మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ | woman injured as gun misfires in medak district | Sakshi
Sakshi News home page

మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

Published Thu, Aug 21 2014 11:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

మెదక్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం న్యూఉమ్నాపూర్‌లోని  పోలీస్‌ ట్రైనింగ్ క్యాంప్‌ వద్ద గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. సిబ్బంది శిక్షణ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మిస్ఫైర్ అయ్యింది. ఆ సమయంలో న్యూఉమ్నాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళుతుండగా ఆమె తలలోకి ఓ బుల్లెట్ దూసుకు వెళ్లింది.

 

దాంతో ఆమెను బంధువులు హుటాహుటీన చికిత్స నిమిత్తం  సంగారెడ్డి గోకుల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు   చంద్రకళ తలలోని బుల్లెట్ను తొలగించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement