విలేకరుల సమావేశంలో చంద్రకళ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తన భర్త గురుప్రసాద్‌తోపాటు తిరుపతి శివజ్యోతినగర్‌కు చెందిన గిరిబాబు, అతని భార్య నాగమణి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రకళ తెలిపారు. ఆమె బుధవారం తల్లిదండ్రులతో కలిసి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన శీనయ్య, సిద్ధేశ్వరి కుమారుడు గురుప్రసాద్‌తో తనకు 2005 వివాహమైందన్నారు. తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని తెలిపారు. తన అత్త సిద్ధేశ్వరి కువైట్‌లో ఉండేదని, తన భర్త అక్కడికి వెళ్లాలనే మామతో కలిసి వేధింపులకు గురిచేశాడన్నారు.
2012లో తనను బెంగళూరులో వదిలి కువైట్‌కు వెళ్లిపోయాడని తెలిపారు. పిల్లలతో కలిసి మదనపల్లె– కదిరి బైపాస్ రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో స్వీపర్‌గా చేరానన్నారు. ఈ తరుణంలో ఇంటి పక్కన ఉన్న నాగమణి, గిరిబాబు దంపతులు పరిచయమయ్యారని పేర్కొన్నారు. గురుప్రసాద్ నిషేధిత గుట్కా, హాన్స్, సిగరెట్లు విక్రయిస్తూ పోలీసులకు చిక్కినట్టు తెలిపారు. గుట్కాలను తన ఇంటిలో ఉంచుకోలేదనే కోపం పెంచుకున్నాడని, తాము చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలను చూపిస్తూ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. తిరుపతి శివజ్యోతినగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చినా గిరిబాబు తనను ఇబ్బంది పెడుతు న్నాడని వాపోయింది. తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కేసు పెట్టానన్న అక్కసుతో గిరిబాబు ఇంట్లో రూ.7 లక్షలు దొంగతనం చేసినట్టు తనపై నిందారోపణలు చేశారన్నారు. ఈ సమావేశంలో ఎస్.గౌరీశంకర్, ఆమె తల్లి రత్నమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment