విజయవాడ: చిట్టినగర్లో ఓ అత్త కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం చేసింది. బాధితురాలు చంద్రకళ కథనం ప్రకారం ఆమెకు చిన్న వయసులో 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పది ఏళ్ల వరకు భర్త ఆమెను బాగానే చూసుకున్నాడు. ఇటీవల ఆమె పిల్లలకు కుటుంబ ఆస్తి కలసి వచ్చింది. అప్పటి నుంచి భర్త, అత్త ఆమెను వేధించసాగారు. కొట్టడం, తిట్టడంతోపాటు ఆమెకు తిండి కూడా పెట్టడంలేదు. కొడుక్కి మరో పెళ్లి చేస్తానని అత్త కొడలిని బెదిరించడం మొదలు పెట్టింది.
చివరకు కోడలి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించింది. దాంతో చంద్రకళ న్యాయం కోసం చిట్టినగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అత్తని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు కోర్టుల చుట్టూ తిరిగే శక్తిలేదని చెప్పింది. తన భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె పోలీసులను కోరుతోంది.