మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రైలు బస్సును ఢీకొని సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో బస్సులోని 26మంది విద్యార్థులు అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాంతో బస్సు నుజ్జు నుజ్జు కాగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు తెలుస్తుంది.
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. మరోవైపు మంత్రి హరీష్ రావు సంఘటనా స్థలానికి బయల్దేరారు. బస్సులో విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.