
కోలుకుంటున్న చిన్నారులు
నలుగురి పరిస్థితి విషమం
సాధారణ వార్డుకు 12 మంది తరలింపు
హైదరాబాద్: మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 12 మంది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించారు. శనివారం 9 మందిని సాధారణ వార్డుకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తిరిగి క్రిటికల్ వార్డుకు తరలించారు. ఆదివారం మరో నలుగురిని సాధారణ వార్డుకు తరలించారు.
సాయిరాం, రుచితగౌడ్, సాత్విక, నబిరా ఫాతిమా, మహిపాల్‌రెడ్డి, సద్భావన్ దాస్, దర్శన్, కరుణాకర్, హరీష్, అభినందు, సందీప్, శిరీషలను సాధారణ వార్డుకు తరలించారు. శివకుమార్, నితూషల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శరత్, శ్రవణ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండగా ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా, మూడు రోజులుగా గాయపడ్డ విద్యార్థులను ఐసీయూ, ఏఎన్‌సీయూ, ఎస్‌ఐసీయూ వార్డుల్లో ఉంచడంతో తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని కన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.