భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (38) మృతి చెందారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు.
ఇక, ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఎస్సై శ్రీను స్వగ్రామం నారక్కపేట.
కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జితేందర్ రెడ్డి సతీమణి శైలజ ఒక వీడియో సందేశం పంపించారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ..‘జితేందర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం అన్యాయం. ఎస్సీ మాదిగ కులానికి చెందిన నన్ను ఆయన తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి నా భర్త. ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. కుల సంఘాలు ఆలోచన చేసి వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలి. జితేందర్ రెడ్డిపై ఆరోపణలను విరమించుకోవాలని విజ్ఞప్తి’ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment