
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ ప్రాంతానికి చెందిన బోడ చంద్రకళ అనే మహిళకు బలవంతంగా కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించిన గోవర్దన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నటేశ్ తెలిపారు. చంద్రకళ విద్యుత్ శాఖలో ఫిల్టర్ మెకానిక్ గ్రిడ్‌గా పని చేస్తుంది. అదే శాఖలో పని చేసే గోవర్దన్ అక్టోబర్ 30న కూల్‌డ్రింక్ తీసుకొచ్చి చంద్రకళకు ఇవ్వగా.. ఆమె తాగేందుకు నిరాకరించింది. బలవంతం చేయడంతో ఆమె కూల్‌డ్రింక్ తాగగా.. అస్వస్థతకు గురైంది. ఫోన్లో భర్త బోడ మోహన్‌కు సమాచారమందించింది. మోహన్ కార్యాలయానికి వెళ్లి చంద్రకళను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు కూల్‌డ్రింక్‌లో విషం కలపడం వల్లే అస్వస్థతకు గురైందని వెల్లడించారు. మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇవి చదవండి: ‘ఎల్‌ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. యువకుడు..
Comments
Please login to add a commentAdd a comment