
రాంగోపాల్‌పేట్: యశోద ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ పోలీసుల సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డకు చెందిన రామన్న కుమార్తె సౌందర్య(26). నాలుగు సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ ఇక్కడే ఉండే హాస్టల్‌లో నివసిస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి వెనుకవైపు ఉన్న హాస్టల్ గదికి వచ్చింది.
రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చిన మిగతా నర్సులు ఆమె నుంచి ఎలాంటి స్పందనను గమనించలేదు. ఆమెను పరిశీలించగా పక్కనే మత్తు ఇచ్చే ఇంజక్షన్ పడివుండటంతో పాటు చనిపోయి ఉంది. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందికి అక్కడికి చేరుకుని మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సు ఆత్మహత్యకు కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఉపయోగించిన ఫోన్‌కు లాక్ ఉండటంతో దాన్ని తెరవడం సాధ్యం కాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మహత్య చేసికుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment