కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్ | chandrakala statement on himayat nagar firing case | Sakshi
Sakshi News home page

కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్

Published Tue, Feb 9 2016 3:07 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్ - Sakshi

కాల్పుల కేసులో చంద్రకళ స్టేట్మెంట్

హైదరాబాద్ : హిమాయత్ నగర్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్ శశికుమార్ స్నేహితురాలు చంద్రకళ స్టేట్మెంట్ను మంగళవారం నారాయణగూడ పోలీసులు రికార్డు చేశారు.

చంద్రకళ ఏం చెప్పారంటే ' సోమవారం సాయంత్రం కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ నేరుగా నా నివాసానికి వచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని..ఫాంహౌస్కు తీసుకెళ్లాలని కోరాడు. నేను నా కారులో శశికుమార్ని ఫాంహౌస్కు తీసుకెళ్లాను. ఫాంహౌస్లో శశికుమార్ను విడిచిపెట్టి జాగ్రత్తగా చూసుకోమని వాచ్మెన్ శంకరయ్యకు చెప్పాను. నేను తిరిగి ఇంటికి వచ్చాక రాత్రి 10 గంటల పమయంలో వాచ్మెన్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్లోనే నేను శశికుమార్తో 10 నిమిషాలు మాట్లాడాను. తాను ఆత్మహత్య చేసుకుంటాన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులతో కలసి ఫాంహౌస్కు వెళ్లాను. అప్పటికే శశికుమార్ చనిపోయాడు'. వ్యాపార లావాదేవిలలో తగాదాల కారణంగా సోమవారం సాయంత్రం డాక్టర్ ఉదయ్ కుమార్పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement