chandrakala
-
అప్పు తీర్చమన్నందుకు.. మహిళను దారుణంగా..
నిజామాబాద్: నవీపేట మండలంలోని కోస్లీ శివారులో ఉన్న అలీసాగర్ కాలువలో ఈనెల 10వ తేదీన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పుతీర్చమన్నందుకు సదరు మహిళను హత్య చేశారని తేల్చారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్, నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్ సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చంద్రకళ వద్ద అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి, గంగాధర్ రూ.50వేలు అప్పుగా తీసుకున్నారు. గడువు సమీపిస్తున్న తరుణంలో డబ్బులు తిరిగిచెల్లించాలని చంద్రకళ వారిని కోరగా, వారు సమాధానం ఇవ్వలేదు. చంద్రకళను హతమార్చాలని పథకం పన్నిన గోదావరి, గంగాధర్ ఈనెల 10న ఆమెను డబ్బులు చెల్లిస్తామని ఇంటికి రప్పించి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత ద్విచక్రవాహనంపై చంద్రకళ మృతదేహాన్ని తీసుకువచ్చి అలీసాగర్ కాలువలో పారేశారు. నిందితులైన భార్యాభర్తలు గోదావరి, గంగాధర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవి చదవండి: తండ్రి మరణం.. బెంగతో కూతురి విషాదం! -
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. బలవంతంగా తాగించి.. ఆపై..
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ ప్రాంతానికి చెందిన బోడ చంద్రకళ అనే మహిళకు బలవంతంగా కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించిన గోవర్దన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నటేశ్ తెలిపారు. చంద్రకళ విద్యుత్ శాఖలో ఫిల్టర్ మెకానిక్ గ్రిడ్‌గా పని చేస్తుంది. అదే శాఖలో పని చేసే గోవర్దన్ అక్టోబర్ 30న కూల్‌డ్రింక్ తీసుకొచ్చి చంద్రకళకు ఇవ్వగా.. ఆమె తాగేందుకు నిరాకరించింది. బలవంతం చేయడంతో ఆమె కూల్‌డ్రింక్ తాగగా.. అస్వస్థతకు గురైంది. ఫోన్లో భర్త బోడ మోహన్‌కు సమాచారమందించింది. మోహన్ కార్యాలయానికి వెళ్లి చంద్రకళను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు కూల్‌డ్రింక్‌లో విషం కలపడం వల్లే అస్వస్థతకు గురైందని వెల్లడించారు. మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇవి చదవండి: ‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. యువకుడు.. -
పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
-
Gland Pharma: పవర్ లిఫ్టర్ చంద్రకళకు ఆర్థికసాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఏషియన్ పవర్ లిఫ్టర్ చంద్రకళకు విశాఖపట్నానికి చెందిన గ్లాండ్ ఫార్మా సంస్థ మంగళవారం రూ.2 లక్షల ఆర్థికసాయం అందించింది. విజయవాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్రకళ ఇప్పటివరకు మూడు ఏషియన్ గేమ్స్‌లో ఏడు పతకాలు సాధించింది. జూన్‌లో కోయంబత్తూర్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచిన ఆమె డిసెంబర్లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు గ్లాండ్ ఫార్మా తరఫున సీనియర్ మేనేజర్ కె.గణేష్‌కుమార్ రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు ఆర్థికసాయం అందజేసిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ యజమాని కెప్టెన్ రఘురామ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి) -
శోభన్ ‘బాబు’ను చేసిన తాసిల్దారు గారి అమ్మాయి
‘అవకాశం వస్తే, మీ నాన్న గారి సినిమాల్లో ఏది రీమేక్ చేస్తారు?’ ‘ప్రేమనగర్’ లాంటి సూపర్ హిట్లు తీసిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు గురించి, కమర్షియల్ విజయాలలో తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన దర్శకుడు కె. రాఘవేంద్రరావును కొన్నేళ్ళ క్రితం అడిగాం. దానికి, రాఘవేంద్రరావు ఊహకందని జవాబిచ్చారు. ‘‘ఏయన్నార్ నటించిన ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24)ను ఇవాళ మారిన టెక్నాలజీతో బ్రహ్మాండంగా తీసే అవకాశం ఉన్నా... ఆ కథను మా నాన్న గారు తీసినదాని కన్నా గొప్పగా ఎవరూ తీయలేరు. గతంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నేను, హీరో నాగార్జున, నిర్మాత రామానాయుడు గారు అనుకున్నా, మళ్ళీ వదిలేశాం. అయితే, నాన్న గారు తీసిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’ చాలా మంచి స్క్రిప్టు. వీలుంటే, అది రీమేక్ చేయాలని ఉంది’’ – ఇదీ ‘అడవి రాముడు’ లాంటి అనేక ఇండస్ట్రీ హిట్స్ తీసిన రాఘవేంద్రుడి ‘సాక్షి’కి చెప్పిన మనసులో మాట. తండ్రి కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో, తనయుడు కె. రాఘవేంద్రరావు సహాయ దర్శకుడిగా పనిచేసిన అలనాటి శతదినోత్సవ చిత్రం ‘తాసిల్దారు గారి అమ్మాయి’ (రిలీజ్ 1971 నవంబర్ 12). ఆ చిత్రానికి ఇప్పుడు 50 వసంతాలు. ఇంతకీ, శోభన్‌బాబు వర్ధమాన నటుడిగా ఉన్న రోజుల్లో, జమున టైటిల్ రోల్ పోషించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’లో అంత ప్రత్యేకత ఏముంది? చరిత్ర తరచి చూస్తే – చాలానే ఉంది. సోలో హీరోగా... కెరీర్‌కు కొత్త మలుపు! శోభన్‌బాబు సినీరంగానికి వచ్చి అప్పటికి పుష్కరకాలం. చిన్న వేషాల నుంచి పెద్ద వేషాలు, కథానాయక పాత్రల దాకా ఆ పన్నెండేళ్ళలో 70కి పైగా సినిమాల్లో చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి స్టార్ల పక్కన, సమకాలీన హీరో కృష్ణతోనూ కలసి నటిస్తున్నారు. ‘వీరాభిమన్యు’ (1965), విడిగా ‘మనుషులు మారాలి’ (1969), ‘కల్యాణమంటపం’ (1971) లాంటి హిట్లొచ్చినా, సోలో హీరోగా నిలదొక్కుకోలేదు. అలాంటి పెద్ద బ్రేక్ కోసం ఈ అందగాడు నిరీక్షిస్తున్నారు. సరిగ్గా అప్పుడు శోభన్ కెరీర్లో 80వ సినిమాగా రిలీజైన ‘తాసిల్దారు గారి అమ్మాయి’తో ఆ నిరీక్షణ ఫలించింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా, సింగిల్ హీరోగా నిలబెట్టేసింది. ‘తాసిల్దారు..’లో తండ్రి – కండక్టర్. కొడుకు – కలెక్టర్. తండ్రీకొడుకులుగా శోభన్ ద్విపాత్రధారణ ప్రజలకు నచ్చింది. చిత్ర విజయానికి కారణమైంది. ఒకేసారి తెరపై రెండు విభిన్న పాత్రల్ని సమర్థంగా చేయడం... నటుడిగా ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచింది. జమున – చంద్రకళ హీరోయిన్లుగా మెప్పించారు. నాగభూషణం, రావికొండలరావు, సాక్షి రంగారావు, హాస్యపాత్రలో రాజబాబు అలరించారు. వయసు 34... పాత్ర 64... శోభన్ తన కెరీర్లో పలుమార్లు ద్విపాత్రాభినయం చేశారు. కానీ, ఆయన ద్విపాత్రాభినయానికీ, విభిన్న పాత్రపోషణకూ మొట్టమొదట గుర్తింపు తెచ్చింది ‘తాసిల్దారు...’ చిత్రమే! నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందే కమెడియన్ పద్మనాభం నిర్మించిన ‘పొట్టి ప్లీడరు’ (1966)లో అన్నదమ్ములుగా తొలిసారి రెండు రోల్స్ పోషించారు శోభన్. కానీ, పెద్ద వయసు తండ్రి ప్రసాదరావుగా – కుర్రకారు కొడుకు వాసుగా రెండు భిన్న వయసు పాత్రలు... అదీ కథకు కీలకమైన కథానాయక పాత్రలు పూర్తిస్థాయిలో పోషించి, మెప్పించారీ చిత్రంలో! మనిషి తీరు, మాట, నడక – అన్నీ వేర్వేరైన ఆ పాత్రలను ఏకకాలంలో తెరపై రక్తికట్టించేందుకు శారీరకంగా, మానసికంగా చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా – తండ్రీ కొడుకులు పాత్రలు పరస్పరం సంభాషించుకొనే ఘట్టాలలో! ఒక రోజునైతే... ఒక పూటంతా శ్రమపడ్డా ఒక్క షాట్ కూడా ఓకే కాలేదు. ఇక ఆ రోజు చేయలేనని వెళ్ళిపోయి, రాత్రంతా రిహార్సల్ చేసుకున్నారు. మరునాడు వెళ్ళీ వెళ్ళడంతోనే ఫస్ట్ టేక్ ఓకే చేశారు. అదీ ఆయన పట్టుదల. అలా 34 ఏళ్ళ నిజజీవిత ప్రాయంలో చత్వారపు కళ్ళజోడు, చేతిలో కర్రతోడు ఉన్న అరవై ఏళ్ళు దాటిన ముసలి తండ్రి పాత్రలోనూ జనాన్ని మెప్పించారు. దటీజ్ శోభన్! కాలేజీ కలలరాణి సరసనే హీరోగా... కాలేజీ రోజుల నుంచి శోభన్ పిచ్చిగా ప్రేమించి, ఆరాధించి, అభిమానిగా జవాబు రాని ఉత్తరాలెన్నో రాసి, నిద్ర పట్టని కలలతో మద్రాసు వాహినీ స్టూడియోలో అష్టకష్టాలు పడి ‘ఇల్లరికం’ (1959) సెట్స్‌లో దగ్గర నుంచి చూసిన ఆనాటి స్టార్ హీరోయిన్ జమున. హృదయరాణి జమున సరసన జంటగా నటించాలని తపించిన ఆయనకు తొలిసారిగా ఆమెతో నటించే అదృష్టం వరించింది ‘తాసిల్దారు గారి అమ్మాయి’లోనే. నిర్మాతలు కొత్తవాళ్ళయినా, పేరున్న దర్శకుడు ప్రకాశరావు అడగడంతో వర్ధమాన హీరో శోభన్ పక్కన నటించేందుకు జమున కాదనలేకపోయారు. అలా తెరపై తొలిసారే ఆమెకు భర్తగా, కొడుకుగా రెండు పాత్రలు పోషించే అవకాశం శోభన్‌కు దక్కింది. 1971 మార్చి 15న మద్రాసు వాహినీ స్టూడియోలో ప్రసిద్ధ నిర్మాత బి. నాగిరెడ్డి క్లాప్ ఇవ్వగా, పంపిణీదారులు ‘లక్ష్మీఫిలిమ్స్’ అధినేత బి. శివరామయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, జమున మీద మొదటి షాట్‌తో చిత్రీకరణ మొదలైంది. సెట్స్‌లో మొదట ఒకటి రెండు సీన్లకు భయపడ్డా, జమున సహకారంతో శోభన్∙విజృంభించారు. భర్తను అనుమానించి, బంధానికి దూరంగా బతికిన భార్యగా, కష్టపడి కొడుకును ప్రయోజకుడిగా పెంచే తల్లిగా బరువైన మధుమతి పాత్రను జమున రక్తి కట్టించారు. జనం మెచ్చిన ఈ జంట అభినయంతో సినిమా దిగ్విజయం... సభలు– సమావేశాలు... శతదినోత్సవాలు. కానీ, మారిన సినిమా గ్లామర్, గ్రామర్‌తో ఆ తరువాత ఆరేళ్ళకు కానీ వారిద్దరి కాంబినేషన్లో మరో సినిమా (‘గడుసు పిల్లోడు’– 1977) రాకపోవడం విచిత్రం! శోభన్ – జమున కాంబినేషన్లో ఆఖరి సినిమా కూడా అదే! తండ్రి శిక్షణలో... రాటుదేలిన రాఘవేంద్రుడు! యాభై ఏళ్ళ క్రితం... ఈ సినిమా తీస్తున్ననాటికి... రాఘవేంద్రరావు ఇంకా దర్శకుడు కాలేదు. దర్శకులు పి. పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు, వి. మధుసూదనరావు లాంటి వారి వద్ద పనిచేసి, కన్నతండ్రి వద్ద ఆయన దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్న రోజులవి. ఆ సమయంలో ‘తాసిల్దారు గారి అమ్మాయి’ సెట్స్‌లో కె.ఎస్. ప్రకాశరావు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాధ్యతను కుమారుడికి అప్పగించి, తాను దూరంగా కుర్చీలో కూర్చొని పరిశీలిస్తూ, ప్రాక్టికల్ శిక్షణనిచ్చారు. అలా దర్శకుడు కాక ముందే రాఘవేంద్రరావు కొన్ని సీన్లకు దర్శకత్వ బాధ్యత వహించారీ చిత్రానికి. ఆ రకంగా ఈ చిత్రం ఆయన కెరీర్లో ఓ మధుర జ్ఞాపకం. ఆ తరువాత సరిగ్గా ఆరేళ్ళలో అదే ‘సత్యచిత్ర’ పతాకంపై, అదే నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలకు అగ్ర హీరో ఎన్టీఆర్‌తో ‘అడవి రాముడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ రూపొందించే స్థాయికి రాఘవేంద్రరావు ఎదగడం విశేషం. ఆ మాటకొస్తే, ఇవాళ శతాధిక చిత్ర దర్శకుడైన ఆయనను అసలు డైరెక్టర్ని చేసిన తొలి చిత్రం ‘బాబు’ (1975)కు ఛాన్స్ ఇచ్చింది శోభన్‌బాబే! అప్పటికే నూటికి పైగా సినిమాల్లో నటించి, వరుస విజయాలతో స్టార్ హీరోగా వెలుగుతున్నారు శోభన్. కలవడానికి కూడా భయపడుతూ, తండ్రి ప్రకాశరావు ప్రోద్బలంతో వచ్చిన రాఘవేంద్రరావు భుజం తట్టి, తొలి చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించిన పెద్దమనసు శోభన్‌బాబుది. అలా ఇన్నేళ్ళ దర్శకేంద్రుడి కెరీర్‌కు అప్పట్లో కొబ్బరికాయ కొట్టిన హీరో ఈ ఆంధ్రుల అందాల నటుడు. రెండు నవలలు – రెండూ హిట్టే! ఒక వైపు ‘ప్రేమనగర్’, మరోవైపు ‘తాసిల్దారు గారి అమ్మాయి’ – రెండు చిత్రాలనూ ఏకకాలంలో, ఏకాగ్రతతో తీర్చిదిద్దారు దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు. రెండూ నవలా చిత్రాలే! రెండు నవలలూ ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో హిట్ సీరియల్సే! మొదటిది – కోడూరి కౌసల్యాదేవి ‘ప్రేమనగర్’. రెండోది – కావిలిపాటి విజయలక్ష్మి ‘విధి విన్యాసాలు’. ‘కండక్టరు కొడుకు కలెక్టరవుతాడా?’ అనే ఆసక్తికరమైన ప్రశ్న ఉపశీర్షికగా ‘విధి విన్యాసాలు’ వారం వారం పాఠకులను పట్టువిడవకుండా చదివించింది. కమర్షియల్ ఎలిమెంట్లున్న ఆ నవల హక్కులు కొనుక్కొని, సినిమా తీద్దామని వచ్చారు నిర్మాతలు. దర్శకుడు ప్రకాశరావు వారికి అండగా నిలిచారు. వెండితెరకు కావాల్సిన పాత్రోచిత మార్పులతో స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు. అందుకు తోడ్పడ్డ నవలా – నాటక రచయిత ఎన్.ఆర్. నందిని మాటల రచయితగా పెట్టుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కండక్టర్ కొడుకైన హీరో చివరకు అసామాన్యుడైన కలెక్టర్‌గా ఎదిగి, తండ్రి ఆశ నెరవేర్చడమనే ఇతివృత్తం ఆ తరంలో చిగురిస్తున్న ఆశలకు తగ్గట్టు, మధ్యతరగతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుమానించి, అహంకారంతో అవమానించి, భర్తకు దూరమైన ఇల్లాలి జీవితం – చివరకు తన తప్పును తెలుసుకొన్న ‘తాసిల్దారు గారి అమ్మాయి’గా టైటిల్ రోల్లో జమున అభినయం మహిళా ప్రేక్షకులకు పట్టేసింది. వెరసి, సినిమా విజయవంతమైంది. భార్యాభర్తల మధ్య అపోహలు – అపార్థాలు, కన్నబిడ్డ పెరిగి పెద్దయ్యాక చాలా ఏళ్ళకు వారు తిరిగి కలుసుకోవడం అనే ఈ సెంటిమెంటల్ ఫ్యామిలీ కమర్షియల్ కథాంశం ఆ తరువాత మరిన్ని సినిమాలకు స్ఫూర్తినిచ్చింది. పాపులర్ పాటల అదే కాంబినేషన్! ‘ప్రేమనగర్’ కలిసొచ్చిన దర్శక – సంగీత దర్శక – గీత రచయితల త్రయమే (ప్రకాశరావు – కె.వి. మహదేవన్ – ఆత్రేయ) ‘తాసిల్దారు...’కీ పనిచేసింది. ‘ప్రేమనగర్’ రిలీజైన సరిగ్గా 50వ రోజున ‘తాసిల్దారు...’ జనం ముందుకు వచ్చింది. కలర్ సినిమాల హవా మొదలైపోయిన ఆ రోజుల్లో అన్ని రకాల కలర్‌ఫుల్ ‘ప్రేమనగర్’ సంగీతపరంగానూ అపూర్వ విజయం సాధించింది. ఏటికి ఎదురీది బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ‘తాసిల్దారు...’ అంత మ్యూజికల్ హిట్ కాలేదు. అయితేనేం, శతదినోత్సవ చిత్రమై, కొన్ని పాపులర్ పాటలను అందించింది. పెద్ద శోభన్‌బాబుపై వచ్చే ‘కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం...’ (గానం కె.బి.కె. మోహనరాజు) తాత్త్విక రీతిలో సాగుతూ, తరచూ రేడియోలో వినిపించేది. అలాగే, పెద్ద శోభన్‌బాబు – జమునలపై వచ్చే యుగళగీతం ‘నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ...’ పాట ‘కలసిపోయాము ఈనాడు, కలసి ఉంటాము ఏనాడు’ అనే క్యాచీ లైన్‌తో ఇవాళ్టికీ ఆకర్షిస్తుంది. చిన్న శోభన్‌బాబు – చంద్రకళ జంటపై వచ్చే డ్యూయట్ ‘అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి...’ (గానం పి. సుశీల, జేవీ రాఘవులు) ఆనాటి కుర్రకారు పాట. తొలి తెలుగు లేడీ ఆర్ట్ డైరెక్టర్‌తోనే..! సినీరంగంలో కెమేరా, కళ లాంటి కొన్ని శాఖల్లో ఆడవాళ్ళు ఇవాళ్టికీ చాలా అరుదు. అలాంటిది – 50 ఏళ్ళ క్రితమే ఓ తెలుగు మహిళ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ‘తాసిల్దారు గారి అమ్మాయి’. శ్రీమతి మోహన ఆ సినిమాకు కళా దర్శకురాలు. ఆమె కె.ఎస్. ప్రకాశరావుకు దూరపు బంధువు. మేనకోడలు వరుస. అంతేకాదు... తెలుగు సినీ చరిత్రలో తొలి లేడీ ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆవిడే! మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లమో పట్టా సాధించిన మోహన తన విద్యార్థి దశలోనే సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ కావడం చెప్పుకోదగ్గ విషయం. కె.ఎస్. ప్రకాశరావు రూపొందించిన ‘రేణుకాదేవి మహాత్మ్యం’ (1960)తో ఆమె కళాదర్శకురాలయ్యారు. ఆ తరువాత ప్రకాశరావు, జి. వరలక్ష్మిల తమిళ చిత్రం ‘హరిశ్చంద్ర’కూ, అలాగే మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన ‘చిన్నారిపాపలు’, ‘ప్రాప్తమ్’ (ఏయన్నార్ ‘మూగ మనసులు’కు తమిళ రీమేక్) చిత్రాలకూ కళాదర్శకురాలిగా పనిచేశారు. ఆ రోజుల్లో వివిధ మ్యాగజైన్లకు బొమ్మలు కూడా వేసిన మోహన, ప్రముఖ కమెడియన్ – మెజీషియన్ అయిన రమణారెడ్డికి మేజిక్ ప్రదర్శనల్లో సహాయకురాలిగానూ వ్యవహరించేవారు. తమిళ నటుడు టి.ఎస్. బాలయ్య కుమారుణ్ణి ఆమె వివాహమాడారు. దురదృష్టవశాత్తూ, చిన్న వయసులోనే అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. తొలి తెలుగు లేడీ ఆర్ట్ డైరెక్టర్ ప్రస్థానం అలా అర్ధంతరంగా ముగిసిపోయింది. ఉత్తమ నటుడిగా... తొలి గుర్తింపు! కలర్ సినిమాలు జోరందుకుంటున్న ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్‌లోనే చేసిన సాహసం ‘తాసిల్దారు..’. ఈ సెంటిమెంటల్ కుటుంబ కథాచిత్రం అప్పట్లో 29 కేంద్రాల్లో రిలీజైంది. 5 (విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు) కేంద్రాల్లో డైరెక్టుగా, మరో కేంద్రం (హైదరాబాద్)లో షిఫ్టుతో – మొత్తం 6 కేంద్రాల్లో ఈ చిత్రం వంద రోజులు ఆడింది. విశేష మహిళాదరణతో విజయవాడ విజయా టాకీస్‌లో, గుంటూరు లిబర్టీలో, రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్‌లో అత్యధికంగా 105 రోజులు ఆడింది. ఆరు కేంద్రాలలో వందరోజులు ఆడిన సందర్భంగా, రాజమండ్రిలోని నవభారతి గురుకులం ఆవరణలో 1972 ఫిబ్రవరి 19న చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం, పంపిణీదారులు, థియేటర్ యజమానుల మధ్య ఘనంగా శతదినోత్సవం జరిపారు. స్టార్ హీరో అక్కినేని ఆ సభకు అధ్యక్షుడిగా రావడం విశేషం. రివార్డులే కాదు అవార్డులూ ‘తాసిల్దారు గారి అమ్మాయి’కి దక్కాయి. ప్రసిద్ధ జాతీయ సినీ పత్రిక ‘ఫిల్మ్‌ఫేర్’ ఆ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డుకు ఈ సినిమానే ఎంపిక చేసింది. అలాగే, ఈ చిత్రం అందాల నటుడు శోభన్‌బాబు అభినయానికీ గుర్తింపునిచ్చింది. అవార్డులు తెచ్చింది. ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా ఆయన అందుకున్న తొలి అవార్డు అదే. ఈ చిత్ర నిర్మాతలు ఆ తర్వాత అయిదేళ్ళకు మళ్ళీ శోభన్‌బాబుతోనే తమ ‘సత్యచిత్ర’ బ్యానర్‌పై, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ప్రేమబంధం’ (1976) అనే కలర్ సినిమా తీయడం గమనార్హం. ముందు శోభన్‌బాబు... తర్వాత చిరంజీవి – నిజమైన ఆ జోస్యం! అప్పట్లో అక్కినేని, వర్ధమాన హీరో శోభన్‌బాబును మెచ్చుకుంటూ ‘హి ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ’ అన్నారు. ఆ జోస్యం ఫలించింది. ఒక్క 1971లోనే ఏకంగా 16 చిత్రాల్లో నటించిన శోభన్‌బాబుకు సోలో హీరోగా దశ తిరిగింది – ‘తాసిల్దారు...’తోనే. ఆ వెంటనే కె. విశ్వనాథ్ ‘చెల్లెలి కాపురం’ (1971), మరుసటేడు ‘సంపూర్ణ రామాయణం’, ‘మానవుడు – దానవుడు’ – ఇలా వరుస హిట్లతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరో అయ్యారు. దశాబ్దిన్నర పైగా ఆ హోదాలో అలరించారు. ‘తాసిల్దారు...’ విడుదలైన సరిగ్గా పదేళ్ళకు... 1981లో లక్ష్మి – చిరంజీవి అక్కాతమ్ముళ్ళుగా ‘చట్టానికి కళ్ళు లేవు’ రిలీజైంది. హైదరాబాద్‌లో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్. మద్రాసు నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన శోభన్‌బాబు నోట యాదృచ్ఛికంగా సరిగ్గా పదేళ్ళ క్రితం అక్కినేని అన్న మాటే వచ్చింది. ‘ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి’ అన్నారు ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు. శోభన్ మనస్ఫూర్తిగా అన్న ఆ మాటే నిజమైంది. వర్ధమాన నటుడు చిరంజీవిని సోలో హీరోగా ‘చట్టానికి కళ్ళు లేవు’ నిలబెట్టింది. ఆయన దశ తిరిగింది. బ్లాక్‌బస్టర్ ‘ఖైదీ’ (1983) మీదుగా ఆయన మెగాస్టార్ దాకా ఎదిగారు. సినిమా చరిత్రలో ఊహకందని ‘విధి విన్యాసాలు’ అలానే ఉంటాయి మరి! – రెంటాల జయదేవ -
పాల ప్యాకెట్ కోసం వచ్చి.. అనంతలోకాలకు
తూర్పుగోదావరి,మండపేట: పాల ప్యాకెట్ కోసం వచ్చిన చిన్నారిని మురుగునీటి డ్రైన్ రూపంలో మృత్యువు కబళించింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చింది. బాలికను కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికులు డ్రైన్లో గాలించినా ఫలితం లేకపోయింది. పట్టణానికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. స్థానిక మూడో వార్డులోని ఇంటిలో అద్దెకు ఉంటున్న దుర్గాప్రసాద్ వడ్రంగి పని చేస్తుంటాడు. స్థానిక రామాహిందూ మున్సిపల్ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్ర సమయంలో పాల ప్యాకెట్ కోసం పోలీస్‌స్టేషన్ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే కుంభవృష్టిగా కురిసిన వర్షంతో దుకాణం సమీపంలోని మంగళిబోదె డ్రైన్ వేగంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి ముంపునీరు ప్రవహిస్తుండడంతో నీటిలో కాలి చెప్పు జారిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి ప్రవాహ వేగానికి డ్రైన్లో పడి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు చిన్నారులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లికి చెప్పడంతో ఆమె పరుగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకుంది. తన బిడ్డను కాపాడమంటూ ఆమె డ్రైన్ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైన్‌లోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటరు దూరంలో చిన్నారి దొరకడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు ప్రసాద్, పల్లవి శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డను కాపాడమంటూ ఆస్పత్రి వద్ద వారు మొరపెట్టుకోవడం చూపరులను కలచివేసింది. -
అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలి
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : దేశ ప్రతిష్ట పెంచేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని, భవిష్యత్‌లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ కె.చంద్రకళ ఆకాంక్షించారు. ఇస్రో, షార్ ఆధ్వర్యంలో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 5 నుంచి జరుగుతున్న అంతరిక్ష వారోత్సవాల వైజ్ఞానిక ప్రదర్శనలు సోమవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే విద్యార్థి స్థాయి నుంచి గణితం, ఫిజిక్స్‌పై మక్కువ పెంచుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల విజయం వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఉంటుందన్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తగా ప్రయాణం మొదలు పెట్టి రాష్ట్రపతిగా దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన అబ్దుల్ కలాం వంటి మహానుభావుల అడుగు జాడల్లో నడవాలన్నారు. క్విజ్, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఇస్రో ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఇస్రో ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో డీఈఓను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. టెక్కలి ఎస్ఐ బి.గణేష్ వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో గ్రూప్ డైరక్టర్ ఎ.ప్రసాదరావు, ప్రోగ్రాం మేనేజర్ టి.హరికృష్ణ వైజ్ఞానిక ప్రదర్శన కన్వీనర్ పీ.శ్రీనివాసులు, డీజీఎం అప్పన్న, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ ఎం.రమణా రావు, ఆదిత్య కళాశాల డైరక్టర్ వి.వి. నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్. నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఏ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ డి.విష్ణుమూర్తి, ఉప విద్యా శాఖాధికారి కే.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల మాలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతరిక్ష అంశాల ఎంతో విజ్ఞానం లభిస్తుంది. – డి.శ్రీకాంత్, క్విజ్ విజేత, పోలవరం, టెక్కలి మండలం ఆసక్తి కలుగుతోంది ఇస్రో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల్లో చివరిగా జరిగిన చిత్రలేఖనం పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం నిలిచాను. గత 3 రోజులుగా జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలు చూసిన తరువాత అంతరిక్ష అంశాలపై ఎంతో ఆసక్తి కలుగుతోంది. – వి.ఖగేశ్వరి, చిత్రలేఖనం విజేత, నర్సింగపల్లి, టెక్కలి మండలం ఎంతగానో ఉపయోగం ఇస్రో ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఇటువంటి అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి, వివిధ రకాల పోటీలు నిర్వహించడం ఎంతగానో ఉపయోగం. చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ స్థానంలో విజేత కావడం ఎంతో ఆనందంగా ఉంది. –ఎం.దినేష్, చిత్రలేఖనం విజేత, నౌపడ, సంతబొమ్మాళి మండలం -
అమ్మా.. నను చూడకుండానే కనుమూశావా..
అమ్మా.. నవమాసాలునను కంటికి రెప్పలాకాపాడుకున్నావు.. ననుఈ ప్రపంచానికి పరిచయంచేశావు... నీవు మాత్రంనాతో బంధాన్ని తెంపుకొన్నావు... నను చూడకుండానే కనుమూశావాతల్లీ.. నేనేపాపం చేశానని..వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నీ ఆలన, పాలన,అనురాగం, ప్రేమకుదూరం అయ్యానా...!వైద్యుల నిర్లక్ష్యంతోనిండుచూలాలుమృతిచెందిన ఘటనగాలివీడు మండలంసీసీపల్లె గ్రామం కడపవాండ్లపల్లె దళితవాడలోశుక్రవారం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా , గాలివీడు : మండల పరిధిలోని సీసీపల్లె గ్రామం కడపవాండ్లపల్లె హరిజవాడకు చెందిన బాలిపోగు రామకృష్ణ భార్య చంద్రకళ(29) సరైన వైద్యం అందక మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి... చంద్రకళ గర్భందాల్చినప్పటి నుంచి నూలివీడు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సూచనలు, సలహాలు తీసుకుంటోంది. ఆరు మాసాలు గడిచిన తరువాత రక్త హీనతతో ఉన్న విషయం వైద్యులకు తెలిసినప్పటికి మృతురాలికి రక్తం పెంచేందుకు చర్యలు తీసుకోలేదు. కాగా శుక్రవారానికి చంద్రకళకు తొమ్మిది నెలలు పూర్తవ్వడంతో పురిటి నొప్పులతో బాధపడుతుండా మధ్యాహ్నం ఆటో సహాయంతో నూలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో సిబ్బందితో వైద్యం అందిస్తున్న క్రమంలో చంద్రకళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండవ బిడ్డ జన్మించే సమయంలో వైద్యం వికటించి మృతి చెందింది. కాగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చంద్రకళ మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇకనైనా ఇలాంటి అత్యవసర కేసుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా జిల్లాస్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చంద్రకళ వైద్యం వికటించి మృతి చెందడం దురదృష్టకరమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. చంద్రకళ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆయనతోపాటు మాజీ జెడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు యదుభూషణ్‌రెడ్డి, గ్రామ నాయకులు కృష్ణారెడ్డిలు మృతదేహానికి సంతాపం తెలిపారు. -
మైనింగ్ కేసులో ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీ అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీచేసింది. ఈడీ విచారణాధికారి ఎదుట జనవరి 24, 28న హాజరు కావాలని చంద్రకళ, రమేశ్ మిశ్రాలను ఆదేశించింది. మిగిలిన ఇద్దరు అధికారులకు వచ్చేవారం సమన్లు జారీచేస్తామని పేర్కొంది. 2012–16 మధ్యకాలంలో యూపీలోని హామీర్పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీఐ కేసు నమోదుచేసింది. అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ తన వద్ద గనుల శాఖను అట్టిపెట్టుకున్నారనీ, అనుమతుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నగదు చెలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదుచేసింది. మైనింగ్ అనుమతుల జారీకి నిందితులు అందుకున్న అవినీతి సొమ్ము హవాలా మార్గాల ద్వారా వచ్చిందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా నిందితుల స్థిర, చరాస్తులను జప్తు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
‘చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’
-
‘చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ భట్రాజుల సంఘం మహిళా అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో చంద్రకళ మాట్లాడుతూ..చంద్రబాబు వ్యాఖ్యలు యావత్ భట్రాజుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. మీ ఉపమాన ఉపమేయాల కోసం ఆత్మగౌరవంతో విద్యను నమ్ముకుని బతికే మమ్మల్ని అవమానపరుస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే భేషరుతుగా భట్రాజులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏపీలో ఉన్న 8 లక్షల మంది భట్రాజులందరూ ఏకమై వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మా భట్రాజుల ఫెడరేషన్‌కు పాలకమండలి వేయరు, మా సంక్షేమానికి సహకరించరు గానీ మాపై నోరు పారేసుకుంటారా అని తీవ్రంగా మండిపడ్డారు. గతంలో గద్దర్ ఇలానే అని బహిరంగా క్షమాపణ చెప్పారు..ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించకపోతే తెలంగాణ డీజీపీకి చంద్రబాబు నాయుడిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ను కూడా కలిసి విషయం చెబుతామని, ఇతర బీసీ సామాజికవర్గాలన్నింటినీ కలుపుకుని చంద్రబాబుకు తగిన బుద్ధిచెబుతామన్నారు. -
మన బులంద్ బెహన్
ఉన్నతమైన ఆశయాలున్న గర్జనపల్లి చెల్లిసామాన్యమైన కుటుంబంలో పుట్టి...శిఖరాన్ని అధిరోహించిన కరీంనగర్ బిడ్డ.అసలు ‘బులంద్’ అంటేనే ఎల్తైన, ఉన్నతమైన అని అర్థం.మన తెలుగు బిడ్డ బానోత్ చంద్రకళ...యూపీలోని బులంద్ శహర్‌ని పాలించింది.ఆలోచన గొప్పదైనప్పుడు...ఆశయం ఉన్నతమైనదైనప్పుడు...లక్ష్యం ఎల్తైనదైనప్పుడు...కీర్తి... కిరీటమవుతుంది.బానోత్ చంద్రకళ, ఐఏఎస్... మన తెలుగింటి అమ్మాయి. కరీంనగర్ జిల్లాలో పుట్టింది. ఉత్తర ప్రదేశ్‌లో అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతోంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి మగవాళ్లు కూడా భయపడతారు. అలాంటిది 38 ఏళ్ల చంద్రకళ పదేళ్లు అక్కడ నెగ్గుకు వచ్చింది. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలోనూ నిజాయితీ కలిగిన మంచి చురుకైన అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. యోగి ఆదిత్యనాథ్ హయాంలోనూ అదే గౌరవాన్ని అందుకుంది. ఐఏఎస్ కావడానికి చంద్రకళ పుట్టిల్లు వడ్డించిన విస్తరేమీ కాదు. ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చిందామె. ఒక్కొక్క మెట్టునూ అధిరోహిస్తూ విజయాన్ని తన దగ్గరకు తెచ్చుకుంది. సామాన్య కుటుంబం కరీంనగర్ జిల్లా, ఎల్లారెడ్డి మండలం, గర్జన పల్లి గ్రామం ఆమెది. పెద్దగా సౌకర్యాల్లేని లంబాడా తండా అది. తండ్రి కిషన్ రామగుండం ఎరువుల కంపెనీలో ఫోర్మన్. మొత్తం నలుగురు పిల్లలు, అన్న రఘువీర్, తమ్ముడు మహావీర్, చెల్లెలు మీనా. చంద్రకళ తల్లి లక్ష్మికి పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనే కల ఉండేది. కానీ కోఠీ ఉమెన్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే పెళ్లి చేశారు. పెళ్లి తరవాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో ఎం.ఏ పట్టా అందుకుంది. గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరవాత ప్రతి అడుగునూ ఒక చాలెంజ్‌గానే వేసింది. ఒక సవాల్‌ని ఎదుర్కొంటున్నట్లు ప్రిపేరైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో టాపర్. సివిల్ సర్వీసెస్‌లో 2008లో 409వ ర్యాంకుతో ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా నియామకం. లక్ష్మి నలుగురు పిల్లల్లో అత్యున్నత స్థాయికి చేరిన బిడ్డ చంద్రకళ. ఈ సంతోషం లక్ష్మికి మాత్రమే కాదు చుట్టుపక్కల అనేక లంబాడా తండాల జనం కలెక్టరయింది తమింటి బిడ్డే అన్నంతగా సంతోషించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బులంద్ శహర్, బిజౌర్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో పనిచేసింది. కలెక్టర్‌గా బాధ్యతల నిర్వహణలో రాజీ పడని అధికారిగా, హార్డ్ వర్కర్ అనే గుర్తింపు వచ్చిందామెకు. ఆగని పయనం ప్రయాణానికి గమ్యం ఉండాలి, జీవితానికి లక్ష్యం ఉండాలి. గమ్యం లేని ప్రయాణానికి, లక్ష్యం లేని జీవితానికీ అర్థం ఉండదు. అందుకు చంద్రకళ ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లల్ని పెద్ద హోదాల్లో చూడాలనే తపన తప్ప ఏం చదివించాలో తెలియని అమాయకత్వం లక్ష్మిది. మార్గదర్శనం చేసేవాళ్లు లేకపోవడంతో కొంతకాలం తడబాట్లతో సాగింది చంద్రకళ పయనం. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే... లక్ష్యం అంటూ స్థిరంగా ఏర్పరుచుకోక ముందు కూడా ప్రయాణం ఆపలేదామె. తనకు ఇష్టమైన కోర్సులో కొనసాగింది. మెదడులో ఒకసారి కెరీర్ అనే బీజం పడిన తర్వాత ఇక వెనక్కి చూసుకోలేదు. అందరిలో ఒకరిగా కాదు, పదిమందిలో గౌరవం అందుకునే బాధ్యతాయుతమైన హోదాలో జీవించాలనే కోరిక ఆమె బుర్రలో పడిన తర్వాత ఆమెకు ఏదీ కష్టంగా అనిపించలేదు. గర్భిణిగా బిడ్డను మోస్తున్నప్పుడు కానీ, బిడ్డకు తల్లి అయిన తర్వాత కానీ ఆమె ప్రిపరేషన్లో విరామం తీసుకోలేదు. మోదీ స్ఫూర్తితో... సాధారణ పాలనాధికారాలు, బాధ్యతలతోపాటు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాల్లో స్వచ్ఛభారత్‌ను ప్రత్యేక శ్రద్ధతో నిర్వర్తిస్తోందామె. ఢిల్లీ నగరం దాటి ఉత్తరప్రదేశ్‌లో అడుగు పెట్టగానే సరిహద్దు దాటామనే సంగతి సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి వీధుల్లో రాజ్యమేలే చెత్త స్వాగతం పలుకుతుంటుంది. అలాంటి రాష్ట్రంలో స్వచ్ఛభారత్ కోసం రోజుకు ఇరవై గంటలైనా పని చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రకళ స్వచ్ఛభారత్ ప్రోగ్రామ్‌ను వాడవాడలా అమలు చేయించడానికి కంకణం కట్టుకుంది. ఇంతలో ప్రధాని అధికార కార్యాలయం ఆమె సేవలను కోరుకుంది. చంద్రకళను డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్కు డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డెప్యుటేషన్ మీద బదిలీ చేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం శ్రమించే చంద్రకళ ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావించింది. సోషల్ మీడియాలో చురుకు చంద్రకళకు ఇష్టమైన ఆట బ్యాడ్మింటన్. పుస్తకాలు చదవడం, చారిత్రక ప్రదేశాలు చూడడం, వంట చేయడం, యోగసాధన ఆమె హాబీలు. ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉండే చంద్రకళకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాగే కొద్దిపాటి విమర్శలు కూడా. సోషల్ మీడియాను పరిపాలన సౌలభ్యం కోసం కంటే ప్రచారానికే ఎక్కువగా వినియోగిస్తోందనే అపవాదు వచ్చి పడింది. ఆమెలో ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం రెండూ ఎక్కువే. ఆ లక్షణాలనే ఒక్కమాటలో ‘ఆమె అహంకారి’ అనేసే వాళ్లూ ఉన్నారు. వృత్తిపరమైన విధుల నిర్వహణలో రాజీ పడనంత వరకు ఎవరికీ తలొగ్గాల్సిన పనిలేదనేది ఆమె ఫిలాసఫీ. మూడేళ్ల కిందట బులంద్ శహర్ జిల్లాలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది చంద్రకళ. మహమూద్‌పూర్‌లో కొత్తగా వేసిన రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం నాసిరకంగా ఉంది. కొన్ని టైల్స్ పగిలిపోయి ఉన్నాయి, కొన్నయితే ఆనవాలుకు కూడా లేవు. ఆ రోడ్లను చూసి ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మీకిది అవమానంగా లేదా? ఇది ప్రజల డబ్బు. ఈ నష్టాన్ని మీ జీతాల నుంచి కట్టిస్తారా. మీరు రాత్రి వేసిన రోడ్లు ఉదయానికి పగిలిపోతాయా’ అంటూ మున్సిపల్ అధికార్లను, కాంట్రాక్టర్‌ను గట్టిగా మందలించింది. ఆ వీడియో వైరల్ అయింది. పై ఫొటో ఆ వీడియోలోదే.ఆమె ఆగ్రహం అధికారులకు, రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు కష్టంగా అనిపించింది. సామాన్య ప్రజలు మాత్రం... ఇలాంటి అధికారులుంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. అప్పుడప్పుడూ అయినా ఇలాంటి వాళ్లు వస్తుంటే గ్రామాలు, పట్టణాలు బాగుపడతాయనుకున్నారు. రోడ్ల తనిఖీ తర్వాత ఆమె ఆరోజు సికందరాబాద్లో 36 గంటల పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏడు బృందాలు, ఒక్కో బృందంలో అరవై మంది పాల్గొన్న పరిశుభ్రత ప్రోగ్రామ్‌లో 36 గంటల్లో జిల్లాలోని ప్రధాన కూడళ్లన్నీ శుభ్రమయ్యాయి. – మంజీర -
షికాగో సెక్స్‌రాకెట్ .. ఎవరీ ABCDE?
చికాగో : తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సెక్స్ రాకెట్ డైరీలో ఏపీ మంత్రి ? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్‌కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అసోసియేషన్ల పేరుతో వీసాలు.. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది. విచారణ జరిగిందిలా.. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మన దేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. విచారణకు సహకరిస్తాం : సతీష్ వేమన సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు. -
నాకు మూడు పెళ్లిళ్లు అవలేదు..
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తన భర్త గురుప్రసాద్తోపాటు తిరుపతి శివజ్యోతినగర్‌కు చెందిన గిరిబాబు, అతని భార్య నాగమణి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రకళ తెలిపారు. ఆమె బుధవారం తల్లిదండ్రులతో కలిసి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన శీనయ్య, సిద్ధేశ్వరి కుమారుడు గురుప్రసాద్‌తో తనకు 2005 వివాహమైందన్నారు. తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని తెలిపారు. తన అత్త సిద్ధేశ్వరి కువైట్‌లో ఉండేదని, తన భర్త అక్కడికి వెళ్లాలనే మామతో కలిసి వేధింపులకు గురిచేశాడన్నారు. 2012లో తనను బెంగళూరులో వదిలి కువైట్‌కు వెళ్లిపోయాడని తెలిపారు. పిల్లలతో కలిసి మదనపల్లె– కదిరి బైపాస్ రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ స్కూల్లో స్వీపర్‌గా చేరానన్నారు. ఈ తరుణంలో ఇంటి పక్కన ఉన్న నాగమణి, గిరిబాబు దంపతులు పరిచయమయ్యారని పేర్కొన్నారు. గురుప్రసాద్ నిషేధిత గుట్కా, హాన్స్, సిగరెట్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కినట్టు తెలిపారు. గుట్కాలను తన ఇంటిలో ఉంచుకోలేదనే కోపం పెంచుకున్నాడని, తాము చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలను చూపిస్తూ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. తిరుపతి శివజ్యోతినగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చినా గిరిబాబు తనను ఇబ్బంది పెడుతు న్నాడని వాపోయింది. తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కేసు పెట్టానన్న అక్కసుతో గిరిబాబు ఇంట్లో రూ.7 లక్షలు దొంగతనం చేసినట్టు తనపై నిందారోపణలు చేశారన్నారు. ఈ సమావేశంలో ఎస్.గౌరీశంకర్, ఆమె తల్లి రత్నమ్మ పాల్గొన్నారు. -
ఇద్దరు వివాహితల బలవన్మరణం
పరిగి (పెనుకొండ) : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిగి మండలం ఎస్.బీరేపల్లిలో కంసల అశ్వత్థచారి భార్య ప్రభావతి(30) అనే వివాహిత శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అంజనయ్య శనివారం తెలిపారు. దంపతులిద్దరూ గతంలో గార్మెంట్‌కు వెళ్లేవారన్నారు. అయితే కొంతకాలంగా ప్రభావతి ఇంట్లోనే ఉంటుండగా, భర్త ఒక్కడే వెళ్లేవాడని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటి తలుపులు తీయకపోగా, రాత్రి ఇంటికొచ్చిన భర్త పిలిచినా పలక్కపోవడంతో అనుమానంతో లోపలకి తొంగి చూడగా.. ఇనుప తీర్లకు వేసిన ఉరికి వేలాడుతూ కనిపించిందన్నారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరవకూరులో మరొకరు.. కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం అరవకూరులో చంద్రకళ(26) అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. భార్యాభర్తల మధ్య శుక్రవారం గొడవ జరిగిందని వివరించారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె రాత్రైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. రాత్రి పొద్దుపోయాక నీరున్న బావిలో మృతదేహమై తేలియాడుతుండగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
మోదీ బృందంలో తెలంగాణ యువ ఐఏఎస్
చంద్రకళకు అరుదైన గౌరవం మీరట్: సమర్థత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ బిడ్డ, ఐఏఎస్ అధికారి బి.చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న ఈమెకు ప్రధాని మోదీ డ్రీమ్ టీమ్‌లో చోటు దక్కింది. 2008వ బ్యాచ్‌కు చెందిన యూపీ క్యాడర్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం సంచలనంగా మారారు. నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులపై ఆమె కఠినంగా వ్యవహరించారు. ఆ ఘటన సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారింది. నిజాయతీ గల ఆఫీసర్ అన్న పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఆ ఆఫీసర్‌కు ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు ఇచ్చారు. చంద్రకళను మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్‌గా నియమించారు. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖలో ఆమెకు ఉప కార్యదర్శి బాధత్యలను అప్పగించారు. బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా కార్యక్రమం అమలు కోసం ఆమె బాగా ప్రచారం చేసి విజయం సాధించారు. -
తల్లి పాలు ఇవ్వకుండా ఐదు నెలలుగా..!
హైదరాబాద్: తన మనవడికి తల్లిపాలు ఇవ్వకుండా అల్లుడు అడ్డుపడుతున్నాడని చంద్రకళ అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు (మంగళవారం) బాలల హక్కుల సంఘంను ఆశ్రయించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని వర్జీనియాలో చంద్రకళ కూతురు శిరీష ఉంటోంది. ఆమెకు ఐదు నెలల బాబు ఉన్నాడు. అయితే, పుట్టినప్పటి నుంచీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా అల్లుడు కీర్తిసాయిరెడ్డి అడ్డుకుంటున్నాడు. ఈ విషయంపై అతని తల్లి కూడా తల్లిపాలు బిడ్డకు ఇవ్వొద్దంటూ స్కైప్ ద్వారా మాట్లాడి చెప్పింది. తన కూతురు శిరీషను వేధిస్తున్న ఆమె భర్త కీర్తిసాయిరెడ్డిపై చర్యలు తీసుకుని, తన మనవడికి తల్లిపాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీనిపై బాలల హక్కుల సంఘం తరఫున అచ్యుతరావు మాట్లాడుతూ.. ఈ విషయంపై ఇప్పటికే అమెరికా కాన్సులేట్లతో మాట్లాడామన్నారు. వేధింపులకు పాల్పడుతున్న కీర్తిసాయిరెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని కోరినట్లు తెలిపారు. -
కరెంటు షాక్‌తో మహిళ మృతి
ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ(40) అనే మహిళ కరెంటు షాక్‌తో బుధవారం మృతి చెందింది. ఇంట్లో నీళ్ల వేడిచేయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. -
కట్నం వేధింపులతో ఆత్మహత్య
కుందుర్పి : వరకట్న వేధింపులు, భర్త, అత్త పెట్టే చిత్రహింసలు భరించలేక బెస్తరపల్లికి చెందిన చంద్రకళ (29) ఆదివారం ఉదయం పుట్టినింటిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... బెస్తరపల్లికి చెందిన వడ్డె నారాయణమూర్తి మూడో కూతురు చంద్రకళ (29)కు కర్ణాటక మాగడి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి లీలావలి కుమారుడు జగన్నాథ్‌తో గత ఏఫ్రెల్ 4న ఘనంగా పెళ్లి జరిపించారు.కట్నకానుకల కింద 4 తులాల బంగారం, రూ. 25 వేల నగదును కానుకగా ఇచ్చారు. అదనపు కట్నం కోసం వేధింపులు ఏప్రిల్ 12న మెట్టినిల్లు మాగడికి వెళ్లిన చంద్రకళకు అదనపు కట్నం తీసుకురావాలని భర్త జగన్నాథ్, అత్త లీలావతి రోజూ వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుండడంతో తనను చంపుతారనే భయంతో జూన్ 2న పుట్టినిల్లు బెస్తరపల్లి వచ్చి తండ్రి మూర్తితో కలిసి కుందుర్పి పోలీస్షే్టషన్లో వరకట్న వేధింపులు, హత్యాయత్నం కింద భర్త జగన్నాథ్ అత్త లీలావతిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు జగన్నాథను 22 రోజులు రిమాండ్‌లో కూడా పెట్టారు. ఇటీవల విడుదలైన జగన్నాథ్, తల్లి వారం రోజుల క్రితం పోలీస్షే్టషన్కు వచ్చిన భార్య చంద్రకళను దుర్భాషలాడుతూ నాకు నీవు అవసరం లేదని త్వరలోనే వేరేపెళ్లి చే సుకుంటానని చెప్పాడు. ఎనిమిదేళ్లక్రితం తల్లిభాగ్యమ్మ చనిపోగా తండ్రి, తమ్ముడితో ఉంటున్న చంద్రకళకు భర్త వేధింపులు తోడై మనోవేదనతో కుంగిపోయేది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిపై తండ్రి మాట్లాడుతూ ’’ ఆదివారం తాను సొంతపనుల నిమిత్తం కళ్యాణదుర్గం వెళ్లగా తన కుమారుడు అనిల్‌కుమార్ (పెళ్లి కాలేదు) వ్యవసాయ తోటలోకి వెళ్లి ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. దూలానికి ఉరివేసుకొని వేలాడుతున్న చంద్రకళను చూసి విషయాన్ని ఫోన్లో చెప్పాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
నిలదీసిందని నిప్పు పెట్టారు...
కొడుకును ఎందుకు కొట్టారని అడిగినందుకు.. ఇంటిపై దాడి, మహిళపై పెట్రోల్ పోసి నిప్పు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న బాధితురాలు ఎనిమిది మంది రిమాండ్.. పరారీలో ఇద్దరు అడ్డగుట్ట: తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీసిన పాపానికి మహిళపై ఓ వ్యక్తి కక్షగట్టాడు. తన కుటుంబసభ్యులతో ఆమె ఇంటిపై దాడి చేశాడు. అందరినీ చితకబాదాడు. అడ్డువెళ్లిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం...అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన మల్లేష్ ఆదివారం తన వీధిలో నుంచి కారు తీస్తుండగా అదే ప్రాంతానికి చెందిన వేణు(11) అనే బాలుడు అడ్డంగా వచ్చాడు. ఆగ్రహానికి గురైన మల్లేష్ కారుదిగి ఆ బాలుడ్ని కొట్టాడు. ఇది గమనించిన శ్రీకాంత్ అనే యువకుడు ఎందుకుకొడుతున్నావని ప్రశ్నించడంతో మల్లేష్ అతడిని కూడా కొట్టాడు. దీంతో శ్రీకాంత్ తల్లి చంద్రకళ (40)(గాయపడిన మహిళ) వచ్చి ఎందుకు నా కొడుకును కొడుతున్నావని అడిగింది. దీంతో మల్లేష్-చంద్రకళల మధ్య వాగ్వాదం జరిగింది. బస్తీ నాయకులు వచ్చి ఉదయం మాట్లాడుదామని చెప్పి గొడవను అదుపు చేశారు. ఉదయాన్నే దారుణం... తనతో గొడవపడిన చంద్రకళపై కక్షగట్టిన మల్లేష్ సోమవారం ఉదయాన్నే తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశాడు. చంద్రకళ కుటుంబసభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. తన పిల్లలను కాపాడుకొనేందుకు అడ్డువెళ్లినచంద్రకళపై మల్లేష్ మేనల్లుడు బంటీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. కాలినగాయాలతో పడివున్న చంద్రకళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 30 శాతం కాలిన గాయాలతో చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ గొడవ కారణమైన మల్లేష్(50), శివకుమార్, పొట్టికుమార్, శివ, సాయికిరణ్, బంటి, వెంకటేష్, కేతమ్మ, శంకరమ్మ, సాలమ్మ (మొత్తం 10 మంది)పై పోలీసులు 147, 148, 149 ఐపీసీ, 307 కేసులు నమోదు చేశామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే శంకరమ్మ, సాలమ్మలు పరారీలో ఉన్నారని, మిగిలిన 8 మంది నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. -
ఆ వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయి: క్రాంతి
హైదరాబాద్ : తన భర్త రాసిన సూసైడ్‌నోట్‌లో ఉన్న అంశాలపై విచారణ జరపాలని హిమాయత్‌నగర్ కాల్పులు కేసుకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి డిమాండ్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టు రాకుండానే కేసును మూసేస్తామంటున్నారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. బయట వినిపిస్తున్న వార్తల వెనుక నిజాలు వేరే ఉన్నాయని క్రాంతి వ్యాఖ్యానించారు. లారెల్ ఆస్పత్రి లావాదేవీల్లో సమస్యలున్నాయని శశికుమార్ తనకు చెప్పారని ఆమె అన్నారు. ఉదయ్, సాయికుమార్, ఫోన్ చేస్తేనే శశి ఇంట్లో నుంచి వెళ్లారని క్రాంతి తెలిపారు. చంద్రకళ తన భర్తకు ఫ్రెండ్‌గానే తెలుసునని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ చంద్రకళ తనతో మాట్లాడింది లేదన్నారు. శశికుమార్ బ్రీఫ్ కేసుతో పాటు కారు కూడా ట్రేస్ అవుట్ అవలేదని, అవి రెండూ తనకు కావాలని క్రాంతి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ శశికుమార్ సూసైడ్ కేసును మొయినాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారణ జరుపుతారని కమలాసన్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయ్‌పై కాల్పులు జరిపింది శశికుమారేనని అన్నారు. ఇక బుల్లెట్ గాయమైన ఉదయ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. -
కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్
హైదరాబాద్ : హిమాయత్ నగర్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు చంద్రకళ స్టేట్మెంట్ను మంగళవారం నారాయణగూడ పోలీసులు రికార్డు చేశారు. చంద్రకళ ఏం చెప్పారంటే ' సోమవారం సాయంత్రం కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ నేరుగా నా నివాసానికి వచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని..ఫాంహౌస్‌కు తీసుకెళ్లాలని కోరాడు. నేను నా కారులో శశికుమార్‌ని ఫాంహౌస్‌కు తీసుకెళ్లాను. ఫాంహౌస్‌లో శశికుమార్‌ను విడిచిపెట్టి జాగ్రత్తగా చూసుకోమని వాచ్మెన్ శంకరయ్యకు చెప్పాను. నేను తిరిగి ఇంటికి వచ్చాక రాత్రి 10 గంటల పమయంలో వాచ్మెన్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్లోనే నేను శశికుమార్‌తో 10 నిమిషాలు మాట్లాడాను. తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులతో కలసి ఫాంహౌస్‌కు వెళ్లాను. అప్పటికే శశికుమార్ చనిపోయాడు'. వ్యాపార లావాదేవిలలో తగాదాల కారణంగా సోమవారం సాయంత్రం డాక్టర్ ఉదయ్ కుమార్‌పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
అది ఆత్మహత్య కాదు.. హత్యే: శశికుమార్ భార్య
హిమాయత్‌నగర్ కాల్పుల ఘటన రకరకాల మలుపులు తిరుగుతోంది. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన భర్తది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆయన భార్య క్రాంతి ఆరోపించారు. సాయికుమార్, ఉదయ్ కలిసి తన భర్తను హత్య చేయించారని ఆమె అన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఏకైక సాక్షి డాక్టర్ సాయికుమార్ ప్రస్తుతం నారాయణగూడ పోలీసుల అదుపులో ఉన్నారు. డాక్టర్ ఉదయ్ మీద ఎవరు కాల్పులు జరిపారన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులు తాను జరపలేదని, సాయికుమారే కాల్చాడని తన సూసైడ్ నోట్లో శశికుమార్ పేర్కొన్నారు. కానీ శశికుమారే తమ ఇద్దరిపై కాల్పులు జరిపాడని సాయికుమార్ అంటున్నారు. శశికుమార్‌ను తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన చంద్రకళను విచారించాలనే యోచనలో పోలీసులు కనిపిస్తున్నారు. కానీ కాల్పుల ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. ఇక శశికుమార్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడకు ఒక రంపం, కొడవలి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోడానికి రకరకాల మార్గాలు చూసుకుని, చివరకు తన రివాల్వర్‌తో కాల్చుకున్నారా.. లేక మరేదైనా అవసరం కోసం వాటిని తీసుకెళ్లారా అన్నది తెలియడం లేదు. తన భర్తను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిపించారని, తర్వాత కిరాయి హంతకులతో ఆయనను చంపించారని శశికుమార్ భార్య క్రాంతి చెబుతున్నారు. తన భర్తది ఆత్మహత్య కానే కాదని ఆమె గట్టిగా అంటున్నారు. -
ఇంటి గోడ కూలి ఇద్దరి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో మిద్దె కూలి చంద్రకళ(21) అనే బాలింత మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ బాగా తడిసినందువల్లే కూలిపోయిందని స్ధానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చంద్రకళ 15 రోజుల క్రితమ మగబిడ్డకు జన్మనించింది. ఈ ప్రమాదం నుంచి పసికందు క్షేమంగా బయటపడ్డాడు గోడకూలి చిన్నారి మృతి రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లెలో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. అల్పపీడనం కారణంగా రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు ఇంటి గోడ కూలడంతో అచ్యుత్ అనే బాలుడు మృతి చెందాడు. -
బి.నర్సింగరావు తల్లి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు బి. నర్సింగరావు తల్లి చంద్రకళ గురువారం తెల్లవారుజామున మరణించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11.00 గంటలకు ప్రజ్ఞాపూర్‌లో జరుగుతాయని కటుంబ సభ్యులు తెలిపారు.