించారు. విద్యార్థి లోకం నివాళి... అన్ని గ్రామాల్లో విద్యార్థులు బంద్ పాటించి కొవ్వొత్తులతో ర్యాలీలు తీసి నివాళులు అర్పిం చారు. ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన యు వకులంతా పెద్ద ఎత్తున యశోద ఆస్పత్రికి తరలివెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెం దిన విద్యార్థిని నాగలక్ష్మి తన చదువు కోసం దాచుకున్న రూ.16 వేలను బాధిత కుటుంబాలకు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది. -
తరుణ్, వైష్ణవి పరిస్థితి మరింత విషమం
హైదరాబాద్ : రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు కోలుకునేవరకూ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. విద్యార్థుల చికిత్స కోసం కామారెడ్డిలో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను నియమించినట్లు ఆయన చెప్పారు. మూడు రోజుల్లో 16మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. యశోదాలో చికిత్స పొందుతున్న 20మంది విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని రాజయ్య చెప్పారు. వారిలో తరుణ్, వైష్ణవి పరిస్థితి మరింతగా ఉన్నట్లు సమాచారం. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఇద్దరిని ఈరోజు, రేపు మరో ఇద్దర్ని జనరల్ వార్డుకు తరలించనున్నట్లు చెప్పారు. -
పాతంకుల్ పెళ్లి రోజని కొత్తంకుల్ వచ్చాడు
మాసాయిపేట బస్సు ప్రమాదంలో గాయపడి, యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారి రుచిత.. ఇద్దరి ప్రాణాలను కాపాడి తాను మాత్రం గాయపడింది. ఈ పాప బాగా చురుగ్గా ఉందని, మంచి ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల మిగిలినవారి కంటే త్వరగా కోలుకుంటోందని ఆస్పత్రి సిబ్బంది కూడా చెప్పారు. తనకు ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వస్తుందని ఆమె యశోద ఆస్పత్రిలో 'సాక్షి టీవీ'తో చెప్పింది. తాను మూడో సీట్లో కూర్చున్నానని, రైలు వస్తుండగా చూశానని తెలిపింది. బస్సు అప్పటికే రైల్వే ట్రాకు మీద ఆగిపోయిందని, అంతలో డ్రైవర్‌కు ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడని చెప్పింది. ఇంతలో రైలు వస్తోందని తాము చెప్పినా అతను మాత్రం పట్టించుకోలేదని, రైలు వస్తున్న విషయం చూసి తాను తన పక్క సీట్లో కూర్చున్న సద్భావన్, మహిపాల్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికీలోంచి బయటకు తోసేశానని తెలిపింది. తన తమ్ముడు వరుణ్‌ను కూడా తోసేందుకు ప్రయత్నించినా, అతడు కిటికీలో పట్టలేదని వివరించింది. ప్రమాదం జరిగిన రోజున తమకు ఎప్పుడూ వచ్చే డ్రైవరంకుల్ పెళ్లి రోజని, అందుకనే ఆయన కాకుండా కొత్త అంకుల్‌ను పంపారని రుచిత చెప్పింది. అతడు తాము చెబుతున్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని తెలిపింది. -
యమపురికి ద్వారాలు
సాక్షి, సంగారెడ్డి: కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు యమపురికి ద్వా రాలుగా మారుతున్నాయి. వెల్దుర్తి మండలం మాసాయిపేట ప్రమాద ఘటనే ఇందుకు తార్కాణం. మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నోస్కూల్ బస్సును ఢీకొట్టడంతో 16 మంది మృతి చెం దిన విషయం తెలిసిందే. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా చరిత్రలోనే మాసాయిపేట ఘటన అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. రైల్వే శాఖ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గురువారం నాటి ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. తాజా ప్రమాదంతో జిల్లాలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జహీరాబాద్, మెదక్, గజ్వేల్, పటాన్చెరు నియోజకవర్గాల గుండా మొత్తం 82 కిలోమీటర్లకుపైగా రైలుమార్గం ఉంది. 30 రైల్వే క్రాసింగ్లకుగాను 13 చోట్ల కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లున్నాయి. కాపలాలేని 13 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే శాఖ సత్వరం భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాపలాలేని రైల్వే క్రాసింగ్స్ ఇవీ .. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 రైల్వే క్రాసింగ్స్ ఉండగా వీటిలో ఐదుచోట్ల కాపలా లేరు. కోహీర్-పైడిగుమ్మల్ గ్రామానికి వెళ్లే రోడ్డుకు కాపాలా లేని రైల్వే గేటు ఉంది. జహీరాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. న్యాల్కల్ మండలంలో మామిడ్గి-బసంత్‌పూర్ వెళ్లే రోడ్డుకు రాష్ట్ర సరిహద్దులో గల రాజోలా వద్ద కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. న్యాల్కల్ మండలం గంగ్వార్ నుంచి కర్ణాటక వెళ్లే రోడ్డుకు కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉండగా ఇటీవల మూసివేశారు. కోహీర్ నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. దీనిని రైల్వే శాఖ మూసివేసేందుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదించింది. ప్రజల ఆందోళనలతో వాయిదా వేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉండగా మొత్తం 8 రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగు రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా లేవు. మాసాయిపేట, కూచారం తండా, లింగారెడ్డిపేట, పడాలపల్లి రైల్వేక్రాసింగ్ వద్ద కాపలాలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం మాసాయి రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వేశాఖ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టింది. మెదక్ నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉండగా 8 రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగుచోట్ల కాపలా లేదు. శేరిపల్లి-మిర్జాపల్లి గ్రామాల మధ్యన రైల్వే క్రాసింగ్, కామారం తండా-కామారం రైల్వే క్రాసింగ్, కామారం తండా-చిన్నశంకరంపేట రైల్వేక్రాసింగ్, పోలంపల్లి వద్ద రైల్వేక్రాసింగ్ వద్ద కాపలాలేవు. వాహనదారుల నిర్లక్ష్యం తోడవుతోంది... రైల్వేశాఖ నిర్లక్ష్యానికితోడు వాహనదారులు నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోంది. రైల్వేక్రాసింగ్స్ వద్ద వాహనదారులు, రోడ్డుదాటే పాదచారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న సందర్బాలున్నాయి. రైలు వచ్చేలోగా పట్టాలు దాటేయవచ్చన్న ధీమాతో వాహనదారులు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనికితోడు వాహనదారులు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో సంభాషించటం ప్రమాదాలకు కారణమవుతోంది. రైలు డ్రైవర్లు రైల్వేక్రాసింగ్‌ల వద్ద హారన్ మోగించకపోవటం, కొన్నిచోట్ల రైళ్లు క్రాసింగ్‌వద్ద కానరాకపోవటం ప్రమాదాలకు దారితీస్తోంది. -
దగ్గర దారే మృత్యుమార్గం అయ్యింది!!
చిన్నారుల ప్రాణాలను కర్కశంగా తీసుకెళ్లిపోయిన ప్రమాదం జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దగ్గర దారి అనుకుని కాపలా లేని రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. బస్సుకు రోజూ వచ్చే డ్రైవర్ రాకపోవడంతో.. మరో డ్రైవర్‌ను పిలిపించారు. మాసాయిపేట వద్ద మొత్తం మూడు రైల్వే లెవెల్ క్రాసింగులు ఉన్నాయి. వాటిలో రెండింటికి గేట్లు, కాపలా కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ కాదని, గేటు ఉండదన్న ఉద్దేశంతోనే మూడో క్రాసింగ్ మీదుగా వెళ్లాడని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మూడు క్రాసింగులకు మధ్య దూరం కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమేనని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాపలా ఉన్న గేట్లు అయితే ఆగాల్సి వస్తుందని, గేటు లేనిచోట అయితే నేరుగా వెళ్లిపోవచ్చని డ్రైవర్ భావించడమే ఈ పెను ప్రమాదానికి కారణమైంది. 14 మంది చిన్నారులను కర్కశంగా చిదిమేసింది. సెల్‌ఫోనులో మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ సెల్‌ఫోనులో మాట్లాడుతుండటం వల్లే అతడు రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిట్టచివరి నిమిషంలో వెనుక నుంచి పిల్లలంతా రైలు.. రైలు అని అరవడంతో ఒక్కసారి కంగారుపడి ఆలస్యంగా బ్రేకులు వేశాడని, కానీ.. దానివల్ల బస్సు ఆగకపోగా రైలు పట్టాల మీదుగా జారిపోవడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొందని అంటున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
నేడు విద్యాసంస్థల బంద్
సంగారెడ్డి మున్సిపాలిటీ: మాసాయిపేట శివారులో జరిగిన దుర్ఘటనలో విద్యార్థుల మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరికాంత్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి వేర్వే రు ప్రకటనల్లో తెలిపారు. పాఠశాల యాజమాన్యం అర్హత లేని డ్రైవర్లను నియమించడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. ఆర్టీఓ అధికారులు లెసైన్స్ లేని డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ప్రమాదం- కేవీపీఎస్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అడివయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. బస్ డ్రైవర్, రైల్వేశాఖ నిర్లక్ష్యం వలన విద్యార్థులు బలయ్యారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని, ప్రమాదానికి బాధ్యులైన కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రికగ్నైజ్డ్ పాఠశాలల ఆధ్వర్యంలో.. రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాప సూచకంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రైవేటు రికగ్నైజ్డ్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ లింగాగౌడ్, కోశాధికారి ఆంథోనీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని సెయింట్ ఆంథోని పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. రైల్వే మంత్రి దిష్టిబొమ్మ దహనం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే 21 మంది విద్యార్థులు మృతి చెందారని, ఇందుకు రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ రైల్వే శాఖ మంత్రి దిష్టిబొమ్మను సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ మాసాయిపేట గ్రామ ప్రజలు అనేకమార్లు రైల్వే గేటును ఏర్పాటు చేయాలని ధర్నాలు చేపట్టినా స్పందించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు మాసాయిపేట దుర్ఘటనకు పాఠశాల యాజమాన్యాన్ని బాధ్యులను చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దయానంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సంఘటన స్థలాన్ని సీపీఐ ప్రతినిధి బృందం సందర్శించిన అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపుపై పెట్టిన దృష్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లను ఏర్పాటు చేయకపోవడం వలన అభంశుభం తెలియని 25 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారన్నారు. కాగా ప్రమాదానికి బాధ్యులైన పాఠశాల యాజమాన్యం, రైల్వే శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హైమద్, ఉపాధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. రూ. 20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి మాసాయిపేట ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కా రాములు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సంతాపం రైలుప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జాకిర్ హుస్సేన్, తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, తెలంగాణ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, సాయిలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంతాపంరైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. -
పట్టాలపై నెత్తుటి చారిక!
ఈమధ్యనే బుల్లెట్ రైలును కలగనడం ప్రారంభించిన రైల్వే శాఖ చరి త్రలో ఇదొక నెత్తుటి పుట. కాపలాదారులేని లెవెల్ క్రాసింగ్‌లు జనం ప్రాణాలు తీస్తున్నాయని తెలిసికూడా దశాబ్దాల నుంచి పట్టనట్టుగా ఉండిపోయిన రైల్వేశాఖ నిర్లక్ష్యం సాక్షిగా గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 14 పసిమొగ్గలు రైలు పట్టాలపై నెత్తుటి ముద్ద లుగా మిగిలారు. ఇరవైమందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పొద్దుటే హడావుడిగా నిద్రలేచి స్కూలుకు తయారై అమ్మానాన్నలకు టాటా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే చోటుచేసుకున్న ఈ విషాదం కన్న వారినే కాదు... యావత్తు దేశ ప్రజలనూ తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం జరిగిందని తెలిశాక రైల్వేశాఖ, సర్కారు స్పందించిన తీరు ఎంత యాంత్రికంగా ఉన్నదో గమనిస్తే...లోక్‌సభలో ఈ ఉదంతం ప్రస్తావనకొచ్చినప్పుడు రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడిన మాటలు వింటే మళ్లీ మరో ప్రమాదం సంభవించబోదన్న భరోసా ఏమీ కలగదు. మరణించినవారి కుటుంబాలకు, గాయపడినవారికి పరిహారాన్ని ప్రకటించి, ప్రమాదంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఊరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం ప్రకటించారు. సదానందగౌడ కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ, ఇవన్నీ సరిపోవు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రైల్వేమంత్రి హుటాహుటీన ఘటనాస్థలికి రావాలి. వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబాలకు సాంత్వన వాక్యాలు పలకాలి. తమ శాఖనుంచి జరిగిన వైఫల్యమేమిటో గమనించాలి. ఇవి చేసినంతమాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావన్నది నిజమే. తల్లడి ల్లుతున్న ఆ తల్లిదండ్రుల జీవితాల్లో నెలకొన్న విషాదం తొలగిపోద న్నదీ వాస్తవమే. కానీ, అలా చేయడంవల్ల రైల్వే శాఖ ఎంత సున్ని తంగా ఆలోచిస్తున్నదో, జరిగిన ఘటనపై ఆ శాఖ మంత్రిలో ఎంత ఆందోళన నెలకొనివున్నదో దేశానికి తెలుస్తుంది. భవిష్యత్తులో ఇక ఇలాంటివి పునరావృతం కాని విధంగా చర్యలుంటాయన్న విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసాన్ని కలగజేయ డంలో సదానందగౌడ విఫలమయ్యారు. రైల్వే భద్రతపై నియమించిన అనేకానేక కమిటీల్లో ఒకటైన అనిల్ కకోద్కర్ కమిటీ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన నివేదిక భద్రత విషయంలో తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది. లెవెల్ క్రాసింగులను వెనువెంటనే తొలగించి వాటి స్థానంలో ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలు, సబ్‌వేలు నిర్మించాలన్నది అందులో ఒకటి. ఇందుకు రూ. 40,000 కోట్లు ఖర్చవుతాయని అంచనావేసింది. కాపలాదారులేనిచోట సరేగానీ...ఉన్నచోట ఇప్పుడ వుతున్న ఖర్చంతా ఆదా అవుతుందని, పైగా రైళ్లు నిరాఘాటంగా, వేగంగా వెళ్లడానికి వీలవుతుంది గనుక ఆ మేరకు ఇంధనం కలిసొ స్తుందని వివరించింది. వీటన్నిటి పర్యవసానంగా ఏడెనిమిదేళ్లలోనే ఈ వ్యయాన్ని రాబట్టుకోవచ్చునని తెలిపింది. కానీ, ప్రతి రైల్వే బడ్జెట్ లోనూ ఇందుకోసం కేటాయించే మొత్తం చాలా స్వల్పం. గత పదేళ్ల యూపీఏ పాలనలోనే క్షమార్హంకాని నిర్లక్ష్యం కొనసాగిందనుకుంటే... మొన్నటి ఎన్డీయే రైల్వే బడ్జెట్లో కూడా ఇలాంటి లెవెల్ క్రాసింగ్లను ఎత్తేయడానికి కేటాయించిన సొమ్ము రూ. 1,600 కోట్లు. దేశమంతా ఉన్న రైల్వే గేట్లను మార్చడానికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే దాదాపు 1,200 రైల్వే గేట్లున్నాయని అంచనా. ఇందులో దాదాపు 500 గేట్లు గత నాలుగేళ్లలో తీసేయగ లిగారు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాదారును పెట్టడానికి కొన్ని లక్షలు ఖర్చవుతాయి. ఓవర్ బ్రిడ్జి లేదా సబ్వే నిర్మిస్తే రూ. 2 కోట్ల వరకూ వ్యయమవుతుంది. 2016 నాటికల్లా అన్ని లెవెల్ క్రాసింగ్ లనూ కాపలా గేట్లుగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకున్నా బడ్జెట్లో చేసే కేటాయింపులు దానికి దీటుగా ఉండటంలేదు. చిత్రమేమంటే, రైల్వే శాఖ వైపునుంచి ఇంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కిమ్మనడంలేదు. ఇక కాపలాదారులున్న రైల్వే గేట్లవద్ద భద్రతకూడా అంత గొప్పగా ఏమీ లేదు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా బాధ్యతను రైల్వేశాఖ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెబుతోంది. 2001 నుంచి ప్రయాణికుల టిక్కెట్లపై భద్రతా సుంకం వసూలు చేస్తున్నారు. ‘అలా చేయడం ద్వారా మా బాధ్యతను పెంచుకుం టున్నాం’ అని ఆనాటి రైల్వే మంత్రి నితీష్‌కుమార్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. కానీ, ఆచరణలో జరిగిందేమిటి? లెవెల్ క్రాసింగ్‌లు ఎప్పటిలానే ఉన్నాయి. వేల సంఖ్యలో ఉన్న కాలంచెల్లిన వంతెనలూ అలాగే ఉన్నాయి. నాసిరకం పట్టాలూ మారలేదు. వీటన్నిటినీ సరిచేయడానికి అవసరమైన కేటాయింపులు చేయడానికి బదులు తాజా బడ్జెట్లో బుల్లెట్ రైలు ప్రతిపాదనలు మాత్రం దూసుకొచ్చాయి. లోపాలన్నిటినీ యధాతథంగా ఉంచి బుల్లెట్ రైళ్లు నడిపినంత మాత్రాన మనకొచ్చే ఖ్యాతి ఏమీ ఉండదు. తమ పిల్లలు తమలాంటి జీవితం అనుభవించకూడదని, వారికి మంచి భవిష్యత్తు అందించాలన్న తపనతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్వెంట్కు స్కూలు బస్సులో పంపితే పిల్లలు సురక్షితంగా ఉంటారన్న భరోసాతో మరింత సొమ్మును అదనంగా ఖర్చుచేస్తున్నారు. సరైన పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోలేని యాజ మాన్యం చివరకు తమకు కడుపుకోత మిగులుస్తుందని వారు ఊహిం చివుండరు. ఈ ఘటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మేల్కొని లెవెల్ క్రాసింగ్‌ల విషయంలో కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలి. ఈ కృషిలో మిగిలిన రాష్ట్రాలను కూడా కలుపుకోవాలి. అలాగే, పాఠశాలలకు ఉదయమూ, సాయంత్రమూ ఆర్టీసీ బస్సులను తిప్పే అంశాన్ని పరిశీలించాలి. -
రైల్వే అధికారులపై కేసులు!
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో రైల్వే అధికారులపై కూడా కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ లెవెల్ క్రాసింగు వద్ద రైల్వే గేటు లేకపోవడమేనని, ట్రాఫిక్ ఎక్కువగా లేదన్న కారణంతోనే ఇంతకుముందు ప్రజలు కోరినా కూడా రైల్వే శాఖ అక్కడ గేటు ఏర్పాటుచేయలేదని ఆయన అన్నారు. ఈ విషయమై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గేటు కావాలంటూ ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు కూడా రైల్వేశాఖ అధికారులదే తప్పని, ఇక్కడ గేటు పెట్టించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. -
ఇరు రాష్ట్రాల సిఎంలు స్పందించాలి
సికింద్రాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాద ఘటన చాలా విచారకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 26 మంది విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసేందుకు ఆయన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై మానవతా దృక్పధంతో స్పందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. విషాదకర సంఘటన జరిగినపుడు ప్రభుత్వం మానవత్వం చూపించాలన్నారు. రైల్వేశాఖ స్పందించి నష్టపరిహారం అందించాలని కిషన్ రెడ్డ కోరారు. డ్రైవర్ చేతిలో పసిపిల్లల ప్రాణాలు ఉంటాయి. అందువల్ల డ్రైవర్లకు కౌన్సిలింగ్ అవసరమన్నారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. రైల్వే క్రాసింగ్ ఉన్న అన్ని చోట్ల కాపలా మనుషులను పెట్టే విధంగా రైల్వే శాఖపై ఒత్తిడి తేవాలన్నారు. తాను కూడా ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానని చెప్పారు. -
రహదారులు రక్తసిక్తం
జిల్లాలో మంగళవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై లారీ, పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందులో ఒకరు హోంగార్డు కాగా ఇద్దరు లారీ డ్రైవర్లు ఉన్నారు. పెద్దశంకరంపేట మండలం జంబికుంట గేటు వద్ద ఆగి ఉన్న ఎడ్ల బండిని బైక్ ఢీకొన్న మరో సంఘటనలో ఒకరు మృతి చెందారు. బీడీఎల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో వృద్ధుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. చేగుంట, న్యూస్‌లైన్: ఏడో నంబర్ జాతీయ రహదారి రక్తమోడింది. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందులో ఒకరు హోంగార్డు కాగా ఇద్దరు లారీ డ్రైవర్లు ఉన్నారు. కాగా ఏఎస్ఐకి గాయాలయ్యాయి. తూప్రాన్‌కు చెందిన హైవే పెట్రోలింగ్ వాహనం ఉదయం 5 గంటల ప్రాంతంలో మాసాయిపేట వైపు వచ్చింది. అక్కడ దాబా వద్ద లారీలు ఆగి ఉండడంతో పెట్రోలింగ్ వాహనాన్ని ఆపిన హోంగార్డు వాహనం దిగాడు. లారీలను తీయాలంటూనే రోడ్డు దాటుతున్నాడు. అటువైపు ఉన్న ఇద్దరు డ్రైవర్లు హోంగార్డు ఏదో చెబుతున్నాడని అతని వద్దకు వస్తుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ మొదట పెట్రోలింగ్ వ్యాన్‌ను ఢీకొని ఆ తరువాత వీరి ముగ్గురిని ఢీకొంది. దీంతో పెట్రోలింగ్ వ్యాన్ డ్రైవర్-కం-హోంగార్డు మహమ్మద్ సయీద్ (26) అక్కడికక్కడే మరణించాడు. ఇదే ఘటనలో హర్యానా ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్లు బల్వీందర్‌సింగ్(35), సందీప్‌సింగ్(22) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా పెట్రోలింగ్ వాహనంలోనే కూర్చున్న కౌడిపల్లి ఏఎస్ఐ మల్లేశంకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీరిని ఢీకొన్న లారీతో సదరు డ్రైవర్ పరారీ కాగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట ఎస్ఐ వినాయక్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మల్కాపూర్‌లో విషాదఛాయలు కొండాపూర్, న్యూస్‌లైన్: వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు సయీద్ మరణించడంతో అతని స్వగ్రామమైన కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో సాయంత్రం ఖననం చేశా రు. ఏడేళ్ల క్రితం ఇతను పోలీసు శాఖ లో చేరాడు. తండ్రి పాషామియా 20 ఏళ్ల క్రితమే మరణించాడు. సయీద్‌కు ఇటీవలే పెళ్లి సంబంధం కుదరగా త్వ రలో పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామ సర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సా ర్ సీపీ జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మల్లేశం, పోలీసు సిబ్బంది తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.