సాక్షి, హైదరాబాద్ : ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని మంగళవారం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా జానారెడ్డి ప్రస్తుతం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన ...అక్కడే అస్వస్థతకు గురి కావడంతో ...హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి జానారెడ్డి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కోలుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment