వీడియో: కాలికి ఆపరేషన్‌. వాకర్‌ సాయంతో కేసీఆర్‌ నడక! | KCR Walking After Surgery At Yashoda Hospital; See Video - Sakshi
Sakshi News home page

వీడియో: కాలికి ఆపరేషన్‌.. వాకర్‌ సాయంతో కేసీఆర్‌ నడక!

Dec 9 2023 1:20 PM | Updated on Dec 9 2023 5:15 PM

KCR Walking After Treatment At Yashoda Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌ ఎడమ కాలికి యశోద ఆసుపత్రి వైద్యులు నిన్న హిప్‌ రిప్లేస్‌మెంట్‌ చేశారు. దీంతో, ఆయనకు దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 

మరోవైపు.. ఆపరేషన్‌ అనంతరం కేసీఆర్‌ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక, కాలికి ఆపరేషన్‌ తర్వాత.. నడవడానికి కేసీఆర్‌ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు కేసీఆర్‌ దగ్గరే ఉండి.. వాకర్‌ సాయంతో ఆయనను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. కేసీఆర్‌ను మై రాక్‌స్టార్‌ అంటూ కామెంట్స్‌ చేస్తూ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.  ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ అనంతరం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement