govardan
-
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. బలవంతంగా తాగించి.. ఆపై..
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ ప్రాంతానికి చెందిన బోడ చంద్రకళ అనే మహిళకు బలవంతంగా కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించిన గోవర్దన్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నటేశ్ తెలిపారు. చంద్రకళ విద్యుత్ శాఖలో ఫిల్టర్ మెకానిక్ గ్రిడ్‌గా పని చేస్తుంది. అదే శాఖలో పని చేసే గోవర్దన్ అక్టోబర్ 30న కూల్‌డ్రింక్ తీసుకొచ్చి చంద్రకళకు ఇవ్వగా.. ఆమె తాగేందుకు నిరాకరించింది. బలవంతం చేయడంతో ఆమె కూల్‌డ్రింక్ తాగగా.. అస్వస్థతకు గురైంది. ఫోన్లో భర్త బోడ మోహన్‌కు సమాచారమందించింది. మోహన్ కార్యాలయానికి వెళ్లి చంద్రకళను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు కూల్‌డ్రింక్‌లో విషం కలపడం వల్లే అస్వస్థతకు గురైందని వెల్లడించారు. మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇవి చదవండి: ‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. యువకుడు.. -
అన్నదాతను ఆదుకునేందుకే రైతుబంధు
కామారెడ్డి రూరల్ : రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం మండలంలోని నర్సన్నపల్లి, క్యాసంపల్లిల్లో రైతులకు చెక్కులను, పట్టాపాసు పుస్తకాలను అందజేశారు. సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన సీఎం కేసీఆర్ వారి కష్టాలను గ్రహించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతులకు కావాల్సింది కరెంట్, నీళ్లు, పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వస్తే కరెంట్ లేక చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన ఆంధ్రోళ్ల మాటలకు రెండున్నరేళ్లలోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు, పోచంపాడ్ పెద్ద కాలువ నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చే రెండేళ్లలో లక్ష ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 70 ఏళ్లలో ఎంతో మంది సీఎంలు, పీఎంలు, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్నారు. 81 ఏళ్ల కింద నైజాం కాలం నాటి భూ రికార్డులను ప్రక్షాళన చేసి నూతనంగా డిజిటల్ పాసు పుస్తకాలను అందించడం గొప్ప విషయమన్నారు. అన్నం పెట్టె రైతన్న ఆనందంగా ఉండాలనే రైతుబంధు పథకంలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. భూమిని నమ్ముకున్న రైతులకు బంగారాన్ని పండించే ధైర్యం ఉందన్నారు. రాష్ట్ర ఆహార సంస్థ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి, సర్పంచ్‌లు కుర్ర ఎల్లయ్య, కట్లకుంట భారతి రాజయ్య, ఎంపీపీ లద్దూరి మంగమ్మలక్ష్మీపతియాదవ్, వైస్ ఎంపీపీ పోలీస్ క్రిష్ణాజీరావు, మండల ప్రత్యేకాధికారి సిద్దిరాములు, రైతు సమ్వయ సమితి జిల్లా సభ్యుడు మట్టెమల్ల లింగం, ఏఎంసీ చైర్మన్ గట్టగోని రాజమణి గోపిగౌడ్, వైస్ చైర్మన్ గౌరీశంకర్, పిప్పిరి ఆంజనేయులు, ఆకుల నాగభూషణం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి, రాజయ్య, ఉపసర్పంచ్లు బాలయ్య, రాజిరెడ్డి, ద్యాపరాజు, తహసీల్దార్ రవీందర్, డీటీ ప్రేంకుమార్, వీఆర్వోలు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కామారెడ్డి రూరల్ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ లద్దూరి మంగమ్మ అన్నారు. శనివారం మండలంలోని దేవునిపల్లిలో రైతుబంధు చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ పెట్టుబడి పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న ఈ డబ్బులను కచ్చితంగా ఎరువులు, విత్తనాల కోసం వాడుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు నీళ్లు అందించేందుకు ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. వైస్ ఎంపీపీ పోలీసు క్రిష్ణాజీరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిట్టు లింగారావు, గ్రామ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు, మాజీ సర్పంచ్ శివాజీ గణేష్‌యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్‌రావు, మట్టెమల్ల లింగం, ఆకుల నాగభూషణం, గోపిగౌడ్, పిప్పిరి ఆంజనేయులు, మండల ప్రత్యేకాధికారి సిద్దిరాములు, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఆర్ఐ నవీన్, వీఆర్వోలు ప్రసాద్‌రెడ్డి, సాయిలు పాల్గొన్నారు. -
కొలిక్కి వచ్చిన హత్యకేసు దర్యాప్తు
పొదలకూరు : నెల్లూరు నగరంలో నివాసం ఉంటున్న పీవీఆర్ చికెన్స్ దుకాణం కలెక్షన్ ఏజెంట్ చక్రం గోవర్ధన్ హత్య కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలిసింది. హత్యలో ఆరుగురు వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ హత్య కేసును పొదలకూరు సీఐ ఏ శివరామకృష్ణారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. కేసులో త్వరితగతిన పురోగతి సాధించారు. ఈ నెల 14వ తేదీన గోవర్ధన్ హత్యకు గురై, మృతదేహాన్ని మండలంలోని బ్రాహ్మణపల్లి శ్మశానానికి సమీపంలో గుర్తించిన విషయం తెలిసిందే. 11వ తేదీన గోవర్ధన్ అదృశ్యమైనట్టు గూడూరు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హతుడు భార్య పొదలకూరు స్టేషన్‌కు వచ్చి ప్రాథమిక సమాచారం అందించారు. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు హంతకులను గుర్తించారు. మైపాడు ప్రాంతానికి చెందిన యువకుడు హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గోవర్ధన్‌కు నిందితుడికి గతంలో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో హతుడి కదలికలపై నిఘా పెట్టిన హంతకుడు తన స్నేహితులను కలుపుకుని హత్య చేసినట్టుగా తెలిసింది. హత్యకు జార్ఖాండ్ నుంచి తీసుకువచ్చిన పిస్టల్‌ను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. గోవర్ధన్‌ను హత్య చేసి బ్రాహ్మణపల్లి సమీపంలోని శ్మశానం వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లారు. హత్య జరిగిన సమయంలో గోవర్ధన్ వద్ద కలెక్షన్ నగదు కూడా ఉన్నట్టు తెలిసింది. మృతుడి వద్ద ఏ మేరకు నగదు ఉన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కొలిక్కి వచ్చిన హత్య కేసు నిందితులను త్వరలో అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. -
కదం తొక్కిన అంగన్వాడీలు
ఇందూరు/కామారెడ్డి/బోధన్/న్యూస్‌లైన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కదం తొక్కారు. బుధవారం నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ ఆర్డీవో కార్యాలయాల ఎదుట జిల్లాలోని ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు. బోధన్‌లో.. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగించారు. ఇక్కడ నిజామాబాద్, మహారాష్ట్ర, బాన్సువాడ వైపు వెళ్లే ప్రధాన రహదారులను గంట పాటు దిగ్బంధించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి రమాదేవి, సీఐటీయూ డివిజన్ నాయకులు జె. శంకర్‌గౌడ్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డిలో... స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పది మండలాలకు చెందిన అంగన్వాడీకార్యకర్తలు, ఆ యాలు మహా ధర్నా నిర్వహించారు. నిజాం సాగర్ చౌరస్తాలో మానవహారం,రాస్తారోకో, ధ ర్నా నిర్వహించారు.స్థానిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జిల్లాకేంద్రంలో... సమస్యలపై స్పందించకుంటే ఈనెల 21న ఐసీడీఎస్ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వానికి హెచ్చరించారు.సమ్మెలో భాగంగా బుధవారం నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ముందు బైటాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు గోవర్థన్ మాట్లాడుతూ... ప్రభుత్వ వైఖరి కొనసాగితే 21న ఐసీడీఎస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.అనంతరం ఆర్డీవో యాదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ర్యాలీగా కోర్టు వరకు చేరుకుని పొట్టి శ్రీరాములు చౌరస్తాలో భారీ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగ సంఘం నాయకులు సులోచన, హైమావతి, స్వర్ణ, సువర్ణ, సూర్యకళ పాల్గొన్నారు. -
‘ఆల్విన్‘ భూమి స్వాధీనం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పట్టణంలో సర్వే నెం. 203/4లో గల 11 ఎకరాల ‘ఆల్విన్’ స్థలాన్ని స్థానిక తహశీల్దార్ గోవర్ధన్ తన సిబ్బందితో కలిసి సర్వే జరిపి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పరిశ్రమల స్థాపన కోసం ఆల్విన్ సంస్థకు 1982లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నంబర్ 203/4లో 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. మార్కెట్ ధరను చెల్లించి భూములను ఆల్విన్ సంస్థ కొనుగోలు చేసినా పారిశ్రామిక అవసరాల కోసమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. పరిశ్రమ ఏర్పాటైనా కొంత కాలానికి మూతబడింది. ఆ తర్వాత ఆల్విన్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. దీంతో కొనుగోలు చేసిన వారు ఈ 11 ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించారు. హెచ్ఎండీఏ అనుమతి సైతం లభించడంతో అమాయక జనం కొనుగోలు చేశారు. 187 ప్లాట్లలో 15 మాత్రమే అమ్ముడుబోయాయి. దీంతో శనివారం అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా రియల్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. మహేష్ అనే వ్యాపారి మాట్లాడుతూ ప్రభుత్వానికి రూ. 80 లక్షల ట్యాక్స్‌ను చెల్లించి అనుమతి పొందామన్నారు. అయినా అధికారులు భూ మిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహశీలార్ గోవర్ధన్ మాట్లాడుతూ పహాణీ తదితర రెవెన్యూ రికార్డుల్లో సైతం ఆల్విన్ సంస్థ పేరును తొలగించి ప్రభుత్వ భూమిగా మార్పు చేర్పులు చేసినట్లు వివరించారు. సెలవులు ముగిసిన తర్వాత ఈ నెల 16న ఆన్లైన్ రికార్డుల్లో సైతం మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు శుక్రవారం జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖ రాసినట్లు ఆయన వివరించారు. ఆల్విన్‌కు కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని సర్వే చేయగా.. అందులో మరో 5 గుంటలను అదనంగా కలుపుకుని వెంచర్లు వేసినట్లు వెలుగు చూసింది. ఈ స్థలం ప్రైవేటుదా ? ప్రభుత్వానిదా ? అన్నది తేలాల్సి ఉంది.