కొణిజర్ల/ధర్మపురి : ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కల కలం రేగింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన బానోత్ సునీల్‌కు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యు లు తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం బీర్‌సాని గ్రామానికి చెందిన మహిళా రైతు ముద్దసాని లక్ష్మి స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన బానోత్ సునీల్ ఉపాధిహామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అతడిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
గ్రామంలో దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, తీవ్ర జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆరుగురిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్య చికిత్స చేయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం బీర్‌సాని గ్రామానికి చెందిన మహిళా రైతు ముద్దసాని లక్ష్మి ఆమె భర్త తిరుపతికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలు. అక్కడ రూ. 92 వేల బిల్లు అయ్యిందని ఆస్పత్రివారు చెప్పి, మరో ఆస్పత్రికి వెళ్లమని సూచిం చారు. దీంతో చేసేదేమీలేక బిల్లు కట్టి మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ రోజుకు రూ. 50 వేల ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు. వైద్యం కోసం తమకున్న ఇంటి స్థలం అమ్మకానికి పెట్టారు. ఇప్పటికీ లక్ష్మి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారని ఆమె భర్త తిరుపతి తెలిపారు.
ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కలకలం
Published Wed, Sep 2 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement
Advertisement