‘నాన్న’ను ఆదుకుంటాం..
సాక్షి కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల: స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్కల్‌దేవి ప్రకాశ్ కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకంట్ల విద్యాసాగర్ రావు ఆదివారం పరామర్శించారు. ‘మా నాన్నను ఆదుకోరూ..’అనే శీర్షికన ‘సాక్షి’మెయిన్‌లో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ప్రకాశ్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రకాశ్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా, ప్రకాశ్ కుటుంబసభ్యులకు దాతలు తోచిన సాయం అందిస్తున్నారు. ఆదివారం కోరుట్ల రేషన్ డీలర్ల సంఘం వారు రూ.10 వేలు, అవధూత శ్రీధర్ రూ.5 వేలు, చింతామణి కావ్యశ్రీ రూ.2 వేల సాయం అందజేశారు.