
ఆస్పత్రి నుంచి హోం మంత్రి నాయిని డిశ్చార్జ్
హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి తెలంగాణ హోంశాఖ మంత్రి నర్సింహారెడ్డి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న నాయిని ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. కాగా, మంత్రి కొద్దిగా నీరసంగా ఉన్నారని త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులవుతారని డాక్టర్లు పేర్కొన్నారు.