మోదీ బృందంలో తెలంగాణ యువ ఐఏఎస్
చంద్రకళకు అరుదైన గౌరవం
మీరట్: సమర్థత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ బిడ్డ, ఐఏఎస్ అధికారి బి.చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న ఈమెకు ప్రధాని మోదీ డ్రీమ్ టీమ్‌లో చోటు దక్కింది. 2008వ బ్యాచ్‌కు చెందిన యూపీ క్యాడర్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం సంచలనంగా మారారు. నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులపై ఆమె కఠినంగా వ్యవహరించారు. ఆ ఘటన సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారింది.
నిజాయతీ గల ఆఫీసర్ అన్న పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఆ ఆఫీసర్‌కు ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు ఇచ్చారు. చంద్రకళను మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్‌గా నియమించారు. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖలో ఆమెకు ఉప కార్యదర్శి బాధత్యలను అప్పగించారు. బులందర్‌షెహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా కార్యక్రమం అమలు కోసం ఆమె బాగా ప్రచారం చేసి విజయం సాధించారు.