ఏపీ భట్రాజుల సంఘం మహిళా అధ్యక్షురాలు చంద్రకళ
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ భట్రాజుల సంఘం మహిళా అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో చంద్రకళ మాట్లాడుతూ..చంద్రబాబు వ్యాఖ్యలు యావత్ భట్రాజుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. మీ ఉపమాన ఉపమేయాల కోసం ఆత్మగౌరవంతో విద్యను నమ్ముకుని బతికే మమ్మల్ని అవమానపరుస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే భేషరుతుగా భట్రాజులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏపీలో ఉన్న 8 లక్షల మంది భట్రాజులందరూ ఏకమై వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
మా భట్రాజుల ఫెడరేషన్‌కు పాలకమండలి వేయరు, మా సంక్షేమానికి సహకరించరు గానీ మాపై నోరు పారేసుకుంటారా అని తీవ్రంగా మండిపడ్డారు. గతంలో గద్దర్ ఇలానే అని బహిరంగా క్షమాపణ చెప్పారు..ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించకపోతే తెలంగాణ డీజీపీకి చంద్రబాబు నాయుడిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ను కూడా కలిసి విషయం చెబుతామని, ఇతర బీసీ సామాజికవర్గాలన్నింటినీ కలుపుకుని చంద్రబాబుకు తగిన బుద్ధిచెబుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment