యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ | Ex CM KCR Admitted In Yashoda Hospital | Sakshi
Sakshi News home page

యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ

Published Fri, Dec 8 2023 8:14 AM | Last Updated on Sat, Dec 9 2023 8:03 AM

Ex CM KCR Admitted In Yashoda Hospital - Sakshi

Updates..

కేసీఆర్‌ హెల్త్‌ బులెటిన్‌

  • మాజీ సీఎం కేసీఆర్‌కు ఎడమ టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ 
  • శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టుల బృందం 
  • విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి
  • వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌

► యశోద ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స.
► మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న యశోద ఆస్పత్రి డాక్టర్లు

►యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ
►కొద్దిసేపటి క్రితమే కేసీఆర్‌కు ప్రారంభమైన ఆపరేషన్‌
►కేసీఆర్‌కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్‌
►గత రాత్రి ఇంట్లో జారిపడ్డ కేసీఆర్‌
►హుటాహుటిన రాత్రే ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు

► యశోద ఆసుపత్రి నాలుగో ఫ్లోర్లోని ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను షిఫ్ట్ చేస్తున్న వైద్యులు
►  కాసేపట్లో ఎడమ కాలు తుంటికి శస్త్ర చికిత్స అందించనున్న యశోద వైద్యులు

కాసేపట్లో కేసీఆర్‌కు సర్జరీ
►యశోద ఆసుపత్రి నాలుగో అంతస్తులో ఆపరేషన్‌

► మాజీ సీఎం కేసీఆర్ సేవలు భవిష్యత్తులో తెలంగాణకు అవసరం: మురళీధర్ రావు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్
► ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం
► క్రియాశీలక రాజకీయాల్లోకి కేసీఆర్‌ ఆరోగ్యంగా వస్తారని ఆశిస్తున్నాం.

యశోద ఆసుపత్రిలో హరీశ్‌ రావు కామెంట్స్‌

  • కేసీఆర్‌ గారికి యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
  • హిప్‌ రీప్లేస్మెంట్‌ చేయాలని వైద్యులు సూచించారు.
  • ఈరోజు సాయంత్రం సర్జరీ జరుగుతుంది. 
  • ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
  • కేసీఆర్‌ అభిమానులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దు. 
  • సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్లు హెల్త్‌ బెలిటెన్‌ను విడుదల చేస్తారు. 

కేసీఆర్‌ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్‌
►కేటీఆర్‌లో ట్విట్టర్‌లో..‘బాత్రూంలో పడిపోవడంతో కేసీఆర్‌ గారికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ ఆరా..
►యశోదా ఆసుపత్రి దగ్గర భద్రతను పెంచిన ప్రభుత్వం
►కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రేవంత్‌ 

మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. 

ఎడమ తుంటి మార్పిడి చేయాలని ప్రకటించిన వైద్యులు

  • కేసీఆర్ కి సిటి స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన వైద్యులు
  • సిటీ స్కాన్‌లతో సహా, హిప్ ఫ్రాక్చర్‌ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు. 
  • ఎడమ హిప్ రీప్లేస్‌మెంట్ అవసరమని సూచించిన వైద్యులు
  • ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్‌ అవసరం
  • ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్‌తో సహా వైద్య బృందం అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది.
  • ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
  • ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్న వైద్యులు

►కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

►మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్‌. 

►తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్‌ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.

►గజ్వేల్‌ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలి తుంటికి గాయాలైనట్లు తెలిసింది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్‌ ప్లేట్‌ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

►కాగా, ‍ప్రమాదంలో తుంటి బాల్‌ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం మైనర్‌ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement