కాంట్రాక్టర్లకు క్లాస్ పీకిన చంద్రకళ | Woman IAS Officer Fires Away At Bulandshahr Civic Officials | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లకు క్లాస్ పీకిన చంద్రకళ

Published Fri, Dec 19 2014 1:47 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

కాంట్రాక్టర్లకు క్లాస్ పీకిన చంద్రకళ - Sakshi

కాంట్రాక్టర్లకు క్లాస్ పీకిన చంద్రకళ

* ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ ఐఏఎస్ చంద్రకళ
* నాణ్యతలేని రహదారి పనులు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు
* స్కూల్ విద్యార్థుల్లా వారిని నిలబెట్టి మరీ క్లాస్ పీకిన వైనం
* సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో వీడియో హల్‌చల్

బులంద్‌షహర్ (యూపీ): తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి బి.చంద్రకళ ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటుతున్నారు. అక్రమాలకు పాల్పడే అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపడం ద్వారా నిజాయితీకి మారు పేరుగా నిలుస్తున్నారు. బులంద్‌షహర్ జిల్లా కలెక్టర్ అయిన చంద్రకళ... రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను స్కూల్ పిల్లల్లా వరుసలో నిలబెట్టి మరీ క్లాస్ పీకారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తోంది. ఫేస్‌బుక్‌లో ఇప్పటివరకూ 6 లక్షల మంది ఈ వీడియోను చూశారు! దాంతో ఆమె ఒక్కసారిగా జాతీయస్థాయి వార్తల్లో నిలిచారు.

బుధవారం బులంద్‌షహర్ జిల్లాలో పలు రహదారుల పనుల తీరును ఆమె పర్యవేక్షించారు. నాసిరకం ఇటుకలు, టైల్స్ వాడినట్టు ఈ సందర్భంగా గుర్తించారు. దాంతో జూనియర్ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లపైనా ప్రజల సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణకు ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 కాంట్రాక్టులను రద్దు చేశారు. ‘‘మీరు చేసే పని ఇదేనా? మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీలో కొద్దిగైనా నైతికత అనేది ఉందా? మీరు సిగ్గుతో తలదించుకోవాలి’’ అంటూ వారిపై మండిపడ్డారు.

యూపీ కేడర్‌కు చెందిన చంద్రకళ గతంలో మథుర కలెక్టర్‌గా చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా అక్కడి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఈ మధ్య ఆమె బులంద్‌షహర్‌కు బదిలీ కావడంతో మథుర జిల్లా ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నందు వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఆమెను బదిలీ చేసినట్టు చెబుతున్నారు.

గిరిజన తెగకు చెందిన బుఖ్యా చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా రామగుండం. పాఠశాల విద్యను రామగుండంలోనే అభ్యసించిన ఆమె డిగ్రీ, పీజీలను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 2008లో సివిల్స్ పరీక్షల్లో 409వ ర్యాం కు సాధించారు. ఆమె భర్త ఎ.రాములు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement