
సాక్షి, అమరావతి/యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన పలు సభల్లో మాట్లాడారు.
అనంతరం అస్వస్థతకు గురయ్యారు. గత నెల 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించి బుధవారం స్టెంట్ వేశారు. విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. మంత్రి సురేష్‌ను ఫోన్‌లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోలుకున్న ఆయన్ను శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment